మహీంద్రా నుంచి త్వరలో విడుదల కానున్న 16 కొత్త ఎస్‌యూవీలు.. జాబితాలో ఉన్న థార్ EV
2030 నాటికి 16 కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయనున్నట్లు మహీంద్రా ఆటోమోటివ్ ప్రకటించింది. దేశంలోని అతిపెద్ద ఎస్‌యూవీలను తయారు చేస్తున్న మహీంద్రా నుంచి వస్తున్న 16 ఎస్‌యూవీల్లో తొమ్మిది ఇంజిన్ (ఐసిఇ) మోడళ్లు కాగా ఏడు బోర్న్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (బీఈవీ) ఉన్నాయి.
ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ: ఈ సంస్థ నుంచి త్వరలో విడుదల కాబోతున్న కారు ఇదే. దీనిని విడుదల చేసిన కేవలం గంటలోనే 50 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. మే 26 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. దీనిలో పనోరమిక్ సన్ రూఫ్, ADAS లెవల్ 2 వంటి అనేక ఫీచర్లు వస్తున్నాయి.

ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ: ఈ ఎక్స్‌యూవీ 700 కి అప్ డేటెడ్ వెర్షన్‌గా సంస్థ తీసుకురానుంది. ఈ కొత్త పేరును ఇటీవల మహీంద్రా ట్రేడ్ మార్క్ చేసింది. తాజాగా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ మాదిరిగానే ఎక్స్‌యూవీ 700 పేరును కూడా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓగా మార్చినట్లు సమాచారం. ఆగస్టు 2021 లో లాంచ్ అయిన ఎక్స్‌యూవీ 700కి ఉన్న డిమాండ్ ఆధారంగా దీనిలో మరిన్నీ ఫీచర్లను సంస్థ జోడించనుంది.
అప్‌డేటెడ్ స్కార్పియో-ఎన్: మహీంద్రా కార్లలో స్కార్పియోలకు మంచి డిమాండ్ ఉంది. ఇది తాజాగా సంస్థ వెల్లడించిన నివేదికల ప్రకారం, స్కార్పియో-N లో మెరుగైన ఫీచర్లను సంస్థ అందించనుంది. ఈ ఎస్‌యూవీ ADAS లెవల్ 2 వంటి ఫీచర్ అప్ గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇంకా బహ్య డిజైన్‌లో కొన్ని మార్పులు చేయవచ్చు.

XUV 1XO & XUV 5XO: మహీంద్రా ఎక్స్‌యూవీ 1ఎక్స్ఓ మరియు ఎక్స్‌యూవీ 5ఎక్స్ఓ పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ చేసింది. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు పోటీగా ఈ మైక్రో ఎక్స్‌యూవీ 1ఎక్స్ఓ విడుదల కానుంది. అలాగే ఎక్స్‌యూవీ 5ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ పడవచ్చు. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది.
థార్ అర్మాడా: ఇంటర్నల్ కంబషన్ ఇంజిత్ (ICE) మహీంద్రా విడుదల చేయనున్న మోస్ట్ అవైటెడ్ మోడళ్లలో థార్ 5-డోర్ ఒకటి. థార్ అర్మాడా అనే పేరును సంస్థ ట్రేడ్ మార్క్ చేసింది. థార్ అర్మాడాలో కొత్త బెంచ్ సీటుతో పాటు మధ్యలో అదనపు డోర్లను సంస్థ జోడించనుంది. ఇక బయట పూర్తి మెటల్ రూఫ్‌తో సహా అనేక కొత్త ఫీచర్లను కూడా పొందుతుంది.

స్కార్పియో పికప్ & న్యూ బొలెరో ఎస్‌యూవీ: మహీంద్రా కొత్త స్కార్పియో పికప్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. స్కార్పియో-ఎన్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన ఈ మోడల్ పలు డిజైన్ మార్పులతో రానుంది. ఇక మరొక కొత్త బొలెరో ఎస్‌యూవీని తీసుకురానుంది. ఈ ఎస్‌యూవీ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ని కలిగి ఉండనుంది. ఈ కొత్త ఎస్‌యూవీ బొలెరో ప్రియులను మరింతగా ఆకట్టుకోనుంది.
బొలెరో సెవెన్ సీట్ డెరివేటివ్: కొత్త బొలెరోతో పాటు, మహీంద్రా ఏడు సీట్ల వేరియంట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త మోడల్ కూడా ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న అదే అండర్ 171 ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందనుంది. ఈ డెరివేటివ్ అదనపు సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఎలక్ట్రిక్ వెహికల్స్ (బీఈవీలు): ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ మహీంద్రా ఆటోమోటివ్ గట్టి పోటీని ఇవ్వనుంది. ఈ బ్రాండ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో మొదటిది మహీంద్రా XUV.E8. ఈ ఎస్‌యూవీ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది 80 కిలోవాట్ల వరకు బ్యాటరీ ఆప్షన్లను కలిగి ఉండనుంది. ఇది 230bhp నుంచి 350 bhp వరకు పవర్‌ను ఉత్పత్తి చేయనుంది.
ఇక ఆఖర్లో XUV.E9 కూపే, మహీంద్రా బీఈ.05 ఎస్‌యూవీ, థార్ ఈవీలు రానున్నాయి. అయితే మిగిలిన మూడు బీఈవీలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని సంస్థ ఈ రాబోయే కార్లను అధునాతన టెక్నాలజీతో రూపొందిస్తుంది.


Click it and Unblock the Notifications








