మహీంద్రా నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనం.. భారత్ రోడ్లపై టెస్టింగ్ ఫోటోలు వైరల్..!
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగం (EV industry) గతం కంటే మెరుగైన ఫలితాలను నమోదు చేస్తుంది. ఈ కారణంగా అనేక కార్ల తయారీ సంస్థలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి.
భారత్‌లో టెస్ట్ డ్రైవ్ : భారత్ మార్కెట్‌లో మహీంద్రా సంస్థ XUV400 పేరుతో ఎలక్ట్రిక్ వాహనాన్ని విక్రయిస్తోంది. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా Mahindra BE.05 EV పేరుతో సరికొత్త వాహనాన్ని విడుదల చేసేందుకు సిద్ధం చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారును భారత్‌లో టెస్ట్ డ్రైవ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభినవ్ ఆరోరా తన ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేశారు.

ఈ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ కానుందంటే : ఈ మహీంద్రా BE.05 ఎలక్ట్రిక్ కారు 2025 అక్టోబర్‌లో భారత్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ కారు కూపే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ కొత్త ఈవీ.. మహీంద్రా XUV700 నుంచి డోర్ హ్యాండిల్స్‌ను పొందనుంది. అదే వెనుక డోర్లు సీ పిల్లర్‌పైన అందించబడ్డాయి. దీంతోపాటు ఈ మహీంద్రా కొత్త ఈవీ పరోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఇదే ప్లాట్‌ఫాంపై భవిష్యత్‌లోనూ నిర్మాణం : మహీంద్రా BE.05 ఎలక్ట్రిక్ కారును INGLO ప్లాట్‌ఫాం ఆధారంగా అభివృద్ధి చేస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇదే ప్లాట్‌ఫాం ఆధారంగా నూతన కార్లను ( Mahindra New Electric Car ) నిర్మించాలని మహీంద్రా భావిస్తోంది. ఇదే ప్లాట్‌ఫాంపై 4.3 మీటర్ల నుంచి 5 మీటర్ల వరకు నిర్మించవచ్చు.

సౌకర్యవంతంగా ప్రయాణించేలా : మహీంద్రా BE.05 ఎలక్ట్రిక్ కారు 4370 mm పొడవు, 1900 mm వెడల్పు, 1635 mm ఎత్తును కలిగి ఉంటుంది. 2775 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఫ్లోర్‌బోర్డులో బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఫలితంగా వెనుక వరుసలో ముగ్గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. అయితే ఈ వాహనానికి సంబంధించిన ఇంటీరియర్ ఫోటోలు వెలువడలేదు.
స్పోర్టీ లుక్‌లో మహీంద్రా కొత్త ఈవీ : ఈ మహీంద్రా BE.05 ఎలక్ట్రిక్ కారు వెనుక వైపు అద్దాలు, వైపర్‌లు అమర్చబడి ఉన్నాయి. ఫలితంగా మహీంద్రా త్వరలో ప్రొడక్షన్ డిజైన్‌ను ఖరారు చేయనుందని తెలుస్తోంది. హెడ్ ల్యాంప్ యూనిట్లపై స్పష్టత లేదు. ఈ మహీంద్రా ఈవీ స్పోర్టీగా కనిపిస్తోంది. టెయిల్‌గేట్ విండోలో ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
Source : అభినవ్ అరోరా ఫేస్‌బుక్


Click it and Unblock the Notifications








