మూడు నెలల్లో కేవలం 29 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి.. అత్యంత చెత్త రికార్డుతో ఆ కంపెనీకే బ్యాడ్ రిమార్క్!
మహీంద్రా కార్లు అంటే మార్కెట్‌లో గట్టివీ, హై ఫర్ఫామెన్స్‌తో వస్తాయని జనాలు విశ్వసిస్తారు. ఆ సంస్థ ఎటువంటి కారుని విడదల చేసిన గంటల్లో వేల సంఖ్యలో బుక్ చేసుకుంటారు. మార్కెట్‌లో అవి కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయిపోయి వెయిటింగ్ పీరియడ్ క్రమంగా పెరుగుతుంది. అయితే ఆ సంస్థ నుంచి 2018 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన మహీంద్రా మారాజో (Mahindra Marrazzo) ఎంపీవీ వైపు మాత్రం జనాలు తొంగి కూడా చూడలేదు. ఈ మహీంద్రా 7-సీటర్ ఎంపీవీ మరాజో మార్కెట్‌లో సేల్స్‌ని రాబట్టుకునేందుకు గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా కష్టపడుతోంది.
2024 సెప్టెంబర్‌లో కేవలం 7 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ ఎంపీవీని మహీంద్రా అప్‌డేట్ చేసి మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. జూలైలో కొత్త మోడల్‌ని లాంచ్ చేసినప్పటికీ అమ్మకాలు ఏమాత్రం పెరుగలేదు. ఈ కంపెనీ అప్‌డేట్ చేసిన కారు మోడల్ సైతం గతం మూడు నెలల్లో కేవలం 29 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో అత్యంత చెత్త రికార్డుని మహీంద్రా మూటగట్టుకుంది.

దీని కొత్త మోడల్ విడుదలకు ముందు మహీంద్రా తన అధికారిక వెబ్‌సైట్ నుంచి మరాజోను తొలగించింది. అయితే అందరూ ఈ కారుని మహీంద్రా నిలిపివేస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఎంపీవీ మార్కెట్‌లోని మారుతి ఎర్టిగా, మారుతి XL 6 వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇస్తుంది. అయినా కానీ వీటికి ఉన్న ఆదరణతో ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోతుంది. గత కొన్ని నెలలుగా అమ్మకాలు వీటికి అద్ధం పడుతున్నాయి.
గత ఆరు నెలల్లో కేవలం 77 మహీంద్రా మారాజో యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్త మోడల్ అమ్మకాలు దాని మునుపటి కంటే తక్కువగా ఉన్నాయి. ఇది షాకింగ్‌కి గురిచేస్తుంది. అయితే వీటికి ఉన్న అధిక ధరలే ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల సేల్స్ పెరగడం లేదని వారు చెబుతున్నారు.
| నెల | అమ్మకాలు |
| ఏప్రిల్ | 20 |
| మే | 16 |
| జూన్ | 12 |
| జూలై | 14 |
| ఆగస్టు | 08 |
| సెప్టెంబర్ | 07 |
మహీంద్రా మరాజో వేరియంట్ల ధరలు ఇటీవల మహీంద్రా పెంచింది. దీని మునుపటి ధరల కంటే అన్ని వేరియంట్లపై రూ. 20 వేల వరకు ధరలను పెంచింది. ఈ ఎంపీవీ వివిధ వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ.10 లక్షల నుంచి రూ. 17 లక్షల మధ్య ఉన్నాయి. ఇవి (ఎక్స్-షోరూమ్) ధరలు.
ఇక మహీంద్రా మరాజో 1.5-లీటర్ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 121 bhp పవర్, 300 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. సేఫ్టీ కోసం అన్ని వేరియంట్లలో ఎయిర్‌బ్యాగ్స్, EBD, ABS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

ఈ ఎంపీవీ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఆప్షన్లతో వస్తుంది. ఇంటీరీయర్ కూడా మంచి స్పేస్‌ని కలిగి ఉంటుంది. 7-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లను ఈ కారు అందిస్తుంది. ఈ విభాగంలో పెరుగుతున్న పోటీ అలాగే క్షీణిస్తున్న అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఈ నెలలో కొన్ని డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. ఈ ఎంపీవీపై ప్రస్తుతం రూ. 65,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








