మహీంద్రా స్కార్పియో Nలో కొత్త ఫీచర్లు.. ఇకపై రాజకీయ నాయకులు మొత్తం దీనినే కొంటారు!!
దేశంలో స్కార్పియో కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ మహీంద్రా స్కార్పియో కార్లు ముఖ్యంగా భారతీయ రాజకీయ నాయకులకు ఇష్టమైన కారు మోడళ్లలో ఒకటిగా ఉంది. అతి తక్కువ కాలంలనే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ మోడళ్లలో ఒకటిగా ఉంది. ఈ కారు అర్బన్ మొబిలిటీ మరియు ఆఫ్-రోడ్ కోసం రెండింటికీ స్కార్పియో అనువైన కారుగా ఉంది. మహీంద్రా స్కార్పియో ప్రస్తుతం క్లాసిక్, స్కార్పియో N అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు తాజాగా మహీంద్రా స్కార్పియో N మరిన్ని ఫీచర్లతో రానుంది. దీనికి సంబంధించిన వివరాలు మీకోసం..
స్కార్పియో Nలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఇప్పుడు మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి మరికొన్ని సూపర్ ఫీచర్లను జోడించింది. మహీంద్రా స్కార్పియో N మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి Z8 S, Z 8 మరియు Z8Lగా ఉన్నాయి. ఇందులోని టాప్ వేరియంట్ Z8Lతో సహా మిగతా రెండు వేరియంట్లలో కూడా అదనపు ఫీచర్లను మహీంద్రా జోడించింది.

ఇక టాప్ వేరియంట్ Z8L అత్యధిక ఫీచర్లు ఉన్నాయి. ఈ వేరియంట్‌లో వెంటిలేటెడ్ సీట్లు, ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, యాక్టివ్ కూలింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మరియు హై-గ్లాస్ సెంటర్ కన్సోల్ ఉన్నాయి. అదేవిధంగా జెడ్ 8 S, జెడ్ 8 వేరియంట్లలో వైర్ లెస్ ఛార్జర్ మరియు హై-గ్లాస్ సెంటర్ కన్సోల్‌ని అందిస్తుంది.
కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి మహీంద్రా స్కార్పియో ఎన్ లో ఈ ఫీచర్లను ప్రవేశపెట్టింది. మహీంద్రా ఇప్పటికే ఈ మూడు వేరియంట్లలో చాలా ప్రత్యేకమైన మరియు ఆధునిక సాంకేతిక ఫీచర్లను అందించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మరిన్నీ అదనపు ఫీచర్లను జోడించింది. ఈ కొత్త ఫీచర్లతో వినియోగదారులకు అదనపు ప్రీమియం రైడ్ అనుభవం పొందుతారు. స్కార్పియో కార్లు క్లాసిక్ లుక్‌ని కలిగి ఉంటాయి.

ఈ కార్లు భారీ పరిమాణంతో పాటు ఆధునిక ఫీచర్లు మరియు సేఫ్టీకి మహీంద్రా స్కార్పియో ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. స్కార్పియో N లో స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల స్కార్పియో ఎన్ సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సరైన కారుగా ఉంటుంది. మహీంద్రా స్కార్పియో 5-స్టార్ సేఫ్టీ రేటెడ్ కారుగా ఉంది. మహీంద్రా నుంచి లభిస్తున్న ఈ హై క్వాలిటీ కారు ఇప్పుడు మరింత క్వాలిటీతో రానుంది.
జెడ్ 8 సెలెక్ట్ వేరియంట్ ప్రారంభ ధర రూ .17.10 లక్షలు, జెడ్ 8 ప్రారంభ ధర రూ .18.74 లక్షలు మరియు టాప్ స్పెక్ జెడ్ 8 L ధర రూ .20.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. మహీంద్రా ఇటీవల స్కార్పియో ఎన్ శ్రేణిలో ధరలను రూ .10,000 పెంచిన విషయం తెలిసిందే.
టాప్-స్పెక్ జెడ్ 8L 6 ఎయిర్ బ్యాగులు, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, పవర్డ్ డ్రైవర్ సీటు, సన్ రూఫ్, 18-అంగుళాల అల్లాయ్స్, సోనీ ఆడియో సిస్టమ్, ఫ్రంట్ మరియు రియర్ కెమెరా, డ్రైవర్ నిద్ర అలర్ట్ చేసే అధునాతన ఫీచర్లతో పాటు మరిన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఈ మహీంద్రా స్కార్పియో ఎన్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ డీజల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.
ఈ స్కార్పియో 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అయితే 4డబ్ల్యూడీ (Wheel Drive) ఆప్షన్ కేవలం డీజిల్ ఇంజిన్‌కి మాత్రమే పరిమితం చేయబడింది. తాజాగా మహీంద్రా మరాజోను (Mahindra marazzo) విక్రయాయను నిలిపివేసింది. ఆశించిన సేల్స్ లేకపోవడమే కారు నిలుపుదలకు కారణమని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో దీని అమ్మకాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.


Click it and Unblock the Notifications








