మేము ముందే చెప్పాము ఈ కారు సూపర్‌ హిట్‌ అవుతుందని.. ఇప్పుడు ధర కూడా పెంచేశారు!

మార్కెట్‌లో ప్రస్తుతం మహీంద్రా XUV 3XO మంచి డిమాండ్‌తో దూసుకెళ్తుంది. ఈ కారుని మహీంద్రా ఏప్రిల్‌ 2024లో విడుదల చేసింది. దీని బుకింగ్స్‌ ఓపెన్ చేసిన గంటలోనే దాదాపు 50 వేలకు పైగా బుక్‌ చేసుకున్నారు. దీంతో ఆటోమొబైల్‌ చరిత్రలో సరికొత్త రికార్డుని తిరగరాసింది. అయితే తాజాగా ఈ కారు ధరలను ఆ సంస్థ పెంచింది. పండుగ సీజన్‌లో ధరను తగ్గించకుండా భారీగా పెంచేసి ఆశ్చర్యపరిచింది. ఈ కారు విడదుల సమయంలోనే ధరను త్వరలోనే పెంచుతామని కంపెనీ ప్రకటించింది. నేటి నుంచే ఈ పెంచిన ధరలను అమలు చేసింది. వెబ్‌సైట్‌లో పెరిగిన ధరలను కంపెనీ వెల్లడించింది. కొత్త ధరల వివరాలు ఈ కథనంలో..

మహీంద్రా 2024 ఏప్రిల్‌లో విడదుల అయినప్పటి నుంచి ఫుల్‌ స్వింగ్‌లో దూసుకెళ్తుంది. కారు విడదుల చేసిన కొన్ని వారాల కారు డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ కారుని డెలివరీ తీసుకునేందుకు సిటీని బట్టి 3-6 నెలల సమయం పడుతుంది. మహీంద్రా నుంచి అందుబాటులో ఉన్న కొత్త కార్లలో ఈ మోడల్‌ ఒకటిగా ఉంది. ఈ కారు ఎక్స్‌యూవీ 300కి కొనసాగింపుగా మహీంద్రా ప్రవేశపెట్టింది.

Mahidra XUV 3XO Price Increased

ఓ విధంగా చెప్పాలంటే ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ 300కి నెక్ట్స్‌ జనరేషన్‌ వెర్షన్‌గా ఉంది. అయితే దీని అమ్మకాలు భారీ సంఖ్యలో పెరగడానికి కారణం ఈ కారును ప్రముఖ కార్ డిజైనర్ ప్రతాప్ బోస్ డిజైన్ చేయడమే అని చెప్పాలి. దీనికంటే ముందు టాటా మోటార్స్‌లో పనిచేసిన ప్రతాప్ బోస్ మహీంద్రాకు మారిన తర్వాత రూపొందించిన తొలి కారు XUV 3XO కావడం గమనార్హం.

ఇది వరకే ప్రతాప్ బోస్ టాటా మోటార్స్‌లో ప్రఖ్యాత నెక్సాన్, పంచ్ కార్లను డిజైన్ చేశారు. దీంతో ఈ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. అందుగు తగనిట్లుగానే కారు డిజైన్ కస్టమర్లకు విపరీతంగా నచ్చింది. విడుదలైనప్పటి నుంచి ఈ కారు ప్రతీ నెలా టాప్‌-10లో కొనసాగుతోంది. ఇది ఇతర కంపెనీలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీని దెబ్బతో నెక్సాన్‌ సేల్స్ అమాంతం తగ్గిపోయాయి.

Mahidra XUV 3XO New Price

ఇక ఈ మహీంద్రా ఎస్‌యూవీ ధరల విషయానికి వస్తే లాంచ్ సమయంలో ఇది రూ.7.49 లక్షల నుంచి రూ.15.49 లక్షల (ఎక్స్-షోరూమ్‌) మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ధరలను రూ.30,000 వరకు పెంచారు. దీంతో ఈ ఎక్స్‌యూవీ 3XO ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షలకు పెరిగింది.

