మహీంద్రాకు చెందిన ఆ కారు ఇకపై లభించదు.. కారణం మాత్రం అదే!!
ఇటీవలి కాలంలో ఫ్యామిలీ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. చిన్న కార్లకు భిన్నంగా ఎక్కువ మంది ప్రయాణంచేలా సౌకర్యవంతమైన కార్ల కోసం చూస్తున్నారు. ఫలితంగా ఆటోమొబైల్ తయారీ సంస్థలు మరిన్ని ఎంపీవీలను అమ్మకానికి ప్రవేశపెడుతున్నాయి. అందులో భాగంగా మహీంద్రా మరాజో (Mahindra Marazzo) MPVని ప్రవేశపెట్టింది. ఈ కారు భారతీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అంతలోనే మహీంద్రా తీసుకువస్తున్న ఈ ఎంపీవీ వెహికిల్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అందరూ షాక్‌కి గురవుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం..
మహీంద్రా మరాజో భారతదేశంలో లాంచ్ అవుతుందని మరియు మరికొన్ని అప్‌గ్రేడ్స్‌తో త్వరలోనే వస్తుందని అనేక పుకార్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ కారుని తమ వెబ్‌సైట్ నుంచి సంస్థ తొలగించింది. దీనికి సంబంధించిన కారణాలను కంపెనీ వెల్లడించలేదు. మార్కెట్‌లో మంచి కార్లను విక్రయిస్తున్న మహీంద్రా నుంచి ఇదొక పెద్ద పరిణామంగా భావించవచ్చు. ఇదే సంస్థ కొద్ది రోజుల క్రితం KUV100 కారును కూడా అమ్మకం నుంచి తొలగించింది.

అయితే మరాజోను శాశ్వతంగా తొలగిస్తారా లేదా తరువాత పూర్తి అప్‌డేట్‌తో మళ్లీ తీసుకువస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ కారుకి సంబంధించి సేల్స్ ఆశించనంత లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో ఈ కారుని తీసుకువచ్చింది. ఈ కారు టాటా హెక్సా, ఇన్నోవా క్రిస్టా మరియు మారుతి XL6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది.
ఇక మహీంద్రా మరాజో అనేక లగ్జరీ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ప్రధానంగా అల్యూమినియం సస్పెన్షన్‌ని అందించారు. అంతే కారు లోపల మెరుగైన రైడ్ క్వాలిటీని అందిస్తుంది. వీటితో పాటు రియర్ ఏసీ వెంట్స్, రెండో వరుస సీట్లలో కెప్టెన్ లేదా బెంచ్ సీట్లు వంటివి కూడా ఉంటాయి. ఈ కారు మహీంద్రాలోని ఇతర కార్లకంటే భిన్నమైన డిజైన్‌తో రూపొందించారు. అందువల్ల దీనిని ఆదరించలేదని తెలుస్తుంది.

భారతీయ కస్టమర్లకు ఇలాంటి షార్ప్ డిజైన్‌లు నచ్చవని చెప్పవచ్చు. టాటా కూడా ఇదే డిజైన్‌తో ఐరాను 2017 TATA Ariaను ప్రవేశపెట్టింది. అది కూడా ప్రజలకు పెద్దగా నచ్చలేదు. ఈ కారుని కూడా జనాలు ఆదరించలేదు. ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఫ్రంట్‌లో ఫ్లాట్ మరియు కొంచెం పొడవైనవిగా ఉంటున్నాయి. అందువల్ల ఈ డిజైన్‌లనే జనాలు ఆదరిస్తున్నారు.
చాలా కాలంగా షార్ప్ డిజైన్‌లో ఉండే కారు అమ్మకాలు తక్కువగా నమోదవుతున్నాయి. 2018లో ఈ కారు విడుదల నుంచి నెలకు సగటున 60 కార్లు అమ్ముడవుతున్నాయి. అంటే ఒక్క రోజులో రెండు కార్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. గత ఏడాది కాలంలో కంపెనీ భారతదేశంలో కేవలం 721 కార్లను మాత్రమే విక్రయించింది. మే నెలలో అత్యల్పంగా 16 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

వాస్తవానికి మహీంద్రా పాత కారును కొత్త కారుగా మార్చి విజపెయవంతం చేయడంలో ప్రసిద్ధి చెందింది. కంపెనీ ఇప్పటికే బొలెరోను బొలెరో నియోగా, థార్‌ని కొత్త థార్‌గా అప్‌డేట్ చేసింది. అదేవిధంగా, ఈ కారును అప్డేట్ చేయడానికి మరియు తిరిగి తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ఈ మహీంద్రా మరాజో 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది ప్రత్యేకంగా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈ మోటార్ 121 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.90 లక్షల మధ్య ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








