Upcoming cars కారు కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారా.. త్వరలో రానున్న వాహనాల గురించి తెలుసుకోండి.!!
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో జనవరిలో అనేక సంస్థలు తమ కార్లను ఆవిష్కరించాయి, విడుదల చేశాయి. ఫిబ్రవరిలోనూ (Upcoming cars in February 2024) అనేక సంస్థలు తమ వాహనాలను లాంచ్, ఆవిష్కరించేందుకు సిద్ధం చేశాయి. ఈ జాబితాలో మహీంద్రా, మారుతి సుజుకి, టాటా వంటి సంస్థలు ఉన్నాయి.
మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్ : మహీంద్రాలో ఆదరణ పొందిన కార్లలో XUV300 ఒకటి. ఈ SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరిలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కారు పాత మోడల్ కంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు.

పెద్ద ఎయిర్ ఇన్‌టేక్, ఫ్రంట్ బంపర్, హెడ్‌ల్యాంప్‌లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పరోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు కొత్త అల్లాయ్ వీల్స్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ సహా డేటైం రన్నింగ్ లైట్లు ఇతర కీలక ఫీచర్లతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
మారుతి సుజుకి 4వ జనరేషన్ స్విఫ్ట్ : భారత్‌లో ఎక్కువ విక్రయాలు సొంతం చేసుకున్న మారుతి సుజుకి మోడళ్లలో స్విఫ్ట్ కూడా ఒకటి. త్వరలో 4వ తరం వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. ఈ కారు కొత్త సిరీస్ ఇంజిన్‌తో అందుబాటులో ఉండనుంది. మరియు డిజైన్ పరంగానూ భారీ మార్పులు చేశారు. ఇంటీరియర్‌లో అధునాతన ఫీచర్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల నుంచి ఈ కారు ఉత్పత్తి ప్రారంభం కానుందని సమాచారం. దీంతోపాటు ఇన్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్లు, మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానుంది. ఈ కారు లీటర్‌కు 30 కి.మీ నుంచి 40 కి.మీ మైలేజీని అందిస్తుంది. అయితే కచ్చితమైన మైలేజీ వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయిత గత మోడల్ కంటే గణనీయ స్థాయిలో మైలేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ 13 రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్యూర్ వైట్, ప్రాంటియర్ బ్లూ, కారవాన్ ఐవరీ, కూల్ ఎల్లో, ప్లేమ్ ఆరేంజ్, ప్రీమియం సిల్వర్, స్టార్ సిల్వర్, సూపర్ బ్లాక్ మరియు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు బర్నింగ్ రెడ్, ఫ్రాంటియర్ బ్లూ, కూల్ ఎల్లో, ప్యూర్ వైట్ వంటి రంగుల్లో లభిస్తుంది.

4వ తరం మారుతి సుజుకి స్విఫ్ట్ 3860mm పొడవు, 1695mm వెడల్పు, 1500mm ఎత్తు, 2450mm వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది. కొత్త హ్యాచ్‌బ్యాక్ 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో వస్తుంది. ఇది ఆపిల్ Carplay, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్టు చేస్తుంది. మరియు క్లైమెట్ కంట్రోల్, స్టార్ట్-స్పాప్ బటన్ వంటి కీలక ఫీచర్లను కలిగి ఉన్నాయి.
టాటా టియాగో, టిగోర్ సీఎన్‌జీ AMT : దేశంలోనే తొలిసారిగా సీఎన్‌జీ వేరియంట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను టాటా టియాగో, టిగోర్ వాహనాలను కలిగి ఉన్నాయి. 21 వేల రూపాయలు చెల్లించి ఈ కార్లను ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. టాటా టియాగో XTA, XZA+ XZA NRG వేరియంట్లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటాయి. అదే టాటా టిగోర్ XZA, XZA+ CNG వేరియంట్లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్నాయి.

స్కోడా ఆక్టావియా ఫేస్‌లిఫ్ట్ : ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ ఫిబ్రవరి నెలలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే భారత్‌లో ఈ కారు విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కారు కొత్త హెడ్‌ల్యాంప్, LED DRL, అప్‌గ్రేడ్ చేసిన గ్రిల్, బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








