మీ అందరికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన మహీంద్రా.. సైలెంట్‌గా వచ్చి పెద్ద బాంబ్ పేల్చిందిగా.. ఇక భారం తప్పదు!

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా ఒక్కసారిగా వినియోగదారులకు షాక్ ఇచ్చింది. దేశంలో ఎక్కువగా డిమండ్ కలిగిన ఎక్స్‌యూవీ 700(XUV 700) ధరను సైలెంట్‌గా పెంచింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను కంపెనీ విడుదల చేసింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ కారు అధునాతన ఫీచర్లతో, స్టైలీష్ డిజైన్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. పండగ సమయంలో ధర పెంచకుండా సీజన్ ముగిసిన తర్వాత పెంచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే మోడల్‌లో ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే ధర పెంపుదల వర్తిస్తుంది. కంపెనీ ధరను దాదాపు రూ.50,000 పెంచినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో మహీంద్రా అన్ని 6-సీట్ వేరియంట్‌లను నిలిపివేయగా, AX3 ట్రిమ్‌లో డీజిల్ ఇంజిన్‌తో రెండు కొత్త వేరియంట్‌లను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది.

మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700లో పెట్రోల్ ఇంజన్‌తో లభించే మాన్యువల్ 7 సీటర్ ax7 వేరియంట్ ధర అత్యల్పంగా రూ.15,000 పెంచింది. మార్కెట్లో ఇది రూ.19.49 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.19.64 లక్షలకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ముఖ్యంగా కంపెనీ 5 సీటర్ మాన్యువల్ MX వేరియంట్‌పై, 7 సీటర్ మాన్యువల్ MX వేరియంట్‌, 5 సీటర్ మాన్యువల్ AX3పై రూ.50,000 పెంచింది. ఇవన్నీ కూడా పెట్రోల్ ఇంజిన్‌వి.

Mahindra Hiked Xuv700 Price Upto Rs 50000

ధర పెంపుదలతో వీటి ప్రారంభ ధరలు రూ.13.99 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి రూ.14.19 లక్షల(ఎక్స్ షోరూమ్) ధరకు చేరుకుంది. అయితే ఈఎస్‌పీ సపోర్ట్ కలిగిన MX మాన్యువల్ 5 సీటర్, MX మాన్యువల్, ax3 మాన్యువల్ 5 సీటర్‌ పెట్రోల్ వేరియంట్ల ధరలను మాత్రం మహీంద్రా పెంచలేదు. వీటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దీని కారణంగా వినియోగదారులు నాన్ ఈఎస్‌పీ కాకుండా ఈఎస్‌పీలనే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే కంపెనీ ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్ల ధరలు పెంచినప్పటికి ఈ మోడల్‌కు చెందిన అన్నిడీజిల్ వేరియంట్‌ల ధరలను మాత్రం పెంచలేదు. వీటన్నింటిని పాత ధరకే విక్రయిస్తుంది. పైగా కొత్తగా రెండు డీజిల్ వేరియంట్‌లను కూడా తీసుకొచ్చింది. గత కొద్ది కాలంగా వినియోగదారులు 6 సీటర్ కంటే 7 సీటర్ సామర్థ్యం కలిగిన వేరియంట్లను కోరుకుంటున్నారు.

Mahindra Hiked Xuv700

6 సీటర్ పట్ల అంతగా ఆదరణ లేకపోవడంతో కంపెనీ ఈ అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో 7 సీటర్ పట్ల ఎక్కువ డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కువ సీటింగ్ వేరియంట్లను తీసుకొస్తుంది. అందుకే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లో AX7, AX7L ట్రిమ్‌లలో 6-సీట్ వేరియంట్‌లను తగ్గించనున్నట్లు ప్రకటించింది.

ఈ ఎక్స్‌యూవీ 700లో 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రయాణికుల భద్రత కోసం ఏడు ఎయిర్ బ్యాగులు, లెవెల్ 2 ADAS ఫంక్షన్, లెథర సీట్లు, చుట్టు ప్రక్కల చూడటానికి 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, led హెడ్‌లైట్, 12-స్పీకర్ సౌండ్ సిస్టం, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా XUV 700 మార్కెట్లో ప్రధానంగా ఎంజీ హెక్టార్, టాటా సఫారీ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. సఫారీ ధర రూ.15.49 లక్షలు-26.79 లక్షలుగా, హెక్టర్ ప్లస్ ధర రూ.18.00 లక్షలు-23.58 లక్షలుగా ఉంది. ప్రస్తుతం ధర రూ.50,000 పెరిగినప్పటికీ కూడా ఇది అంతగా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేదని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ధర పెంపుదల తాలుకు ఎఫెక్ట్ మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 22, 2024, 9:10 [IST]
English summary
Mahindra hiked xuv700 price upto rs 50000 nov 2024 here full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+