కొత్త మహీంద్రా BE 6e వర్సెస్ టాటా కర్వ్ EV రెండింట్లో ఏది మొనగాడి కారు?.. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకండి!
మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ (Mahindra XEV 9e), బీఈ 6ఇ (BE 6e) ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఈవీ కార్లకు గట్టి పోటీని ఇవ్వనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌పై మహీంద్రా ఎక్కువగా దృష్టి పెడుతోంది. అందులో భాగంగానే వీటిని ప్రవేశపెట్టింది. దీంతో ఈవీ మార్కెట్‌ని మహీంద్రా కార్లు శాసించే అవకాశం లేకపోదు. ఇక త్వరలోనే ఈ కొత్త కార్ల డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్లు మహీంద్రా ఈవీ సెగ్మెంట్‌లోనే సరికొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేయనున్నాయి. ప్రస్తుతం వీటిికి సంబంధించిన క్రాష్ టెస్ట్, ఇతర స్టంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సరికొత్త కార్లలో BE 6e నేరుగా కర్వ్ EVతో పోటీ పడుతుంది. ఈ రెండు మోడళ్ల తేడాలపై ఓ లుక్కేద్దాం.
బ్యాటరీ ప్యాక్స్: ఈ రెండు ఎస్‌యూవీల పవర్‌ట్రైన్స్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే టాటా కర్వ్ 45 కిలోవాట్, 55 కిలోవాట్ల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇవి వరుసగా 425 , 585 కిలోమీటర్ల భారీ మైలేజీని అందిస్తాయి. 45 kWh బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటార్ 165 bhp వద్ద 215 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మరోవైపు 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటార్ 148 bhp పవర్, 215 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. భారీ బ్యాటరీ ప్యాక్‌తో నడిచే టాటా కర్వ్ వేరియంట్ 8.0 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది. అయితే మహీంద్రా బీఈ 6ఇ టాప్ స్పీడ్ తెలియరాలేదు. అయితే ఇది 100 kmph వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో చేరుకోగలదు.
మహీంద్రా BE 6ఇ అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. దీనిలో 59 kWh & 79 kWh బ్యాటరీ ప్యాక్స్ కలవు. 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ 221 bhp పవర్‌ని 380 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ రేంజ్‌ని వెల్లడించలేదు. ఇది 400 కిలోమీటర్ల రేంజ్ అందించే అవకాశం ఉంది. 79 kWh బ్యాటరీ ప్యాక్ 680 కిమీ రేంజ్‌ని అందిస్తుంది.

ధర: ప్రస్తుతం మహీంద్రా బీఈ 6ఇ బేస్ వేరియంట్ ధరను మాత్రమే ప్రకటించారు. దీని ధర రూ.20.05 లక్షలుగా ఉంది. ఇక కర్వ్ ఈవీ ధరలు రూ .18.57 లక్షల నుంచి రూ .23.28 లక్షల మధ్య కొనుగోలుకి అందుబాటులో ఉంది. రెండు ఎస్‌యూవీల ప్రారంభ ధర మధ్య సుమారు రూ.1.50 లక్షల తేడా ఉంది. ఇవన్నీ అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు.
కొలతలు: కర్వ్ ఈవీ 4,310 మిమీ పొడవు, 1,637 మిమీ ఎత్తు, 1,810 మిమీ వెడల్పు, 2,560 mm వీల్ బేస్, 500 లీటర్ల బూట్ స్పేస్ కలదు. ఇక BE 6ఇ 4,371 మిమీ పొడవు, 1,627 మిమీ ఎత్తు, 1,907 మిమీ వెడల్పుతో వస్తుంది. 2,775 mm వీల్‌బేస్, 455-లీటర్ల తక్కువ బూట్ స్పేస్ కలదు.

ఇక రెండు కార్లలోనూ అధునాతన సేఫ్టీ ఫీచర్లు కలవు. టాటా కర్వ్ BNCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని కలిగి ఉంది. ఇక మహీంద్రా కూడా కచ్చితంగా 5 స్టార్ రేటింగ్‌ని సాధిస్తుందని ధీమాతో ఉంది. ఇప్పటికే స్వచ్ఛందంగా తమ ప్లాంట్‌లో క్రాష్ టెస్ట్‌ని నిర్వహించింది. ఇందులో మంచి సేఫ్టీ లభించినట్లు వెల్లడైంది. రెండు కార్ల ధరలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి కస్టమర్లు తమకు నచ్చిన బ్రాండ్‌ని ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications