బడ్జెట్ రెడీ చేసుకోండి.. ఒక్క ఛార్జింగ్‌తో 500 కి.మీలు వెళ్లే మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆటోమొబైల్ తయారీదారులు తమ మార్కెట్‌ను పెంచుకోడానికి వరుసగా పోటాపోటీగా కొత్త కొత్త ఈవీ కార్తను విడుదల చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా ఈవీలు మార్కెట్లోకి అడుగుపెట్టి అమ్మకాల పరంగా మెరుగైన నమ్మకాలను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా ఈవీ విభాగంలో పట్టు సాధించడానికి కొత్తగా 'బీఈ 6ఇ(BE 6e)' అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తాజాగా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ రూ.18.9 లక్షల(ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ BE 05 వెర్షన్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది.

ఈవీ కార్లకు ప్రస్తుతం మార్కెట్ ఎక్కువగా ఉంది. ఈ విభాగంలో ఇతర కంపెనీల మోడళ్లు బాగా అమ్ముడుపోతుండగా, మహీంద్రా నుంచి వచ్చిన ఈ కొత్త ఈవీ ఎస్‌యూవీ కూడా ఇతర మోడళ్లకు గట్టి పోటీనిస్తూ, మెరుగైన అమ్మకాలను సాధిస్తుందని కంపెనీ అంచనా వేస్తుంది. BE 6e మోడల్ చూడటానికి చాలా స్టైలీష్‌గా ఉంది. దీని డిజైన్, ఫీచర్స్‌ గురించిన వివరాలను క్రింది కథనంలో చూద్దాం.

Mahindra Be 6e Price Range

BE 6e డిజైన్: ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా మహీంద్రా బ్యాడ్జ్‌ స్థానంలో BE లోగోను అందించారు. ఇది ముందు ఆకర్షణీయంగా ఉన్నటుంటి led హెడ్‌లైట్‌లు, వెనుక స్పోర్ట్స్ C-ఆకారపు led టైల్‌లైట్లు, కూపే ఆకారపు రూఫ్‌లైన్ వంటి వాటిని కలిగి ఉంది. డోర్ హ్యండిల్స్ కూడా కారు ఎక్స్‌టీరియర్‌లో దాచినట్లుగా ఉంటాయి. కారు అందాన్ని పెంచడంలో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆకట్టుకుంటాయి.

ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. సీట్లు ప్రయాణికులకు కంఫర్ట్‌గా ఉంటాయి. లోపల అధునాతన ఫీచర్లు ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ చిన్నగా ఉంటుంది. స్మార్ట్ టచ్ కంట్రోల్ సిస్టం ద్వారా అన్నింటిని ఆపరేటింగ్ చేయవచ్చు. ముందు వరుసల సీట్ల భాగంలో రెండు కప్ హోల్డర్‌లు ఉన్నాయి. వెనుక చూసినట్లయితే మహీంద్రా ఇతర మోడళ్ల కంటే చాలా భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

Mahindra Be 6e Launched

పవర్‌ట్రెయిన్: ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 59 kWh చిన్న బ్యాటరీ 228hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే 79 kWh‌ ఆప్షన్ 281.6bhp పవర్‌ను విడుదల చేస్తుంది. ఈ ఎస్‌యూవీ వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. కారు స్టార్ట్ అయిన 6.7 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 380 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

BE 6e 79kWh బ్యాటరీ ఆప్షన్ పూర్తి ఛార్జింగ్‌తో దాదాపు 500 కి.మీకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ప్రస్తుతం ఛార్జింగ్ సమస్య ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో మహీంద్రా తన కారులో ఇలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ఫాస్ట్ ఛార్జర్‌ను అందించింది. DC ఛార్జర్‌ను ఉపయోగించి బ్యాటరీని కేవలం 20 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.

ఇతర ఫీచర్లలో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల ఫ్లోటింగ్ స్క్రీన్‌, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 1400 వాట్ల 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ, లెవల్-2 ADAS వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 27, 2024, 10:30 [IST]
English summary
Mahindra be 6e price range and all top things check here
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+