ఈ కారు కొనుగోలుపై రూ.1.50 లక్షల డిస్కౌంట్.. ఇది చూడండి

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎక్స్​యూవీ700' (XUV700) SUV మీద అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. కంపెనీ ఈ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి అద్భుతమైన అమ్మకాలు పొందుతున్న 'ఎక్స్​యూవీ700' ఇప్పటికి కూడా కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. ఈ కారు యొక్క అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఇప్పుడు ఏకంగా రూ. 1.50 లక్షల తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటుంది. ఎక్స్​యూవీ700 కొనాలనుకునే వారు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు.

Mahindra XUV700

మహీంద్రా ఎక్స్​యూవీ700 మీద కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్ కేవలం 2023 మోడల్స్ మీద మాత్రమే వర్తిస్తుంది. రూ. 1.5 లక్షల డిస్కౌంట్ అనేది క్యాష్ డిస్కౌంట్ రూపంలో లభిస్తుంది. ఇందులో ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపులు వంటివి అందుబాటులో లేదు. ఈ ఆఫర్ అన్ని సెవెన్ సీటర్ వేరియంట్ల మీద లభిస్తుంది. ఏఎక్స్5 ఫైవ్ సీటర్ వేరియంట్ కొనుగోలుపైనా రూ. 1.30 లక్షల డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది.

భారతీయ విఫణిలో టాటా హారియర్ మరియు జీప్ కంపాస్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉన్న ఈ మహీంద్రా ఎక్స్​యూవీ700 మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారులో సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, రూప్ రెయిల్స్, షార్క్ పిన్ యాంటెన్నా, ఫ్లస్ డోర్ హ్యాండిల్స్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కారును అద్భుతంగా కనిపించేలా చేస్తాయి.

Mahindra XUV700 Front Profile

ఫీచర్స్ విషయానికి వస్తే.. మహీంద్రా యొక్క XUV700 SUV ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేసే 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా.. డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 60 కంటే ఎక్కువ కార్ కనెక్టెడ్ ఫీచర్స్, యాంబియంట్ లైటింగ్, వాయిస్ అసిస్ట్, పవర్డ్ ఆపరేట్ వెంటిలేటెడ్ సీట్లు మరియు రెండు, మూడు వరుసలలో ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి.

మహీంద్రా XUV700 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 200 హార్స్ పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 155 హార్స్ పవర్, 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Mahindra XUV700 Front View

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. మహీంద్రా యొక్క XUV700 అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ ఫైలెట్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్ణింగ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

గమనిక: మహీంద్రా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ లేదా డిస్కౌంట్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఉన్న స్టాక్ మీద కూడా ఈ ఆఫర్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి XUV700 SUV కొనాలనుకునే కస్టమర్ ఖచ్చితమైన తగ్గింపులను గురించి వివరంగా తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న స్థానిక డీలర్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, April 5, 2024, 14:00 [IST]
English summary
Mahindra rs 1 50 lakh discount on xuv700 suv details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+