ఈ ఏడాది హాట్ కేకుల్లా అమ్ముడైన మహీంద్రా బెస్ట్ మోడల్ ఇదే.!.. 1.50 లక్షల సేల్స్‌తో రికార్డు
భారత మార్కెట్లో గడిచిన పదేళ్లలో హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లను మించి SUVల సేల్స్ జరిగాయి. ప్రస్తుతం, దేశంలో విక్రయించబడుతున్న మొత్తం కార్లలో SUVల వాటా 54%. మైక్రో, సబ్ 4 మీటర్ల, మిడ్ రేంజ్ మరియు ఫుల్ సైజ్ SUV వంటి వివిధ విభాగాల్లో అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం దేశంలో మూడు వరుసల SUVలకు క్రేజ్ ఉంది. ఈ ఏడాది మార్కెట్లో ఎక్కువగా అమ్ముడైన SUVల వివరాలు చూద్దాం.
మహీంద్రా స్కార్పియో జూన్ 20, 2002న భారత మార్కెట్లో విడుదలైంది. స్కార్పియో మహీంద్రా & మహీంద్రా యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్. మూడు ఫేస్‌లిఫ్ట్‌ల తర్వాత, కంపెనీ 2022లో స్కార్పియో క్లాసిక్‌ని ప్రవేశపెట్టింది. స్కార్పియో క్లాసిక్‌తో పాటు, మహీంద్రా స్కార్పియో ఎన్ మోడల్‌ను కూడా విక్రయిస్తోంది. ఈ రెండు మోడల్స్ మార్కెట్లో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.

స్కార్పియో ఎన్ రాకతో, ఎస్‌యూవీ అమ్మకాలు ఊపందుకున్నాయి. జనవరి 2024 నుంచి 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో స్కార్పియో ఆధిపత్యం చెలాయిస్తోంది. మహీంద్రా స్కార్పియో 11 నెలల్లో 1.50 లక్షల మంది కొత్త కస్టమర్లను సంపాదించుకుందంటే క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. కాగా మహీంద్రా జనవరి నుంచి నవంబర్ 2024 వరకు 1,54,169 స్కార్పియో SUVల అమ్మకాలు చేసింది.
Scorpio N SUV ధర విషయానికొస్తే దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.85 లక్షల నుంచి రూ. 24.54 లక్షల వరకు ఉంది. స్కార్పియో ఎన్ Z2, Z4, Z6 మరియు Z8 అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. దీనిని 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో సంస్థ విక్రయిస్తోంది.

ఫీచర్ల పరంగా ఇందులో 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, సన్‌రూఫ్, 12-స్పీకర్ సౌండ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో డిమ్మింగ్ స్కార్పియో N కూడా IRVMని కలిగి ఉంది.
స్కార్పియో ఎన్ ఎస్‌యూవీ భద్రత పరంగా కూడా పటిష్ఠంగా ఉంది. కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు మరియు వెనుక కెమెరాలు, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ఉన్నాయి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో స్కార్పియో N 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

మహీంద్రా స్కార్పియో N SUV థార్ మరియు XUV700 నుంచి ఇంజిన్లను పంచుకుంది. 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ Mstallion పెట్రోల్ మరియు 2.2-లీటర్ నాలుగు-సిలిండర్ Mhawk డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. స్కార్పియో N యొక్క టాప్-ఎండ్ వేరియంట్ ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) సిస్టమ్‌ను కలిగి ఉంది.
స్కార్పియో క్లాసిక్ విషయానికి వస్తే, దీని ధర ₹ 13.62 లక్షల నుండి ₹ 17.42 లక్షల వరకు ఉంది. స్కార్పియో క్లాసిక్ S మరియు S11 అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీనిని 7 మరియు 9 సీట్ల లేఅవుట్‌లో కొనుగోలు చేయవచ్చు. 9-అంగుళాల టచ్ స్క్రీన్, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, 2వ మరియు 3వ వరుస వెంటిలేటెడ్ సీట్లు వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది.
భద్రతా ఫీచర్ల పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌లో 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను చూడవచ్చు. ఈ ఇంజిన్ యూనిట్ 132 PS పవర్ మరియు 300 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో అందుబాటులో ఉంది.
స్కార్పియో N మాదిరిగా కాకుండా, స్కార్పియో క్లాసిక్‌కి 4-వీల్ డ్రైవ్ (4WD) డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్ లేదు. స్కార్పియో మోడల్‌లు భారత మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజార్, MG హెక్టర్ ప్లస్ మరియు మహీంద్రా XUV700 లకు పోటీ ఇస్తున్నాయి. డిసెంబరు సంవత్సరాంతపు ఆఫర్‌లలో భాగంగా వచ్చే సేల్స్‌తో స్కార్పియో ఈ క్యాలెండర్ ఇయర్‌ను హ్యాపీగా ముగించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








