జస్ట్ సింగిల్ ఛార్జింగ్‌తో ఏకంగా 450 కిలోమీటర్లు.. మహీంద్రా నుంచి కొత్త ఈవీ కారు.. లాంచ్ ఎప్పుడంటే!

ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియా మార్కెట్లో కొత్త మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమైంది. సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాలను కాకుండా ఈ సారి వరుసగా ఎలక్ట్రిక్ కార్లతో దండయాత్ర చేయాలని చూస్తుంది. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో అందరి చూపు ఈవీలపై మళ్లింది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కంపెనీ ఈవీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీంతో మొదట కొత్త ఎలక్ట్రిక్ కారు బీఈ.05(BE.05)SUV ను విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా ఈవీ కారును రోడ్లపై టెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది మార్కెట్లోకి విడుదల అయితే ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

బీఈ.05 లాంచ్ ఈవెంట్ నవంబర్ 26న పూణెలోని సెకాన్ అనే కంపెనీ తయారీ ప్లాంట్‌లో జరగుతుందని సమాచారం. దీని వినూత్నమైన డిజైన్‌తో రోడ్లపై వెళ్తుంటే అందరి చూపు దీనిపైనే ఉంటుంది. అందమైన బాడీ ప్యానెల్స్, స్పోర్టీ ఏరో స్టైల్ అల్లాయ్ వీల్స్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, హెవీలీ రేక్డ్ విండ్‌స్క్రీన్‌లు దీనికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ముందు అమర్చిన బంపర్‌ కారుకు అదనపు హాంగును ఇస్తుంది.

Mahindra Be 05 Ev Car Launch November 26

ఇంటీరియర్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. క్యాబిన్ లోపల రెండు స్క్రీన్‌లు ఉన్నాయి. మొదటిది ఇన్‌స్ట్రుమెంటేషన్‌, రెండోది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం. వీటి ద్వారా లోపల ఉన్న ఫీచర్లకు యాక్సెస్ లభిస్తుంది. ఎలాంటి భౌతిక బటన్‌లు అవసరం లేకుండానే కేవలం టచ్ స్క్రీన్ ద్వారా అన్నింటిని ఆపరేటింగ్ చేయవచ్చు. లోపల ఉన్న ప్రయాణికుల భద్రత కోసం ఎయిర్‌బ్యాగులు, ఇంకా పలు లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారతదేశంలో ఉన్న అన్ని రకాల రోడ్లపై సాఫీగా ప్రయాణించడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. 2,775 మి.మి వీల్‌బేస్‌తో 4,370 మి.మి పొడవు, 1,900 మి.మి వెడల్పు, 1,635 మి.మి ఎత్తును కలిగి ఉంది. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ కారు టైర్లకు బలమైన శక్తిని అందిస్తుంది. మందంగా ఉన్న టైర్లతో ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో సైతం రయ్ మంటూ దూసుకుపోతుంది.

Mahindra Be 05 Ev Car Launch

ఈ కారులో ఉన్న ఎలక్ట్రిక్ మోటారు 231 hp పవర్, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో బీఈ.05 అందుబాటులో ఉంటుందని సమాచారం. దీనిలో 60 కిలోవాట్-గంట బ్యాటరీ, 79 కిలోవాట్-గంట బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం ఉంది. కస్టమర్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఛార్జింగ్ సమస్యపై కంపెనీ దృష్టి సారించి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రత్యేకంగా అందించింది.

ఇది 175 kW వరకు ఛార్జింగ్ స్పీడ్‌కు అనుకూలంగా ఉంటుంది. అంటే కేవలం 30 నిమిషాల కంటే తక్కువ సమయంలో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీంతో హైవే రోడ్‌లలో లాంగ్ రైడ్ వెళ్లే వారు సాఫీగా వెళ్లవచ్చు. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే 450 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రేంజ్‌‌ను అందిస్తుందంటే, కారు మార్కెట్లోకి విడుదల అయిందంటే సంచలనానికి తెరలేపుతుంది.

Mahindra Be 05 Ev Car Features

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, October 25, 2024, 16:56 [IST]
English summary
Mahindra be 05 ev car launch on november 26 in india check all details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+