కొత్త ఎలక్ట్రిక్ కారుతో చరిత్ర సృష్టించేందుకు సిద్ధం అవుతున్న మహీంద్రా.. టెస్ట్‌డ్రైవ్ విజువల్స్ వైరల్!
త్వరలో మహీంద్రా నుంచి విడుదల కాబోయే బీఈ.05 ఎలక్ట్రిక్ (Mahindra Be.05) ఎస్‌యూవీని బెంగళూరు రోడ్లపై టెస్ట్‌డ్రైవ్ చేస్తుండగా మా డ్రైవ్స్‌పార్క్ బృందం తమ కెమెరాలో బంధించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ విభాగంలో గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా ప్రయత్నాలు చేస్తుంది. భారతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల డిమాండ్‌కి అనుగుణంగా కొత్త కారుని తీసుకువస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్, సిట్రోయిన్, కియా మోటార్స్ టాటా కార్లకు ఇది సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉంది. త్వరలో భారీ కాంపిటీషన్ ఇవ్వబోనున్న బీఈ.05 టెస్ట్‌డ్రైవ్, ఇతర వివరాలు మీ కోసం..
ఇంటీరియర్ ఫీచర్లు: BE.05 ఇంటీరియర్ పూర్తిగా కవర్ చేయబడినప్పటికి మాకున్న సమాచారం ప్రకారం ఇందులో డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ సెటప్ కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం ఒక స్క్రీన్ మరియు డ్రైవర్ డిస్ప్లే కోసం మరొక స్క్రీన్ ఉండనున్నాయి. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, షార్ప్ 'బీఈ' లోగోతో చతురస్రాకార యూనిట్‌ని కలిగి ఉండనుంది.

డిజైన్: డిజైన్ పరంగా, మహీంద్రా బీఈ.05 సరికొత్త కాన్సెప్ట్ డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. ఫ్రంట్ ప్రొఫైల్‌లో పాయింటీ బానెట్, LED DRLs, స్లిమ్ బంపర్ షార్ప్ లుక్‌తో రానుంది. వెనుక భాగంలో స్ప్లిట్ రియర్ స్పాయిలర్ మరియు బయటకు వచ్చేలా ఎండ్స్ ఉన్నాయి. సైడ్ నుంచి సిల్హౌట్ మరియు పాప్-అప్ స్టైల్ డోర్ హ్యాండిల్స్‌ని కలిగి ఉంది.
బ్యాటరీ మరియు రేంజ్: ఈ బీఈ.05 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 175 కిలోవాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 5 నుంచి 80 శాతం ఛార్జ్ అయ్యేలా తీసుకువస్తున్నట్లు గతంలోనే మహీంద్రా వెల్లడించింది.

ఫర్పామెన్స్: మహీంద్రా బీఈ.05 కంపెనీ ఈవీ-స్పెసిఫిక్ INGLO ఫ్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది, ఇది ముందు, వెనుక మరియు ఆల్-వీల్ డ్రైవ్ట్రెయిన్స్‌కి సపోర్ట్ చేస్తుంది. రియర్-వీల్ డ్రైవ్ మోడళ్లు 285 bhp వరకు, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లు 394 bhp వరకు పవర్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై మహీంద్రా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ధర: మహీంద్రా బీఈ.05 అక్టోబర్ 2025 నాటికి భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది, దీని ధర రూ .25 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి మోడళ్లతో పాటు త్వరలోనే రాబోయే హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా కర్వ్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలోనే వేగంగా ఫాస్ట్ ఛార్జింగ్ అందించేలా బ్యాటరీ టెక్నాలజీని ఇందులో అందించే అవకాశం ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కి తగినట్లుగా ఇతర కంపెనీలతో పోల్చితే తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త మోడల్ కోసం మహీంద్రా అధునాతన టెక్నాలజీ కల్గిన ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగిస్తుంది. ఇది మెరుగైన పనితీరుతో పాటు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిచనుంది.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సొగసైన డిజైన్, ఇతర ఫీచర్లతో బీఈ.05 వంటి ఉత్పత్తి మోడళ్లతో దేశంలో అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ ల్యాండ్ స్కేప్‌లో ట్రెండ్ సెట్ చేయనుంది. ఇందులో అందించే ప్రతీ ఫీచర్ రాజీలేని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్థిరమైన మొబిలిటీ పరిష్కారాలపై దృష్టి కేంద్రీకరించనుంది. ఎలక్ట్రిక్ మార్కెట్‌లో ఈ కారు ఒక విప్లవాన్ని సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








