అమాంతం పెరిగిన Mahindra Thar ధరలు - పూర్తి వివరాలు
దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ ఆఫ్-రోడర్ థార్ ధరలను పెంచినట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఈ నెల నుంచే అమలులోకి వస్తాయి. థార్ కొత్త ధరల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మహీంద్రా కంపెనీ ఇప్పుడు మూడు వేరియంట్ల ధరలను మాత్రమే రూ. 10000 వరకు పెంచింది. ఇందులో బేస్ వేరియంట్ AX (O) డీజిల్ RWD మాన్యువల్, LX డీజిల్ RWD మాన్యువల్ మరియు LX పెట్రోల్ RWD ఆటోమాటిక్ ఉన్నాయి. ధరల పెరుగుదల తరువాత ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 11.35 లక్షలు, రూ. 12.85 లక్షలు, రూ. 14.1 లక్షల వద్ద ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి అమాంకాలతో దూసుకెళ్తున్న మహీంద్రా థార్ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. మారుతి సుజుకి జిమ్నీ మరియు ఫోర్స్ గూర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ అమ్మకాల్లో మాత్రమే దాని ప్రత్యర్థులను మించిపోయింది. కాగా మహీంద్రా కొత్త ఆర్మడ కారును త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
కేవలం రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా మహీంద్రా థార్ అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా దీనిని వినియోగదారు తనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణాల వల్లనే మహీంద్రా యొక్క థార్ ఇప్పటికీ గొప్ప అమ్మకాలను పొందుతూనే ఉంది. కంపెనీ థార్ కారును 5 డోర్ రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

ఇప్పటికే పలుమార్లు మహీంద్రా థార్ 5-డోర్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు దేశీయ విఫణిలో అడుగుపెట్టడానికి మరెన్నో రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మారుతి సుజుకి తన జిమ్నీ కారును.. ఫోర్స్ కంపెనీ తన గుర్ఖా కారును 5-డోర్ రూపంలో విడుదల చేసింది. వీటికి గట్టి పోటీ ఇవ్వడానికి మహీంద్రా త్వరలోనే థార్ 5 డోర్ మోడల్ లాంచ్ చేయనుంది.
మహీంద్రా కంపెనీ 2024 ఫిబ్రవరి వరకు 71000 యూనిట్ల బుకింగ్స్ పొందినట్లు సమాచారం. అంటే కంపెనీ ఇంకా 71000 మందికి మహీంద్రా థార్ కార్లను డెలివరీ చేయాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారుకు 2024లో కూడా ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. థార్ వెయిటింగ్ పీరియడ్ ఇంకా 6 వారాలకంటే ఎక్కువని తెలుస్తోంది. అయితే కంపెనీ కూడా డెలివరీలను వేగవంతం చేయడానికి కృషి చేస్తోంది.

ఇక మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేయనున్న థార్ 5 డోర్ విషయానికి వస్తే. ఇది 3-డోర్ మోడల్ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. అయితే డిజైన్ దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్స్ మరియు పనితీరులో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ కారు యొక్క బుకింగ్స్ మరియు ధర వంటివి రానున్న రోజుల్లో వెల్లడవుతాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