ఇక ఈ ఎస్‌యూవీ మొత్తం 9 వేరియంట్లలో లభిస్తుంది. ఇది ఎంఎక్స్1, ఎంఎక్స్2, ఎంఎక్స్2 ప్రో, ఎంఎక్స్3, ఎంఎక్స్3 ప్రో, ఏఎక్స్5, ఏఎక్స్5ఎల్, ఏఎక్స్7, ఏఎక్స్7ఎల్ అనే వేరియంట్లలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇక ఇందులోని ఎంట్రీ లెవల్ ఎంఎక్స్1, టాప్ ఏఎక్స్5 వేరియంట్ల ధరలను మాత్రమే రూ.30,000 వరకు పెంచింది. మిగతా వాటి పెంపు నామమాత్రంగానే ఉంది.

Variant New Price (Lakh) Old Price (Lakh) Difference
MX1 111hp petrol MT ₹7.79 ₹7.49 ₹30,000
MX2 117hp diesel MT ₹9.99 ₹9.99 -
MX2 Pro 111hp petrol MT ₹9.24 ₹8.99 ₹25,000
MX2 Pro 111hp petrol AT ₹10.24 ₹9.99 ₹25,000
MX2 Pro 117hp diesel MT ₹10.49 ₹10.39 ₹10,000
MX3 111hp petrol MT ₹9.74 ₹9.49 ₹25,000
MX3 111hp petrol AT ₹11.24 ₹10.99 ₹25,000
MX3 117hp diesel MT ₹10.99 ₹10.89 ₹10,000
MX3 117hp diesel AT ₹11.79 ₹11.69 ₹10,000
MX3 Pro 111hp petrol MT ₹9.99 ₹9.99 -
MX3 Pro 111hp petrol AT ₹11.49 ₹11.49 -
MX3 Pro 117hp diesel MT ₹11.39 ₹11.39 -
AX5 111hp petrol MT ₹10.99 ₹10.69 ₹30,000
AX5 111hp petrol AT ₹12.49 ₹12.19 ₹30,000
AX5 117hp diesel MT ₹12.19 ₹12.09 ₹10,000
AX5 117hp diesel AT ₹12.99 ₹12.89 ₹10,000
AX5 L 131hp petrol MT ₹12.24 ₹11.99 ₹25,000
AX5 L 131hp petrol AT ₹13.74 ₹13.49 ₹25,000
AX7 131hp petrol MT ₹12.49 ₹12.49 -
AX7 131hp petrol AT ₹13.99 ₹13.99 -
AX7 117hp diesel MT ₹13.69 ₹13.69 -
AX7 117hp diesel AT ₹14.49 ₹14.49 -
AX7 L 131hp petrol MT ₹13.99 ₹ 13.99 -
AX7 L 131hp petrol AT ₹15.49 ₹ 15.49 -
AX7 L 117hp diesel MT ₹14.99 ₹14.99 -

డీజిల్ ఇంజిన్ కలిగిన ఎంఎక్స్ 3, ఏఎక్స్ 5 వేరియంట్ల ధరలు రూ.10,000 పెరిగాయి. అదేవిధంగా డీజిల్ ఇంజిన్, మాన్యువల్ గేర్ బాక్స్‌తో కూడిన ఎంఎక్స్ 2 ప్రో వేరియంట్ ధర కూడా రూ.10,000 పెరిగింది. ఇది కాకుండా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఇతర వేరియంట్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఎంట్రీ లెవల్ ఎంఎక్స్1, టాప్ ఏఎక్స్5 వేరియంట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

Mahidra XUV 3XO

ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మూడు ఇంజిన్ ఆప్షన్లలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్, 1.2-లీటర్ టర్బో డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కలవు.

More from DriveSpark

Article Published On: Friday, October 11, 2024, 12:35 [IST]
English summary
Mahidra xuv 3xo price increased check up to rs 30000 check new price list here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+