Mahindra Scorpio N కొత్త వేరియంట్ - తెలుసుకోవాల్సిన విషయాలు!

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మహీంద్రా' యొక్క 'స్కార్పియో ఎన్' ఇప్పుడు ఓ కొత్త వేరియంట్‌లో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ మోడల్ డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.

మహీంద్రా అండ్ మహీంద్రా భారతీయ విఫణిలో లాంచ్ చేసిన కొత్త స్కార్పియో ఎన్ వేరియంట్ పేరు 'జెడ్8 సెలక్ట్' (Z8 Select). ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు ఇప్పటికే ఉన్న జెడ్8 స్టాండర్డ్ కింద మరియు జెడ్6 వేరియంట్ పైన ఉంటుంది. ఇది వచ్చే నెల ప్రారంభం నుంచి (2024 మార్చి 1) డీలర్‌షిప్‌లలోకి రానున్నట్లు సమాచారం.

Mahindra Scorpio N Z8 Select

ధర

ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవలసిన అంశం 'మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్8 సెలక్ట్' వేరియంట్ యొక్క ధర. ఈ మోడల్ యొక్క ప్రారంభ ధర రూ. 16.99 లక్షలు కాగా.. టాప్ ఎండ్ మోడల్ (డీజిల్ ఆటోమాటిక్) ధరలు రూ. 18.99 లక్షల వరకు ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కొత్త వేరియంట్ ధర ఇప్పటికే ఉన్న జెడ్8 స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా తక్కువ.

మొత్తం ధరలను గమనిస్తే.. జెడ్8 సెలక్ట్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 16.99 లక్షలు కాగా, పెట్రోల్ ఆటోమాటిక్ ధర రూ. 18.49 లక్షలు. డీజిల్ మాన్యువల్ ధరలు రూ. 17.99 లక్షలు కాగా, డీజిల్ ఆటోమాటిక్ ధర రూ. 18.99 లక్షలు. ఈ ధరలన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ఇండియా. ఆన్ రోడ్ ధరలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

డిజైన్

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 'స్కార్పియో ఎన్ జెడ్8 సెలక్ట్' వేరియంట్ ఇప్పటికే ఉన్న జెడ్8 స్టాండర్డ్ మోడల్ కారుకు సమానంగా ఉంటుంది. అయితే ఇందులో మిడ్‌నైట్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్ చూడవచ్చు, ఇంకా ఎల్ఈడీ లైటింగ్, సన్‌రూఫ్, 17 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. మొత్తానికి ఈ కారును చూడగానే కొత్త వేరియంట్ అని చెప్పడం కష్టమే.

ఫీచర్స్

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7.0 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, రియర్ డిస్క్ బ్రేక్స్ మరియు ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. సేఫ్టీ పరంగా కూడా ఈ కారు అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇంజిన్

కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్8 సెలక్ట్ వేరియంట్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 203 హార్స్ పవర్ మరియు 308 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 175 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Sunday, February 25, 2024, 12:00 [IST]
English summary
Mahindra scorpio n z8 select launched india price features and engine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+