చీప్‌ అండ్‌ బెస్ట్‌ కార్లు.. ప్రారంభ ధర కేవలం రూ. 3.99 లక్షల నుంచే స్టార్ట్‌!

మార్కెట్‌లో చాలా తక్కువ ధరలో కొన్ని పాపులర్ హ్యాచ్‌బ్యాక్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిని చాలా తక్కువ ధరలో ఇంటికి తీసుకురావచ్చు. ఈ జాబితాలో మారుతి సుజుకి ఆల్టో కె 10, రెనో క్విడ్, టాటా టియాగో, హ్యుందాయ్ ఐ20, మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్, మారుతి సుజుకి బాలెనో వంటి చౌకైన కార్ల అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు దేశంలో ఎక్కువగా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు కొనుగోలు చేస్తున్నాయి. పైన తెలిపిన ఈ కార్లు చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. వీటిని జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno): మారుతి నుంచి అందుబాటులో ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో ఇది ఒకటిగా ఉంది. దీని ధర రూ .6.66 లక్షల నుంచి రూ .9.83 లక్షల మధ్య ఉంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ కారు లీటరుకు 22.35 నుంచి 30.61 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Maruti Suzuki Baleno

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift): ఈ కారు ధర రూ .6.49 లక్షల నుంచి రూ .9.59 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్స్‌లో లభిస్తుంది. ఇది లీటరుకు 24.8 నుంచి 32.85 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ (Maruti WagonR): ఈ కారు ధర రూ .5.54 లక్షల నుంచి రూ .7.32 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది లీటరుకు 23.56 నుంచి 34.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారు ఇంటీరీయర్‌ చాలా స్పేసియస్‌గా ఉంటుంది. అందువల్ల ఎత్తు ఎక్కువ ఉన్నవారు దీనిని కొనుగోలు చేస్తారు.

Maruti Wagnor

హ్యుందాయ్ ఐ20 (Hyundai i20): ఇది హ్యాచ్‌బ్యాక్‌లో ప్రత్యేకతను కలిగి ఉంది. దీని ధర రూ .7.04 లక్షల నుంచి రూ .11.21 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు లీటరుకు 16 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారులో ప్రీమియం ఇంటీరియర్‌ ఫీచర్లు కలవు.

టాటా టియాగో (Tata Tiago): టాటా నుంచి తక్కువ ధరలో ఇది అందుబాటులో ఉంది. దీని ధర రూ.5 లక్షల నుంచి రూ.8.75 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు ఇది లీటరుకు 20.01 నుంచి 28.06 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Tata Tiago

రెనాల్ట్ క్విడ్: (Renault Kwid): ఈ కారు ధర రూ .4.70 లక్షల నుంచి రూ .6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 1-లీటర్ పెట్రోల్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు 21.46 నుంచి 22.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Suzuki Alto K10): ఇది తక్కువ ధరలో లభించే ఫేమస్‌ హ్యాచ్‌బ్యాక్‌. దీని ధర రూ .3.99 లక్షల నుంచి రూ .5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 1-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు ఇది లీటరుకు 24.39 నుంచి 33.85 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 28, 2024, 14:43 [IST]
English summary
Low budget hatchbacks best in the market check prices and mileage details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+