కేవలం ఏడాదిన్నరలో లక్షకు చేరిన మహీంద్రా SUV ఉత్పత్తి.. ఏంటీ కారు ప్రత్యేకత!!

మహీంద్రా సంస్థ తాజాగా కీలక మైలురాయిని దాటింది. దేశంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థగా పేరుతెచ్చుకున్న మహీంద్రా.. తాజాగా లక్ష యూనిట్ల మహీంద్రా స్కార్పియో N SUVలను (Mahindra Scorpio N SUV) ఉత్పత్తి చేసింది. కేవలం ఒకటిన్నర సంవత్సర కాలంలోనే ఈ ఘనతను సొంతం చేసుకున్న వాహనంగా స్కార్పియో N నిలిచింది.

మహీంద్రా సంస్థ స్కార్పియో N వాహనాన్ని 2022 జూన్‌లో భారత్‌లోకి విడుదల చేసింది. కేవలం 1.5 సంవత్సరంలోనే ఏకంగా లక్ష కార్లను ఉత్పత్తి చేసింది. ఈ స్కార్పియో N మోడల్‌.. పాత మోడల్‌ తరహా బాడీని కలిగి ఉంటుంది. అయితే సాధారణ స్కార్పియోతో పోలిస్తే ఆకట్టుకొనే లుక్‌, అధునిక సాంకేతికను కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ SUV లకు భారీ డిమాండ్‌ ఉంటుంది.

Mahindra scorpio N production milestone

5 వేరియంట్లు.. 7 రంగుల్లో లభ్యం : మహీంద్రా స్కార్పియో N కారు ఆఫ్‌ రోడ్ అయినప్పటికీ.. లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ SUV.. Z2, Z4, Z6, Z8, Z8L వంటి 5 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. మరియు 7 కలర్‌ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 3 వరుసల సీటింగ్‌తో వస్తుంది.

మహీంద్రా స్కార్పియో N కారు పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లను కలిగి ఉంటుంది. 2.0 లీటర్‌ Mstallion పెట్రోల్‌ ఇంజిన్‌ మరియు 2.2 లీటర్‌ mHawk డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. డీజిల్‌ ఇంజిన్‌ 173 bhp శక్తి, 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్‌ ఇంజిన్‌ 6 - స్పీడ్‌ మాన్యువల్‌ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అదే పెట్రోల్‌ ఇంజిన్‌ 200 bhp శక్తిని, 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6- స్పీడ్‌ మాన్యువల్‌ లేదా ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌, టైర్‌ ప్రజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటి కంట్రోల్‌, హిల్‌ డిసెంట్ కంట్రోల్‌, ISOFIX చైల్డ్‌ సీట్‌ మౌంట్స్‌, గ్లోబర్‌ NCAP సేఫ్టీ రేటింగ్‌తో ఈ కారు 5 రేటీంగ్‌ను సొంతం చేసుకుంది. అదే విధంగా చిన్నారుల భద్రతలో 3 స్టార్‌ను రేటింగ్‌ను పొందింది.

మహీంద్రా సంస్థ ఇటీవల తన కార్ల ధరలను పెంచింది. అందుబాటులో భాగంగా స్కార్పియో N ధరలు కూడా పెరిగాయి. అయితే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ రూ.39000 పెరిగింది. మిగిలిన వేరియంట్లు కేవలం రూ.600 చొప్పున పెరిగాయి. మహీంద్రా స్కార్పియో N SUV ప్రారంభ ధర రూ.13.60 లక్షలుగా ఉంది. హైఎండ్‌ మోడల్‌ ధర రూ.24.54 లక్షల వరకు ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, February 2, 2024, 16:15 [IST]
English summary
Mahindra scorpio n surpasses 1 lakh unit production milestone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+