ధర రూ.6.61 లక్షలకే మహీంద్రా మినీ ట్రక్కు.. సామర్థ్యం, ప్రత్యేకతలు తెలుసా..?
భారత్ మార్కెట్‌లో చిన్న వాణిజ్య యుటిలిటీ వాహనాల తయారీ సంస్థల్లో మహీంద్రా ఒకటిగా ఉంది. మహీంద్రా సంస్థ తాజాగా సుప్రో ప్రాఫిట్ ట్రక్ ఎక్సెల్ (Mahindra Supro Profit Truck Excel) పేరుతో మినీ లోడర్‌ను పరిచయం చేసింది. ఈ మినీ ట్రక్ డీజిల్ మరియు CNG రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది.
మహీంద్రా సుప్రో ప్రాఫిట్ ట్రక్ ఎక్సెల్ ప్రారంభ ధర రూ.6.61లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6,61,000గా ఉంది. అదే CNG వేరియంట్ ప్రారంభ ధర రూ.6,93,000 గా ఉంది. సుప్రో మహీంద్రా యొక్క అత్యధికంగా విక్రయాలు నమోదు చేసిన మినీ ట్రక్కుల్లో ఒకటిగా ఉంది. ఆ విక్రయాల జోష్‌తో కొత్త మినీ ట్రక్కును పరిచయం చేసింది. ఈ ట్రక్ ఎక్కు బరువులను మోసుకెళ్లేలా మహీంద్రా రూపొందించింది.

మహీంద్రా సుప్రో ప్రాఫిట్ ట్రక్ ఎక్సెల్ మైలేజీ : మహీంద్రా సుప్రో ప్రాఫిట్ ట్రక్ ఎక్సెల్ డీజిల్ వెర్షన్ 23.6 kmpl మైలేజీ, CNG వెర్షన్ 24.8 km/kg మైలేజీని ఇస్తుంది. మైలేజీ పరంగానే కాకుండా ఈ మినీ ట్రక్కు బాడీ నిర్మాణం కూడా ఎక్కువ వస్తువులను మోసుకెళ్లేలా తయారుచేసినట్లు తెలుస్తోంది. అన్ని రకాల రోడ్లపై సులభంగా ప్రయాణం చేసేందుకు వీలుగా 2,050mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.
మహీంద్రా సుప్రో ప్రాఫిట్ ట్రక్ ఎక్సెల్ డీజిల్ వేరియంట్ 3600rpm వద్ద 19.4kW శక్తి మరియు 1800-2200 rpm వద్ద 55Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG వేరియంట్ 3800rpm వద్ద 20.01 kW శక్తి మరియు 1800-2200 rpm వద్ద 60Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ రెండు వేరియంట్లు 5 ఫార్వడ్, 1 రివర్స్ మోడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడ్డాయి.

సుప్రో ప్రాఫిట్ ట్రక్ ఎక్సెల్ ఎంత బరువులను తీసుకెళ్లగలదు : సుప్రో ప్రాఫిట్ ట్రక్ ఎక్సెల్ డీజిల్ వేరియంట్ 900 కేజీల బరువును తీసుకెళ్లగలదు. అదే సీఎన్‌జీ వేరియంట్ 750 కేజీల బరువును తీసుకెళ్లగలదు. డీజిల్ వేరియంట్ 30 లీటర్ల ఇందన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. అదే సీఎన్‌జీ వేరియంట్ 105 లీటర్ల CNGతోపాటు 5L పెట్రోల్ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది.
సీఎన్‌జీ వేరియంట్‌లో పెట్రోల్ ట్యాంక్ ఎందుకు : సీఎన్‌జీ పూర్తిగా అయిపోయిన పరిస్థితుల్లో 5 లీటర్ల పెట్రోల్‌తో వాహనం ముందుకు వెళ్లేందుకు సుప్రో ప్రాఫిట్ ట్రక్ ఎక్సెల్ పెట్రోల్ ట్యాంక్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ట్రక్కును కొనుగోలు చేసిన తొలి 36 నెలల వరకు వారంటీని అందిస్తున్నట్లు మహీంద్రా సంస్థ పేర్కొంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








