జనాలు ఎక్కువగా కోరుకుంటున్న కారు ఇదే.. స్టైలీష్ డిజైన్‌తో అందరిని ఆకట్టుకుని సేల్స్‌లో రెచ్చిపోతుంది
దేశీయ ఆటోమొబైల్ తయారీదారులు నవంబర్ ముగిసిన తర్వాత వరుసగా ఈ నెలలో జరిగిన విక్రయాల డేటాను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే చాలా వాహన సంస్థలు కూడా తమ వివరాలను విడుదల చేయగా, తాజాగా ఇప్పుడు ఇండియా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా కూడా తన ప్రసిద్ధ కారు అయినటువంటి స్కార్పియో విక్రయాల డేటాను ప్రకటించింది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, దేశంలో మంచి డిమాండ్ కలిగిన స్కార్పియో 2024 నవంబర్ నెలలో 12,704 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 12,185 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన దాదాపు 4 శాతం వృద్ధి చెందింది. అదే ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీ మొత్తం 46,222 యూనిట్ల విక్రయాలను సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో 39,981 యూనిట్ల అమ్మకాలుగా ఉంది.
ఏడాది ప్రాతిపదికన మహీంద్రా నవంబర్ అమ్మకాలను చూస్తే, 15.6 శాతం వృద్ధిని కనబరిచింది. దీని కంటే మారుతీ, హ్యూందాయ్ మోటార్స్, టాటా మోటార్స్ కంపెనీలు ముందు స్థానంలో ఉన్నాయి. స్కార్పియో విషయానికి వస్తే, క్లాసిక్‌తో పాటు స్కార్పియో N వేరియంట్లు కంపెనీ అమ్మకాలు పెరగడానికి బాగా ఉపయోగపడ్డాయి. వీటికి ఇండియా మార్కెట్లో ప్రజాదారణ ఎక్కువగా ఉంది. స్కార్పియో ఆకట్టుకునే స్టైలీష్ డిజైన్‌తో ఉంది.

దేశీయ మార్కెట్లో స్కార్పియో N బేస్ వేరియంట్ ధర రూ.13.85 లక్షల నుంచి ఫీచర్ల ఆధారంగా టాప్ వేరియంట్ ధర రూ. 24.54 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది రెండు ఇంజిన్ ఆఫ్షన్‌లలో లభిస్తుంది. మొదటిది 2.0 లీ ఎంస్టాలన్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 200 PS పవర్‌ను, 380 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
రెండోది 2.2 లీ ఎంహాక్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌లో లభిస్తుంది. ఈ వేరియంట్ 175 PS పవర్, 400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లు రెండు కూడా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ కారు ఎక్స్‌టీరియర్ చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ కూడా అందంగా ఉంటుంది.

స్కార్పియో N క్యాబిన్‌లో టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, అలెక్సా ఇంటిగ్రేషన్ ,కాఫీ-బ్లాక్ లెథెరెట్ ఇంటీరియర్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 60కి పైగా ఇన్-కార్ కనెక్ట్ ఫీచర్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డంపింగ్ (FDD),ప్రయాణికుల రక్షణ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లతో అదనపు భద్రత, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)వంటి ఇంకా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో N దేశీయంగా మెరుగైన విక్రయాలను నమోదు చేయడంతో పాటు, ఇతర దేశాలకు ఎగుమతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మహీంద్రా మొత్తం అమ్మకాలు పెరగడానికి ఈ ఒక్క మోడల్ మాత్రమే కాకుండా XUV700,ఇటీవల కొత్తగా వచ్చిన థార్ రాక్స్ వంటివి కూడా బాగా తోడ్పాటు అందించాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








