మహీంద్రా సంచలన ఆఫర్.. మీ ఫెవరేట్ కార్లపై ఏకంగా రూ.3 లక్షల డిస్కౌంట్.. ఈ సీజన్‌లో ఇదే చివరిది!
దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా ఈ ఏడాది మెరుగైన అమ్మకాలను సాధించింది. భారతీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న మోడళ్లను విడుదల చేసి ఇతర కంపెనీల కంటే వేగంగా వృద్ధిని కనబరిచింది. ఇటీవల ముగిసన పండుగ సీజన్‌లో ఎక్కువ మొత్తంలో విక్రయాలను నమోదు చేసింది. అక్టోబర్ నెలలో తన వాహనాలపై పెద్ద మొత్తంలో తగ్గింపులు అందించిన కంపెనీ మరోసారి భారీ తగ్గింపులను వినియోగదారుల కోసం ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగిసి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్టోర్‌లలో ఉన్న పాత మోడళ్లను విక్రయించడానికి వినియోగదారులను ఆకర్షించడానికి ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు ఊహించని విధంగా రూ.3 లక్షల వరకు తగ్గింపులను అందిస్తున్నట్లు ఇటీవల వెల్లడించింది. 2024 ఏడాది మోడళ్లను తన స్టాక్‌ల నుంచి క్లియర్ చేయడానికి ఈ ఆఫర్లు ఉపయోగపడుతాయి.
వీటిలో మహీంద్రా కంపెనీకి చెందిన అత్యుత్తమ ఎస్‌యూవీలు ఉన్నాయి. ప్రధానంగా థార్ , స్కార్పియో N, XUV400 మోడళ్లపై తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండియాలో అత్యధికంగా డిమాండ్ ఉన్న వాటిలో ముందు స్థానంలో ఉన్నాయి. వీటి ఫీచర్లు కూడా అధునాతనంగా ఉంటాయి. భద్రత పరంగా మహీంద్రా పేరును నిలబెట్టడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ముఖ్యంగా మహీంద్రా థార్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఇండియాలో అత్యధికంగా డిమాండ్ ఉన్న మోడల్‌గా ఉంది. గతంలో 3 డోర్ థార్‌గా అందుబాటులోకి రాగా, ఇది దేశంలోనే భారీ అమ్మకాలు నమోదు చేసింది. ప్రస్తుత థార్ మోడల్‌పై కంపెనీ ప్రత్యేకంగా రూ.3 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. దీని ధర దేశీయ మార్కెట్లో రూ.11.35 లక్షల నుండి రూ. 17.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
థార్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇది అన్ని రకాల రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. థార్ టాప్-స్పెక్ 4X4 వేరియంట్‌కు రూ.3 లక్షల క్యాష్ ప్రయోజనాలు ఉన్నాయి. థార్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. డీజిల్ వేరియంట్ కంటే పెట్రోల్ వేరియంట్‌లో మరిన్ని అదనపు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ప్రస్తుతం 5 డోర్ థార్ రాక్స్‌ను తీసుకొచ్చింది. ఇది కూడా భారీగా అమ్ముడుపోతుంది.
మహీంద్రా నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న మోడల్ స్కార్పియో N పై కూడా కంపెనీ తగ్గింపును ప్రకటించింది. ఇది పెట్రోల్, డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మోడల్‌పై ప్రస్తుతం రూ.50,000 వరకు తగ్గింపును కంపెనీ అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ ధర రూ. 13.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి టాప్ వేరియంట్ రూ. 24.54 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మహీంద్రా XUV400 మోడల్ కూడా ఇండియాలో మంచి డిమాండ్ కలిగి ఉంది. కంపెనీ ఈ మోడల్‌లో ఎలక్ట్రిక్ వేరియంట్‌పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. దాదాపు రూ.3 లక్షల వరకు XUV400 ఈవీపై తగ్గింపులు ఉన్నాయి. వీటిలో క్యాష్ ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు వంటివి ఉంటాయి. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ కారును ఇండియాలో చాలా మంది వాడుతున్నారు.
వీటితో పాటు మహీంద్రా కంపెనీ నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న మరో మోడల్ బొలెరో నియో కూడా ఈ ఇయర్ ఎండ్ సేల్‌లో తగ్గింపులో లభిస్తుంది. కంపెనీ ఈ మోడల్‌పై ప్రత్యేకంగా దాదాపు రూ. 1.20 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. ప్రధానంగా వీటిలో రూ.70,000 క్యాష్ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 వరకు, అదనంగా రూ.30,000 వరకు విలువైన ఉచిత యాక్సెసరీలు లభిస్తాయి.


Click it and Unblock the Notifications








