స్కార్పియో లవర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త క్లాసిక్ బాస్ ఎడిషన్.. ఇది చాలా స్పెషల్ గురూ!
దీపావళి పండుగను పురస్కరించుకుని దేశంలో చాలా ఆటోమొబైల్ తయారీ కంపెనీలు కొత్త కార్లను విడుదల చేయగా, ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా తన విజయవంతమైన స్కార్పియో SUVలో కొత్త క్లాసిక్ బాస్ ఎడిషన్‌ను(Scorpio Classic Boss Edition) తీసుకొచ్చింది. పాత వాటితో పోలిస్తే, దీనిలో సరికొత్త అప్‌డేట్‌లు, ఫీచర్లను అందించారు. దీని ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ ప్రత్యేక ఎడిషన్ 2024 పండుగ సీజన్‌లో కంపెనీకి కీలకం కానుంది. SUV సాధారణ మోడల్‌ల ధర రూ. 13.62 లక్షల నుంచి రూ. 17.42 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. అయితే, కొత్త క్లాసిక్ బాస్ ఎడిషన్ ఇంత కంటే మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఇంజిన్-సామర్థ్యం: స్కార్పియో క్లాసిక్ కొత్త బాస్ ఎడిషన్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఇంజిన్ 132 PS పవర్‌తో 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. అయితే, స్కార్పియో N వలె కాకుండా, ఈ మోడల్ ఫోర్-వీల్-డ్రైవ్ ఆప్షన్‌ను అందించదు.

ఎక్స్‌టీరియర్-ఇంటీరియర్ డిజైన్: కొత్త బాస్ ఎడిషన్ చూడటానికి స్టైలీష్ లుక్‌ను కలిగి ఉంటుంది. హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఫాగ్ లైట్లు, సరికొత్త గ్రిల్, డోర్ హ్యాండిల్స్, చుట్టూ డార్క్ క్రోమ్ గార్నిష్‌లు ఉన్నాయి. లోపల డ్యూయల్-టోన్ బ్లాక్, లేత గోధుమరంగు డాష్‌బోర్డ్ థీమ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, కంఫర్ట్ కిట్‌లో నెక్ కుషన్లు, దిండ్లు, బ్లాక్‌పౌడర్ కోటింగ్‌తో రియర్ గార్డ్ వంటివి ఉన్నాయి.
అలాగే, ఫోన్ మిర్రరింగ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఫాక్స్ లెదర్ స్టీరింగ్ వీల్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, ఆటో డోర్ లాక్, క్రూయిజ్ కంట్రోల్ వంటి వాటిని కూడా దీనిలో అందించారు. యాక్సిడెంట్ సమయంలో ప్రయాణికుల భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, వీటి కోసం వెనుక పార్కింగ్ కెమెరాను అందించారు.

స్కార్పియో క్లాసిక్ కొత్త బాస్ ఎడిషన్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో కూడిన 17-అంగుళాల వీల్స్‌ను కలిగి ఉంది. దీనిలో 3 వరుసల సీటింగ్ ఆప్షన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఇతర మధ్యతరహా SUVలకు ఈ కొత్త ఎడిషన్ గట్టి పోటీ ఇస్తుంది. ఈ దీపావళికి వినియోగదారులకు బాస్ ఎడిషన్ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ప్రస్తుతం ధరలు ప్రకటించనప్పటికి అతి త్వరలోనే ధరలను కంపెనీ ప్రకటించనుంది.
భారత్‌లో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి ఆటోమొబైల్ కంపెనీలు దీపావళికి ముందు కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, ఈ సీజన్‌లో మంచి అమ్మకాలను నమోదు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో మహీంద్రా సైతం పయనిస్తుంది. దేశంలో స్కార్పియో SUVకు బలమైన డిమాండ్ ఉంది. కంపెనీ అమ్మకాల్లో ఈ మోడల్ ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి లగ్జరీ స్టైలీష్ లుక్‌తో ఉన్న స్కార్పియోను కొత్త ఎడిషన్‌లో కంపెనీ తీసుకొచ్చింది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








