Mahindra Thar Roxx full Review video మహీంద్రా థార్ రాక్స్ 5 డోర్ ఎస్‌యూవీ మెప్పించిందా?
మార్కెట్‌లో అత్యుత్తమ ఆఫ్-రోడర్ ఏదైనా ఉందా ఉంటే అది మహీంద్రా థార్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకూ 3 డోర్స్‌తో అందుబాటులో ఉన్న ఈ ఎస్‌యూవీ ఇప్పుడు 5 డోర్ ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 3 డోర్ వేరియంట్స్‌లో వెనుక డోర్స్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. వాహనంలో వెనుకకు వెళ్లేందుకు ప్రతీసారి సీట్లు సర్దుబాటు చేయడం కష్టతరంగా ఉండేది. మహీంద్రా ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టింది. వెనక డోర్లను జోడిస్తూ మహీంద్రా థార్ 5-డోర్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ. 12.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో దీనిని పరిచయం చేసింది. ఈ సరికొత్త థార్ రాక్స్‌ను కొచ్చిన్‌లో మా డ్రైవ్‌స్పార్క్ టీమ్ టెస్ట్ డ్రైవ్ చేసింది. దీని ఫర్ఫామెన్స్, స్పెసిఫికేషన్లు ఇతర విషయాలు ఈ కథనంలో..
కొత్త థార్ రాక్స్ దాని ఐకానిక్ బాక్సీ ఆకారాన్ని కలిగి ఉంది. దీని LED హెడ్‌లైట్‌లు, C-ఆకారపు DRLలు మరియు LED ఫాగ్‌లైట్స్ ఉంటాయి. బాడీ కలర్‌లో పెయింట్‌తో ఫ్రంట్ గ్రిల్ అక్కడే 360-డిగ్రీల ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఉంది. ఇందులో 60:40 స్ప్లిట్ సీట్ సర్దుబాటు చేసుకోవచ్చు. ఇందులో 644-లీటర్ బూట్ స్పేస్ కలదు. ఇంటీరియర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. అయితే ఇది టాప్ వేరియంట్‌లలో మాత్రమే లభిస్తుంది.
ఇంజిన్: థార్ రాక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్‌తో వస్తుంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. బేస్-స్పెక్ పెట్రోల్ వేరియంట్ 160hp, 330Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హై-స్పెక్ 177hp, 380Nm టార్క్‌ను అందిస్తాయి. డీజిల్ వేరియంట్ బేస్ 150hp, 330Nm టార్క్, టాప్ స్పెక్ 175hp 370Nm వరకు ఉంటాయి.
సేఫ్టీ ఫీచర్లు: సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్స్, ESC, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, TPMS వంటి ఇతర ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో లెవల్ 2 ADAS ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. మంచి డ్రైవింగ్ అనుభవం, అధునాతన ఫీచర్లు చూస్తున్నట్లైతే మహీంద్రా థార్ రాక్స్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications








