రిపబ్లిక్‌ డే పరేడ్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా ‘మహీంద్రా ఆర్మడో'.. ఈ మిలటరీ వాహనం ప్రత్యేకతలు తెలుసా.??

భారత్‌లో ఈ ఏడాది రిపబ్లిక్‌ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. త్రిదళాలు ఉపయోగించే ఆయుధ వాహనాలు కవాతులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా స్వదేశీ యుద్ధ విమానాలు.. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంతో ప్రదర్శన చేస్తూ ఔరా అనిపించాయి. కాగా గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఈ సారి ఓ వాహనం ప్రత్యేకతను సంతరించుకుంది.

ప్రతి ఏటా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌(Republic Day Parade)లో.. ప్రతి రాష్ట్రం నుంచి ఆ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించబడిన వాహనాలు కవాతులో పాల్గొంటాయి. ఆ తర్వాత, సైనిక వాహనాలను భారత సైన్యం ప్రదర్శిస్తుంది. కాగా ఈ ప్రదర్శనలో మహీంద్రాకు చెందిన ఆర్మడో మొదటిసారిగా ప్రదర్శించబడి.. ప్రత్యేకంగా నిలిచింది.

Mahindra-Armado-Republic-Day-Parade

మహీంద్రా ఆర్మడో(Mahindra Armado)ను సాయుధ దళాల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది భారత సైన్యానికి ప్రత్యేకమైన వాహనంగా నిలిచింది. 2012 నుంచి భారత సైన్యం ఈ తరహా వాహనాన్ని వినియోగిస్తోంది. అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మహీంద్రా కంపెనీ ఇప్పుడు ఆర్మడోను అప్‌డేట్ చేసి కొత్త వాహనాన్ని ఇండియన్ ఆర్మీకి విక్రయించగా.. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో దీనిని ప్రదర్శించారు.

అయితే మహీంద్రా రూపొందించిన ఈ ఆర్మడో వాహనం బుల్లెట్ ప్రూఫ్(Bullet Proof Vehicle) వాహనం. ఈ వాహనం ఎటువంటి తుపాకీ కాల్పుల నుంచి అయినా లెవెల్ 2 రక్షణను అందించేలా రూపొందించారు. ఇది ALSV అనే సాయుధ కాంతి ప్రత్యేక వాహనం కాగా.. ఎమర్జెన్నీ పరిస్థితుల్లో భారత సైన్యం ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ వాహనాన్ని ఉపయోగిస్తారట.

కాగా ఇప్పటివరకు, మహీంద్రా ఆర్మడోను ప్రత్యేక దళాలు, ఉగ్రవాద నిరోధక దాడులు, దేశ సరిహద్దుల్లో భద్రతా గస్తీతో సహా వివిధ మిషన్లకు ఉపయోగించడం విశేషం. అంతే కాకుండా, ఇది బహుళ ఇంధన వాహనం కూడా అని చెప్పవచ్చు. ఈ వాహనం 215 హెచ్‌పి పవర్ మరియు గరిష్ఠంగా 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

అంతేకాకుండా మహీంద్రా ఆర్మడో అన్ని రకాల భూభాగాలపై ఆటంకం లేకుండా ప్రయాణిస్తుంది. మహీంద్రా ఆర్మడో.. గరిష్ఠంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు ఈ వాహనం 1000 కిలోల బరువును సైతం మోసేలా నిర్మించారు. అంతే కాదు ఈ వాహనం టైరు పంక్చర్ అయినా సరే గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందుకోసం దీనికి 318/80 R17 టైర్లను అమర్చారు.

మహీంద్రా ఆర్మడో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా బాగా పనిచేసేలా ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉండటం విశేషం.. రిపబ్లిక్‌ డే వేడుక(Armado In Republic Day Parade)ల్లో ఈ వాహనాన్ని తొలిసారిగా ప్రదర్శించగా.. ఇది LSV మరియు VMIMS అనే రెండు విభిన్న రూపాల్లో వేడుకలో అలరించింది. ఈ రెండూ విభిన్న ఫీచర్లతో కూడిన వాహనాలుగా ఉన్నాయి.

కాగా మహీంద్రా ఈ వాహనాన్ని ప్రత్యేకంగా సైనికులకు ఉపయోగపడేలా తయారు చేసి భారత సైన్యానికి అందించింది. ఇండియన్ ఆర్మీలో ఈ వాహనానికి చాలా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ డొమైన్‌లో ఈ వాహనం ఫీచర్ల గురించి పూర్తి సమాచారం తెలియదు. ఎందుకంటే.. ఈ వాహనం సాయుధ వాహనం కావడంతో ఆ ఆయుధం ఫీచర్లు కానీ.. దీనికి సంబంధించిన కీలక విషయాలను గోప్యంగా ఉంచుతారు.

More from DriveSpark

Article Published On: Sunday, January 28, 2024, 7:20 [IST]
English summary
Mahindra armado bullet proof vehicle in republic day parade 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+