మరో కొత్త కారు లాంచ్ చేసిన మహీంద్రా: ధర & వివరాలు ఇక్కడ చూడండి
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లో 'బొలెరో నియో ప్లస్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన కొత్త బొలెరో+ యొక్క ఎంట్రీ లెవెల్ పీ4 ట్రిమ్ ధర రూ. 11.39 లక్షలు, కాగా టాప్ స్పెక్ పీ10 ధర రూ. 12.49 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). నియో+ అనేది సబ్ కాంపాక్ట్ బొలెరో నియో యొక్క మూడు వరుసల 9 సీటర్ వెర్షన్. ఇది దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే డిజైన్ పొందుతుంది.

మహీంద్రా బొలెరో నియో+ కొత్త ఫాగ్ లాంప్ హోసింగ్, బుల్ బార్ మాదిరిగా ఉండే డిజైన్ ఎలిమెంట్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది. బొలెరో నియో+ పొడవు 4400 మిమీ వరకు ఉంటుంది. ఇది సాధారణ బొలెరో నియో కంటే కూడా 405 మిమీ ఎక్కువ పొడవు ఉంటుంది. అయితే వీల్‌బేస్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.
కొత్త మహీంద్రా బొలెరో నియో+ కారు యొక్క రియర్ డోర్, రియర్ డోర్ ప్యానెల్ కొత్తగా ఉన్నాయి. వెనుక భాగంలో పెద్ద రియర్ క్వార్టర్ గ్లాస్, పెద్ద ర్యాప్‌రౌండ్ టెయిల్ లాంప్ వంటి వాటిని కూడా ఇక్కడ గమనించవచ్చు. వెనుక భాగంలో ఎక్స్ షేప్ స్పేస్ వీల్ కవర్ చూడవచ్చు. మొత్తం మీద ఇది మంచి డిజైన్ పొందుతుందని స్పష్టంగా అర్థమవుతోంది.

మహీంద్రా బొలెరో నియో+ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారు యొక్క డ్యాష్‌బోర్డులో చెప్పుకోదగ్గ పెద్ద మార్పులు లేదని తెలుస్తోంది. ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, కొత్త స్టీరింగ్ వీల్ మరియు రివైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇది 3 వరుసల (2-3-4 సీటింగ్ కాన్ఫిగరేషన్) సెటప్ పొంది ఉంటుంది. చివరి వరుసలో ఉన్న సీట్లు రెండువైపులా ఉంటాయి.
ఇవి మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 6 స్పీకర్ సౌండ్ సిస్టం, ముందు మరియు వెనుక పవర్ విండోస్, మాన్యువల్ ఏసీ, ఫ్రంట్ సీట్ ఆర్మ్‌రెస్ట్‌లు మొదలైనవి ఉన్నాయి. ఈ కారు డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఐసోఫిక్స్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.
కొత్త బొలెరో నియో+ యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 హార్స్ పవర్ మరియు 280 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్ ఆధారంగా రూపొందించబడి ఉంటుంది. అయితే బొలెరో నియో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది.
బొలెరో నియో+ కారు ముఖ్యంగా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్లకు మరియు కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారు ఫోర్స్ సిటీలైన్ మరియు ఫోర్స్ గూర్ఖా 5డోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాము. మహీంద్రా బొలెరో+ దాని మునుపటి మోడల్ మాదిరిగా మంచి అమమకాలు పొందుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








