5 లక్షల లోపు లభించే బడ్జెట్ కార్లు.. ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు మాత్రమే, 34 కి.మీ మైలేజీ
ప్రస్తుతం దేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. సొంత ఇళ్లు కల వలె సొంత కారు అనే కాన్సెప్ట్ కూడా జనాల్లోకి వేగంగా వెళ్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ కార్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు. అందుకు తగినట్లుగానే పలు కంపెనీలు తక్కువ ధరలో కార్లను విడుదల చేస్తూ మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా కొన్ని కార్లు అతి తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో కూడిన కార్లను అందిస్తున్నాయి. కేవలం 4 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లో కొన్ని ఫేమస్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సులువుగా నలుగురు ప్రయాణించవచ్చు. ఈ కార్లు ఇచ్చే మైలేజీ వాటి ధరల వివరాలు మీకోసం..
మారుతి ఆల్టోK10: మారుతి నుంచి తక్కువ ధరలో మధ్య తరగతి కుటుంబాలకు మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ ఉంది. ఈ కారు ధర రూ .3.99 లక్షల నుంచి రూ .5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 24.39 - 24.90 కి.మీ, సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 33.40 - 33.85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
ఆల్టో చిన్న కారుగా ఉంది.

ఇందులో 4 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
వ్యాగన్ ఆర్: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ చిన్న కుటుంబాలకు మరింత అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ .5.54 - రూ .7.38 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. పెట్రోల్ ఇంజిన్ లీటర్‌కి 23.56 నుంచి 24.43 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. అలాగే సీఎన్‌జీ ఇంజిన్ కిలోకు 34.05 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. ఈ కారులో 5 మంది వరకు ప్రయాణించవచ్చు.

7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ల్పే, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ సెనర్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కొత్త వ్యాగన్ఆర్ మోడల్ రెడ్, బ్లూ, సుపీరియర్ వైట్ కలర్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో లెగ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సులభంగా ఇందులో ప్రయాణించవచ్చు.
రెనాల్ట్ క్విడ్: రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ రూ .4.70 లక్షల నుంచి రూ .6.45 లక్షల మధ్య కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇందులోని 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 68ps శక్తిని మరియు 91 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ / ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్నాయి. జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 21.46 నుండి 22.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. క్విడ్ కారులో 5 మంది ప్రయాణించవచ్చు.

ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ ఏసీ తదితర ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్, ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హెచ్ ఎస్ ఏ (హిల్ స్టార్ట్ అసిస్ట్), టీసీఎస్ (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), టిపిఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ఉన్నాయి.


Click it and Unblock the Notifications








