సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్‌ రేటింగ్‌.. దీనిపై కంపెనీ ఏమందంటే??

గ్లోబల్ NCAP రేటింగ్‌లో మహీంద్రా బొలెరో నియో (Bolero Neo) పెద్దలు మరియు పిల్లల భద్రత రేటింగ్‌లలో 1-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. రెండు విభాగాల్లో తక్కువ స్కోర్‌ సాధించడంతో ఫలితంగా దీనికి 1-స్టార్ రేటింగ్ వచ్చింది. ముఖ్యంగా సీట్ బెల్ట్ రిమైండర్‌ల (SBRలు) విఫలమవడంతో గ్లోబల్ NCAP ఈ రేటింగ్‌ని ఇచ్చింది.

ఫ్రంటల్ ఇంపాక్ట్: ఈ పూర్తి టెస్టింగ్‌లో ప్యాసింజర్ హెడ్ ప్రొటెక్షన్ సేఫ్‌గానే ఉన్నా కానీ డ్రైవర్ హెడ్ ప్రొటెక్షన్ అంతంత మాత్రంగానే ఉంది. డ్రైవర్ మరియు ప్రయాణీకుల హెడ్‌లకు ఎలాంటి హానీ జరగదు. అయితే డ్రైవర్‌ ఛాతీకి రక్షణ కల్పించడంలో ఈ కారు అంతగా నిలదొక్కుకోలేక పోయింది. మోకాలి రక్షణలోనూ ఆందోళనలు తలెత్తాయి. ఫుట్‌వెల్ రక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉండనుంది. బాడీ షెల్ అధిక లోడ్‌లను తట్టుకోలేక పోయింది.

Bolero-Neo-GNACP-Testing

సైడ్ ఇంపాక్ట్: ఈ టెస్టింగ్‌లో ఛాతీ రక్షణతో పాటు తల, ఉదరం రక్షణ మెరుగ్గానే ఉంది. అయితే ఢీ కొట్టిన తర్వాత ముందు డోర్లు తెరుచుకుంటున్నాయి. ఇది ప్రయాణికులకు కాస్త ఉపశమనం కల్పించే అశంగా చెప్పవచ్చు. ఇక స్టాండర్డ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) లేకపోవడం బొలెరో నియోలోని భద్రతా లోపాలను ఎత్తి చూపుతోంది.

ఇక చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ పరంగా చూసుకుంటే బొలెరో నియో 49.00 పాయింట్లకు కేవలం 12.71 స్కోర్ చేసి 1-స్టార్ రేటింగ్‌ను పొందింది.ఫ్రంటల్‌ ఇంపాక్ట్‌లో 3 ఏళ్ల పిల్లలకు ఫార్వర్డ్ ఫేసింగ్ చైల్డ్ సీటు దాదాపు పూర్తి రక్షణను అందింస్తుంది. అయితే 18 నెలల పిల్లలకు వెనుకవైపు ఉండే సీటు మాత్రం పరిమిత రక్షణను మాత్రమే అందిస్తోంది. ముఖ్యంగా తలకు రక్షణ కల్పించడంలో అంతంతమాత్రంగానే ఈ కారు ఉంది.

చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్స్ (CRS) ఇన్‌స్టాలేషన్‌లో లోపాలు ఉన్నాయి. చైల్డ్‌ ప్రొటెక్షన్‌లో భద్రతా ప్రమాణాలను అందుకోవడంలో ఈ కారు విఫలమైంది. ఇక సైడ్ ఇంపాక్ట్‌లో చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్స్ CRSలు రక్షణను అందించాయి. సీటింగ్ పొజిషన్‌లలో స్టాండర్డ్‌ 3-పాయింట్ బెల్ట్‌లలో లోపాలు మరియు వెనుక వైపున ఉన్న CRS ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించి సేఫ్టీ అలర్డ్‌లు పిల్లల భద్రతపై మరింత ప్రభావం చూపాయి.

మహీంద్రా బొలెరో ఎస్‌యూవీలకు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అందులో భాగంగానో విడుదలైన నియో ఎస్‌యూవీ మంచి బుకింగ్స్‌తో దూసుకువెళ్తుంది. ఈ యుటిలిటీ కారు నిర్మాణం వివిధ రకాల ఆఫ్‌రోడ్లలోనూ సులభంగా ప్రయాణించగలదు. పూర్తిగా భారతీయ నేటివిటీకి Bolero Neo దగ్గరగా ఉండేలా సంస్థ రూపొందించింది. తాజాగా ఈ ఎస్‌యూవీకి నిర్వహించిన పరీక్షల్లో తేలిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Bolero-Neo-Crash-Test

దీనిపై మహీంద్రా స్పందించింది. సేఫ్టీ స్టాండర్డ్స్‌ని దృష్టిలో ఉంచుకుని రాబోయే ఉత్పత్తులను మెరుగుపరుస్తున్నామని తెలిపింది. సంస్థ నుంచి ఇటీవల విడుదలైన కార్లలో భద్రతా ఫీచర్లు గణనీయంగా పెంచామని.. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మా కస్టమర్‌లు మరియు వాటాదారులకు మేము హామీ ఇవ్వాలనుకుంటున్నామని వెల్లడించింది. మహీంద్రా నుంచి అనేక రకాల ఎస్‌యూవీలు, ఎక్స్‌యూవీలు, ఇతర కమర్షియల్‌ వాహనాలు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి.

ఈ సంస్థ నుంచి థార్, XUV700, XUV300 మరియు స్కార్పియో-N వంటి మోడల్‌లు గ్లోబల్ NCAP ద్వారా 4 మరియు 5 స్టార్‌ రేటింగ్‌లతో అధిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉన్నాయి. ఇది భద్రత పట్ల మహీంద్రాకు ఉన్న నిబద్ధతను నిద్శనమని వివిరించింది. మా కస్టమర్‌లు మాపై ఉంచే నమ్మకానికి మేము విలువిస్తామని సంస్థ వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 24, 2024, 14:12 [IST]
English summary
Mahindra bolero neo gets 1 star rating for adult and child safety in global ncap rating
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+