భారతీయులు ఎగబడి కొంటున్న Mahindra కార్లు ఇవే!.. ఇప్పటికే భారీ బుకింగ్స్

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలకు భారతీయ మార్కెట్లో విపరీతమైన క్రేజు ఉంది. ఈ కారణంగానే కంపెనీ FY24 Q4లో మొత్తం 2.20 లక్షల బుకింగ్స్ పొందినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

భారతదేశంలో మహీంద్రా కార్లకు ఎక్కువ ఆదరణ ఉండటానికి ప్రధాన కారణం.. కస్టమర్లకు నచ్చిన ఫీచర్స్ ఉండటమే కాకుండా సరసమైన ధరలకు అందుబాటులో ఉండటం కూడా అని తెలుస్తోంది. కంపెనీ మొత్తం ఇంకా 2.20 లక్షల ఆర్డర్స్ పొందినట్లు, ఇందులో 50000 యూనిట్లు ఇటీవల లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO ఉన్నట్లు తెలుస్తోంది. XUV 3XO కాకుండా మిగిలిన 170000 బుకింగ్స్ ఇతర మహీంద్రా కార్లకు వచ్చాయి.

Mahindra XUV 3XO

2024 ఫిబ్రవరిలో నమోదైన 2.26 లక్షల ఓపెన్ బుకింగ్‌లతో పోలిస్తే 2024 మే 1 నాటికి కంపెనీ ఓపెన్ బుకింగ్స్ 56000 యూనిట్లు తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీ పొందుతున్న బుకింగ్స్ సంఖ్య పెరుగుతుండటంతో.. ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతోంది. ఇప్పుడు కంపెనీ నెలకు 49000 యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. దీంతో డెలివరీలు కూడా వేగవంతం అవుతున్నాయి.

2024 మే 1నాటికి మహీంద్రా XUV700 కోసం 16000 ఓపెన్ ఆర్డర్‌లను కలిగి ఉంది. ఈ సంఖ్య 2024 ఫిబ్రవరితో పోలిస్తే చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఈ SUV ప్రతి నెలా సగటున 8000 యూనిట్ల బుకింగ్స్ పొందుతున్నట్లు సమాచారం. మొత్తం బుకింగ్‌లలో సుమారు 65 శాతం థార్, స్కార్పియో-ఎన్ మరియు స్కార్పియో క్లాసిక్ ఉన్నాయి. వీటి బుకింగ్స్ మే 1నాటికి 86000 యూనిట్లు.

Mahindra XUV700

స్కార్పియో-ఎన్ మరియు స్కార్పియో క్లాసిక్ SUVలు నెలకు 17000 బుకింగ్స్ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మహీంద్రా థార్ డెలివరీలు ఇంకా 59000 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే థార్ కోసం కంపెనీ నెలకు 7000 బుకింగ్స్ స్వీకరిస్తుంది. మరోవైపు మహీంద్రా బొలెరో కూడా 10000 ఓపెన్ బుకింగ్స్ పొందింది. ప్రస్తుతం నెలకు 9500 బుకింగ్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO డెలివరీలు ఈ నెల (2024 మే) 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రారంభంలో కంపెనీ నెలకు 9000 యూనిట్లను డెలివరీ చేస్తుంది. ఆ తరువాత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నెలకు 10500 యూనిట్లకు పెంచే అవకాశం ఉంది. ఈ కారు బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో 21000 బుకింగ్స్, 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.

Mahindra XUV 3XO

మహీంద్రా కంపెనీ యొక్క కార్లకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం కంపెనీ నెలకు 49000 యూనిట్లను తయారు చేస్తోంది. 2025 చివరి నాటికి ఈ సంఖ్యను కంపెనీ 64000 యూనిట్లకు చేర్చడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సంఖ్య 5000 నుంచి 10000 యూనిట్లకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మహీంద్రా తన కస్టమర్లకు డెలివరీలను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, May 17, 2024, 12:14 [IST]
English summary
Mahindra open booking of over 2 20 lakh units
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+