దేశంలో ఎక్కవగా ఆ కంపెనీ కార్లను మాత్రమే కొంటున్న జనాలు.. ఈ సంస్థ కార్లు కావాలంటే సంవత్సరం పాటు ఆగాల్సిందే!
భారత్‌లో ఎస్‌యూవీల అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మహీంద్రా ఎక్కువగా ఎస్‌యూవీలను విడుదల చేస్తుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే ఎంపీవీ, హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్‌లు ఆశించిన స్థాయిలో లాభాలను రాబట్టలేకపోయినా.. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ మాత్రం మహీంద్రా అండ్ మహీంద్రాకు మంచి సేల్స్‌ని అందిస్తున్నాయి. ఈ కంపెనీ నుంచి స్కార్పియో, బొలెరో ఇప్పటికే పేరొందాయి. ఆ తర్వాత ఎక్స్‌యూవీ700, థార్, ఎక్స్‌యూవీ 3XO ఎస్‌యూవీలు ఏ స్థాయిలో హిట్ అయ్యాయో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని నెలలుగా అమ్మకాల పరంగా మహీంద్రా దూసుకెళ్తుంది. సెప్టెంబర్‌లో మారుతి సుజుకి, హ్యుందాయ్ తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది.
టాటా మోటార్స్ సేల్స్‌ని అధిగమించి ఈ ఫీట్‌ని సాధించింది. ప్రస్తుతం టాటా కార్లు అమ్మకాల్లో అంతగా రాణించడం లేదు. ఇదే సమయంలో మహీంద్రా జోరు మీద ఉండటంతో టాటాను అలవోకగా అవతరించింది. తాజాగా అక్టోబర్ అమ్మకాల్లోనూ టాటాను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహీంద్రాకు చెందిన అక్టోబర్ 2024 సేల్స్ రిపోర్ట్ వెల్లడెంది. దీనికి సంబధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

అక్టోబర్‌లో మొత్తం 54,504 యూనిట్లను మహీంద్రా విక్రయించింది. మహీంద్రా చరిత్రలో ఇదే అత్యధిక నెలవారీ అమ్మకాలు కావడం విశేషం. మొత్తం ఏదాది అమ్మకాల్లో 24.70 శాతం వృద్ధిని మహీంద్రా సాధించింది. నిజానికి కొత్త థార్ రాక్స్ రాకతో సేల్స్ అమాంతం పెరిగాయి. 5 డోర్ల థార్ పాటు స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్, ఎక్స్‌యూవీ 700, బొలెరో వంటి పాపులర్ మోడళ్లకు కూడా మంచి డిమాండ్ ఉంది.
ప్రస్తుతం ఎక్స్‌యూవీ 3XO కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా సేల్స్‌లో సత్తా చాటుతోంది. ఈ కారుని పొందాలంటే ఏకంగా ఏడాది పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే థార్ రాక్స్‌ని ఇంటికి తెచ్చుకోవాలంటే దాదాపు ఏడాదిన్నర వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎక్స్‌యూవీ300కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా ఎక్స్‌యూవీ3XOను రీ డిజైన్‌ని ప్రవేశపెట్టారు. మారుతి బ్రెజా, టాటా నెక్సాన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.

2023 ఆర్థిక సంవత్సరంలో నెలకు 5,000 యూనిట్ల కాపాంక్ట్ ఎస్‌యూవీలను మాత్రమే అమ్ముడు అయ్యేవి కానీ గత ఆరు నెలల్లో సగటున 8,400 యూనిట్లను మహీంద్రా విక్రయిస్తోంది. వీటిలో ఎక్స్‌యూవీ 3XO మార్కెట్‌లో అధిక వాటను కలిగి ఉంది. మహీంద్రా ఎస్‌యూవీ M1, M2, M2 Pro, M3, M3 Pro, AX5, AX5 లగ్జరీ, AX7, AX7 లగ్జరీ అనే 9 వేరియంట్లలో లభ్యమవుతోంది.
ఈ ఎస్‌యూవీని టాటా నెక్సాన్ కోసం డిజైన్ చేసిన ప్రతాప్ బోస్ రూపకల్పన చేశారు. దీని డిజైన్ ఫర్ఫామెన్స్, మైలేజీలో మహీంద్రా ఎక్స్‌యూవీ రాణిస్తోంది. మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏస్ టెక్నాలజీ, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో కొనుగోలు చేయవచ్చు. వీటివల్ల ఈ కారు సూపర్ హిట్ అయ్యింది.

అంతే కాకుండా 10.2 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ 6 ఎయిర్‌బ్యాగ్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీల సరౌండ్ కెమెరా, రియర్ ఏసీ వెంట్స్, లెవల్ 2 ఏడీఏస్ సూట్‌తో ఫుల్ ప్యాక్డ్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఎక్స్‌యూవీ 3XO మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది విభాగాల్లో ఆల్‌రౌండర్ ఎస్‌యూవీగా ఉంది.


Click it and Unblock the Notifications








