ఈ కారుని 9 మంది మాత్రమే కొన్నారు.. ఆ కంపెనీకే పెద్ద మచ్చ, త్వరలోనే నిలిపివేసే అవకాశం!
దేశంలో మహీంద్రా కార్లు అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. సెప్టెంబర్‌లో మహీంద్రా దేశంలోనే ఎక్కువగా కార్లను విక్రయించిన మూడవ కంపనీగా అవతరించింది. టాటా మోటార్స్‌ని అధిగమించి ఈ కంపెనీ 3వ స్థానానికి చేరుకుంది. సెప్టెంబర్‌లో మొత్తం 51,062 యూనిట్లు, అక్టోబర్‌లో 54,504 యూనిట్ల సేల్స్‌లో అదరగొట్టింది. అయితే నవంబర్‌లో ఈ కార్ల అమ్మకాలు 46,222 యూనిట్లకు పడిపోయాయి. అయినా కానీ మహీంద్రా కార్ల క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ కంపెనీ నుంచి ప్రస్తుతం థార్ రాక్స్ భారీ డిమాండ్‌ని కలిగి ఉంది. దీనితో పాటు మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో ఎన్‌ని జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
మోడళ్లను బట్టి మహీంద్రా కార్ల వెయిటింగ్ పీరియడ్ 3 నెలల నుంచి ఏడాదిన్నరగా ఉంది. అయితే కొన్ని కార్లు మాత్రం కస్టమర్లను ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఈ సంస్థకు చెందిన మరాజో (Mahindra Marazzo) ఎంపీవీ అమ్మకాలను రాబట్టలేక పోతుంది. నవంబర్‌లో కేవలం 9 మారాజో యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత నెల అక్టోబర్‌లో 37 కార్లు అమ్ముడయ్యాయి.

అమ్మకాలను పెంచడానికి కొత్త ఎడిషన్‌లో ఈ ఎంపీవీని ప్రవేశపెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మార్కెట్‌లోని ఇతర ఎంపీవీలకు గట్టి పోటీని ఇచ్చేలా దీనిని తీసుకువచ్చినా కానీ కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. గత ఆరు నెలల సేల్స్‌ని పరిశీలిస్తే జూన్‌లో 12 కార్లు, జూలైలో 14 కార్లు, ఆగస్టులో, సెప్టెంబర్‌లో వరుసగా 8,7 కార్లు నమోదవుతున్నాయి. అయితే అక్టోబరులో 37 కార్లతో కంపెనీ కాస్త ఊపిరి పీల్చుకుంది.
మళ్లీ నవంబర్‌లో మళ్లీ పాత సీన్ రిపీట్ అవ్వడంతో తలలు పట్టుకుంటోంది. వీటి ధరలు పెరగడానికి కారణం మహీంద్రా మరాజో వివిధ వేరియంట్ల ధరలు పెరగడమేనని ఆటోమోబైల్ ఔత్సాహికులు అభిప్రాయపడుతున్నారు. M2 7 STR, M2 8 STR వేరియంట్ల ధరలు ఇప్పుడు 20,000 పెరిగాయి. అదేవిధంగా M4 ప్లస్ వేరియంట్ల ధరలను కూడా పెంచారు.

ఇక ఈ ఎంపీవీ సేఫ్టీ, కంఫర్ట్ ఆధునిక ఫీచర్లతో పాటు స్ట్రాంగ్ ఇంజిన్‌ని కలిగి ఉంది. ఇది శక్తివంతమైన 1.5-లీటర్ డీజల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 121 bhp పవర్, 300 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులోని అన్ని వేరియంట్లలో 2 స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఇక ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకు అనుకూలమైన 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్, స్టైలిష్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు. ఇతర ఎంపీవీలతో పోల్చితే ఇందులో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్ని ఫీచర్లు ఉన్నా కానీ కస్టమర్లను పెద్దగా ఆసక్తి చూపక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ధరల సర్దుబాట్లు, మోడల్ అప్‌గ్రేడ్స్ కూడా మహీంద్రా మరాజో లైనప్స్ అమ్మకాలను పెంచలేదు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం కాలేదు. భారత్‌లో ఇతర ఎంపీవీలకు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ ఈ కారు అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో దీనిని నిలిపి వేసి త్వరలోనే సరికొత్త ఎంపీవీ మోడల్‌ని మహీంద్రా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








