హాట్ సమ్మర్‌లో.. కూల్ ఆఫర్స్: మహీంద్రా కార్ల మీద అదిరిపోయే డిస్కౌంట్స్!

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెలలో XUV400 ఈవీ, XUV300, XUV700, బొలెరో, బొలెరో నియో, మొరాజో మరియు స్కార్పియో-ఎన్ వంటి వాటిపైన అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న బెనిఫీట్స్ గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

మహీంద్రా XUV300

మహీంద్రా కంపెనీ తన XUV300 కొనుగోలు మీద రూ. 1.78 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, అఫీషియల్ యాక్ససరీస్, ఎక్స్టెండెడ్ వారెంట్ మొదలైనవి ఉన్నాయి. ఇందులో టాప్ స్పెక్ XUV300 డబ్ల్యు8 డీజిల్ మోడల్ మీద గరిష్ట ప్రయోజనాలు లభిస్తాయి డబ్ల్యు6, డబ్ల్యు4 మరియు డబ్ల్యు2 వేరియంట్ల మీద వరుసగా రూ. 1.33 లక్షలు, రూ. 95000, రూ.45000 ప్రయోజనాలు లభిస్తాయి.

Mahindra XUV300

మహీంద్రా XUV400 ఈవీ

మహీంద్రా యొక్క ఎలక్ట్రిక్ కారు XUV400 ఈవీ 2023 మోడల్ మీద రూ. 4.4 లక్షల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే అప్డేటెడ్ మోడల్ మీద కూడా కొంత తగ్గింపు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఇది ఎంచుకున్న వేరియంట్, బ్యాటరీ ప్యాక్, ఛార్జింగ్ కెపాసిటీ వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ నెలలో XUV400 ఈవీ కొనుగోలుపై భారీ మొత్తంలో సేవ్ చేసుకోవచ్చు.

మహీంద్రా XUV700

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన XUV700 యొక్క 2023 మోడల్ మీద రూ. 1.5 లక్షల క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. మాన్యువల్ మరియు ఆటోమాటిక్ రూపంలో అందుబాటులో ఉన్న AX5 7-సీటర్ డీజిల్ మరియు AX5 7-సీటర్ పెట్రోల్ మాన్యువల్ మినహా మిగిలిన దాదాపు అన్ని వేరియంట్ల మీద గొప్ప డిస్కౌంట్స్ లభిస్తాయి. 2024 మోడల్ XUV700 మీద ఎటువంటి తగ్గింపులు అందుబాటులో లేదు.

Mahindra XUV700

మహీంద్రా స్కార్పియో-ఎన్

అతి తక్కువ కాలంలో అత్యధిక అమ్మకాలు పొందిన మహీంద్రా కార్లలో ఒకటైన స్కార్పియో-ఎన్ కొనుగోలుపైన కూడా కస్టమర్లు మంచి డిస్కౌంట్స్ పొందవచ్చు. 2023 మోడల్స్ అయిన 4డబ్ల్యుడీ టాప్ స్పెక్ జెడ్8 మరియు జెడ్8ఎల్ డీజిల్ వేరియంట్‌ల కొనుగోలుపైన రూ.1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. 2024 RWD పెట్రోల్ మరియు డీజిల్ రూపంలోని జెడ్8 మరియు జెడ్8ఎల్ మీద రూ.60000 తగ్గింపు అందుబాటులో ఉంది.

మహీంద్రా మొరాజో

మహీంద్రా మొరాజో యొక్క మూడు వేరియంట్‌ (M2, M4+ మరియు M6+)ల మీద ఈ నెలలో రూ. 93200 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బెనిఫీట్స్, కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 20000 విలువైన యాక్ససరీస్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎంపీవీ ధరలు రూ. 14.39 లక్షల నుంచి రూ. 16.80 లక్షల మధ్య ఉన్నాయి.

Mahindra Bolero Neo

మహీంద్రా బొలెరో నియో

మహీంద్రా యొక్క బొలెరో నియో ల్యాడర్ ఫ్రేమ్ 7 సీటర్ వేరియంట్ కొనుగోలు మీద రూ. ఈ నెలలో రూ. 83000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్స్, యాక్సెసరీస్ వినతివి లభిస్తాయి. బొలెరో నియో మిడ్ స్పెక్ N8 మరియు ఎంట్రీ లెవెల్ N4 వేరియంట్ల మీద రూ. 64000 మరియు రూ. 56000 తగ్గింపు లభిస్తుంది.

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో మీద కస్టమర్లు ఈ నెలలో రూ. 82000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బెనిఫీట్స్, కార్పొరేట్ డిస్కౌంట్స్, యాక్ససరీస్ మరియు ఎక్స్టెండెడ్ వారంటీ వంటివి ఉన్నాయి. మిడ్ స్పెక్ బి6 మీద రూ. 48000, ఎంట్రీ లెవెల్ బీ4 మీద రూ. 61000 తగ్గింపును పొందవచ్చు. ఇవన్నీ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

NOTE: మహీంద్రా కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లభిస్తాయి. కాబట్టి మహీంద్రా కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఖచ్చితమైన తగ్గింపులు గురించి తెలుసుకోవడానికి సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించండి. ఈ డిస్కౌంట్స్ మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 7, 2024, 10:30 [IST]
English summary
Mahindra 2024 may discounts from xuv300 to bolero
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+