Scorpio N కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ - మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఛాన్స్!
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యధిక అమ్మకాలు పొందిన మహీంద్రా కంపెనీ యొక్క కొత్త 'స్కార్పియో ఎన్'(Scorpio N) గురించి అందరికి తెలుసు. సంస్థ ఇప్పుడు ఈ కారు కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మహీంద్రా కంపెనీ ఇప్పుడు తన 2023 స్కార్పియో ఎన్ కొనుగోలుపైనా ఏకంగా రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. సంస్థ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. దీంతో కొత్త కస్టమర్లకు కొంత తక్కువ ధరలోనే స్కార్పియో ఎన్ అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ డిస్కౌంట్ అందించడం జరుగుతోందని తెలుస్తోంది.

కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ డిస్కౌంటర్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. కేవలం క్యాష్ డిస్కౌంట్ రూపంలో మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. కార్పొరేట్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి ఈ కారు కొనుగోలుపైన లభించవు. కస్టమర్లు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాల్సి ఉంటుంది.
కంపెనీ అందించే డిస్కౌంట్ గురించి క్లుప్తంగా గమనిస్తే.. స్కార్పియో ఎన్ యొక్క టాప్ స్పెక్ వేరియంట్ జెడ్8 మరియు జెడ్8ఎల్ డీజిల్ 4X4 వేరియంట్లు (7 సీటర్) మీద రూ. 1 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ వేరియంట్లకు వర్తిస్తుంది. అదే సమయంలో జెడ్8 మరియు జెడ్8ఎల్ డీజిల్ 4X2 వేరియంట్స్ (6 మరియు 7 సీటర్) మీద రూ. 60000 తగ్గింపు పొందవచ్చు.

ఇక మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క జెడ్8 మరియు జెడ్8ఎల్ పెట్రోల్ ఆటోమాటిక్ వేరియంట్ (6 సీటర్ మరియు 7 సీటర్) కొనుగోలుపైనా కస్టమర్ రూ. 60000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే స్కార్పియో ఎన్ యొక్క ఏ వేరియంట్ కొనుగోలుపైనా.. క్యాష్ డిస్కౌంట్ తప్పా.. ఇతర ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ లభించవు. ఇవన్నీ కస్టమర్ తప్పకుండా గమనించాలి.
మహీంద్రా స్కార్పియో ఎన్ చూడటానికి కొంత దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది 2.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ యూనిట్ 203 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 175 హార్స్ పవర్ అందిస్తుంది. ఇవి రెండు 6-స్పీడ్ మాన్యువల్ మరియు అంటిమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి.

మహీంద్రా యొక్క స్కార్పియో ఎన్ మోడల్ రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ స్టాండర్డ్‌గా పొందుతుంది. డీజిల్ ఇంజిన్ మోడల్స్ మాత్రం డ్రైవ్ ఆప్షన్ పొందుతుంది. పనితీరు పరంగా ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఈ కారును కొనుగోలు చేయడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. అయితే కంపెనీ ఇప్పుడు రూ. 1 డిస్కౌంట్ అందించడంతో తప్పకుండా మరిన్ని గొప్ప అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.
మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క ధరల విషయానికి వస్తే.. మార్కెట్లో ప్రస్తుతం స్కార్పియో ఎన్ ధరలు రూ.13.60 లక్షల నుంచి నిరూ.24.54 లక్షల (ఎక్స్ షోరూమ్రూ, ఇండియా) మధ్య ఉన్నాయి. ఈ కారుకు మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థులు లేనప్పటికీ.. ధర పరంగా టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్ మరియు హ్యుందాయ్ ఆల్కజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








