ఇండొనేషియాలో మేడ్‌ ఇన్‌ ఇండియా ఆఫ్‌ రోడర్‌ లాంచ్‌.. ఫీచర్లు, స్పెక్స్‌ అదుర్స్‌.!!

ఇండొనేషియాలో 2024 మారుతీ సుజుకి జిమ్నీ విడుదలైంది. అయితే ఈ కారు భారత్‌లో తయారు కావడం విశేషం. ఇండొనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న 2024 ఇండొనేషియా ఇంటర్నేషనల్‌ మోటార్‌ షోలో సుజుకి మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్‌ను ప్రదర్శించింది. ఇండొనేషియాలో ఈ కారు ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఈ కథనంలో..

భారత మార్కెట్లో మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్‌ ప్రారంభ ధర రూ. 10.74 లక్షలు( ఎక్స్-షోరూమ్) గా ఉంది. కానీ ఇండోనేషియాలో జిమ్నీ టాప్‌ స్పెక్‌ వేరియంట్‌ను భారత కరెన్సీ ప్రకారం రూ. 25.4 లక్షల ధరతో సంస్థ ప్రవేశపెట్టింది. అంటే రెట్టింపు ధరలో ఇండొనేషియాలో మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్‌ అందుబాటులో ఉంది.

Maruti-Jimny-5-Door-Launch-Indonesia

కాండీ రెడ్ జిమ్నీ 2024 ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రదర్శించారు. వాహనం యొక్క పైకప్పు నలుపు రంగుతో ముదురు నీలం రంగులో ఉంటుంది. భారత మార్కెట్లో కూడా జిమ్నీ ఎరుపు రంగులో అందుబాటులో ఉంది. మారుతి సుజుకి ఈ రెడ్‌ను ఇక్కడ సిజ్లింగ్ రెడ్ అని పిలుస్తోంది.

కాగా 3-డోర్‌ జిమ్నీ భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో మరియు జపాన్‌లో తయారవుతోంది. అయితే, 5-డోర్ల జిమ్నీ మాత్రమే భారత్‌లో తయారవుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇండోనేషియా షోరూమ్‌లో ప్రదర్శించబడుతున్న 5-డోర్ల జిమ్నీ భారతదేశంలో తయారవడం గర్వకారణం. అంతేకాకుండా ఇటీవల, 5-డోర్ల జిమ్నీ ఆస్ట్రేలియాలో కూడా ప్రారంభమైంది.

Maruti-Jimny-5-Door-Launch-Indonesia

మేడ్ ఇన్ ఇండియా జిమ్నీ వాహనాలను ఇతర దేశాలకు పంపడం.. భారత్‌కు గర్వకారణం. భారతదేశం నుండి ఇండోనేషియాకు ఎగుమతి చేయబడిన జిమ్నీలో ADAS ఫీచర్‌ను సంస్థ అందించడం లేదు. అడాస్‌ ఫీచర్‌ ద్వారా డ్రైవింగ్ సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రమాదాలను తగ్గించే సాధనంగా నేటి కార్లలో విస్తృతంగా అందిస్తున్నారు.

కాగా మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్‌ టాప్‌ స్పెక్‌ వేరియంట్‌ Alpha AT ధర రోడ్‌ ట్యాక్స్‌లతో కలిపి అత్యధికంగా కర్ణాటకలో రూ. 18.74 లక్షల ధరతో అమ్ముడతోంది. ఈ ధరతో పోలిస్తే ఇండొనేషియాలో జిమ్నీ 5 డోర్‌ ధర రూ. 7 లక్షలు ఎక్కువగా ఉంది. కాగా బేస్‌ మోడల్‌ ధర ఇండొనేషియాలో రూ. 23.6 లక్షలు ఉంది.

Maruti-Jimny-5-Door-Launch-Indonesia

అయితే ఇండోనేషియాలో 3-డోర్ల జిమ్నీ కూడా అమ్మకానికి ఉంది. ఈ క్రమంలో సుజుకి 3-డోర్ల జిమ్నీ యజమానులు తమ వాహనాన్ని 5-డోర్లకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఇందుకోసం సుజుకీ రూ. లక్ష ఛార్జెస్‌ను నిర్ణయించింది. కొత్త కారును కొనుగోలు చేయడంతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ.

భారతదేశంలో అందుబాటులో ఉన్న జిమ్నీ 5 డోర్‌లో అమర్చబడిన అదే 1.5-లీటర్ K15B 4-సిలిండర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇండోనేషియాలో ప్రారంభించింది. అదేవిధంగా, ఇండోనేషియాలోని జిమ్నీ.. 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో జతచేయబడి ఉంటుంది.

ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే.. ఫ్రంట్‌ హెడ్‌లైట్‌, 15 అంగుళాల వీల్స్‌, ప్రొజెక్టర్‌ హెడ్‌లైట్లు, రియర్‌ టెయిల్‌గేట్‌, స్పేర్‌ వీల్‌, ఇలా భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 డోర్‌ జిమ్నీ మాదిరిగానే ఉంటుంది. ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిట్‌ ఆటోకి మద్దతుగా 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మైంట్‌ టచ్‌స్క్రీన్‌ స్క్రీన్, భద్రతా పరంగా 6 ఎయిర్‌బ్యాగులు, పార్కింగ్‌ సెన్సార్లు, పార్కింగ్‌ కెమెరా ఇలా అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, February 17, 2024, 15:13 [IST]
English summary
Made in india maruti suzuki jimny 5 door launched in indonesia price features specs details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+