ఆఫ్‌రోడ్‌, ఆన్‌రోడ్‌లలో తిరుగులేని మహారాజా 'థార్ రాక్స్‌' ఎస్‌యూవీ రేపు మార్కెట్‌లోకి వచ్చేస్తుందోచ్‌!

మహీంద్రా నుంచి కొన్ని నెలలుగా ఆతృతగా ఎదురుచూస్తున్న మహీంద్రా థార్ రాక్స్‌ 5 డోర్ (Mahindra Thar Roxx 5 Door) ఎస్‌యూవీ రేపు (ఆగస్టు 15)న ఎట్టకేలకు విడుదల కానుంది. ఈ సరికొత్త ఎస్‌యూవీ భారీ ఫీచర్లు, హై టెక్నాలజీతో పాటు అధునాత ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా పనిచేయనుంది. ఈ మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ఎస్‌యూవీలో ఉపయోగించిన కొత్త ప్లాట్‌ఫామ్‌ మునుపటి కంటే 40 కిలోల బరువు తక్కువగా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా పిల్లర్ ప్రాంతాల్లో హై-స్ట్రెంత్ స్టీల్‌ని కలిగి ఉండనుంది.

మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ఎస్‌యూవీలో డబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ సెట్, వెనుక భాగంలో మల్టీ లింక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. రైడింగ్‌ క్వాలిటీని మరింత మెరుగుపరచడానికి ఈ మోడల్స్‌లో 'ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డంపింగ్' టెక్నాలజీ కూడా అందించారు. మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ఎస్‌యూవీ డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రతీ ఇంజిన్‌లో రెండు రకాల ఇంజిన్‌ ఆప్షన్స్‌ ఉండే అవకాశం ఉంది.

Mahindra-Thar-Roxx-Launching-Tomorrow

ఈ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌ 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి రావచ్చు. దీని డీజిల్ ఇంజిన్ 2.2-లీటర్, 4-సిలిండర్, టర్బోఛార్జ్డ్ యూనిట్‌తో రానుంది. ఈ వేరియంట్ సుమారుగా 150bhp పవర్ మరియు 350nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరోవైపు, హై-స్పెక్ వేరియంట్లు 172 bhp మరియు 370 NM టార్క్‌తో వస్తాయని భావిస్తున్నారు.

పెట్రోల్ ఇంజిన్ 2.0-లీటర్, టర్బోఛార్జ్డ్, 4-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేయనుంది. లోయర్-స్పెక్ మోడళ్లు 160 bhp మరియు 330 nm టార్క్‌ని విడుదల చేయనున్నాయి. అయితే హై-స్పెక్ మోడళ్లు 175 bhp మరియు 380 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ ఆప్షన్స్‌ దాదాపు ఖరారు అయినట్లే అయితే దీనిపై అధికారక ప్రకటన కోసం రేపటి వరకు ఆగాల్సిందే.

Mahindra-Thar-Roxx-Launching-Tomorrow

మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ఎస్‌యూవీ కొత్త 4 Xplore 4WD సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఇప్పటికే మహీంద్రా స్కార్పియో-N ఎస్‌యూవీలో ఉపయోగించబడింది. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ మరియు ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ వంటి ఫీచర్లతో వస్తుంది. అయితే మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్‌లో షిఫ్ట్-ఆన్-ఫ్లై (Shift-on-Fly) 4WD సిస్టమ్ లేదు. మహీంద్రా థార్ 3-డోర్ ఎస్‌యూవీ మాదిరిగానే లీవర్‌ని కలిగి ఉంటుంది.

థార్ రాక్స్‌లో రేషియే గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది. ఇతర గుర్తించదగిన ఫీచర్లలో క్రాల్ అసిస్ట్ సిస్టమ్ (Crawl Assist System) ఉంది. ఇది బురదలో లేదా చిత్తడి నేలల్లో చిక్కుకున్నప్పుడు ఉపయోగడనుంది. ఇది ఆన్ చేస్తే గంటకు 2.5 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ముందుకు కదులుతుంది. ఇక టర్నింగ్ రేడియస్ తగ్గించడానికి టర్న్ చేసేటప్పుడు లోపలి చక్రాలను లాక్ చేసే 'ఇంటెల్లి టర్న్ అసిస్ట్' ఫీచర్ కూడా ఉంది.

Mahindra-Thar-Roxx-Launching-Tomorrow

మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ఎస్‌యూవీలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో బిగ్‌ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, పనోరమిక్ సన్‌రూఫ్‌, 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, రిక్లైనింగ్ రియర్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా మరెన్నో స్మార్ట్‌ ఫీచర్లతో ఇది రేపు మార్కెట్‌లో అడుగుపెట్టనుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 14, 2024, 16:28 [IST]
English summary
Mahindra thar roxx 5 door launching tomorrow check expected specifications here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+