మహీంద్రా థార్ రాక్స్ 5- డోర్ ఎస్‌యూవీ వచ్చేసింది.. ధర రూ. 12.99 లక్షలు, మైమరపించే ఫీచర్లు!
మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ఎస్‌యూవీ (Mahindra Thar Roxx) కేవలం రూ .12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల అయ్యింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ 5-డోర్ ఎస్‌యూవీ పెట్రోల్ వేరియంట్‌ని కేవలం రూ.12.99 లక్షల వద్ద విడుదల చేసి ఆశ్చర్యపరిచింది. ఇక డీజిల్ వేరియంట్ ధరలు రూ .13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
ప్రస్తుతానికి మహీంద్రా బేస్-వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. హై-స్పెక్ వేరియంట్లకు సంబంధించిన వివరాలు ధరలు రేపు అనగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వెల్లడించనున్నారు. ఇక బేస్ వేరియంట్ పేరుని 'MX 1'ని 'బేస్, బట్ నాట్ బేసిక్' (Base But not Basic) అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసింది. ఈ సరికొత్త 5-డోర్ థార్ ఎస్‌యూవీ బేస్ 'MX 1' వేరియంట్‌లో భారీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్లలో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్, 18-అంగుళాల స్టీల్ వీల్స్, డ్యూయల్-టోన్‌మెటల్ టాప్, రియర్ ఏసీ వెంట్స్, USB-C పోర్ట్స్, 60:40 స్ప్లిట్ సీట్లు, సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ తో కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇప్పటికే పలు టీజర్లలో ఈ థార్ రాక్స్‌కి సంబంధించిన విజువల్స్ ఎంతగానో ఆకర్షించాయి. అదే రేంజ్‌లో మహీంద్రా థార్ లుక్‌లో అదరగొట్టింది. ఈ పొడవైన థార్ ఐకానిక్ బాక్సీ థార్ సిల్హౌట్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూవీలో ముందు భాగంలోని సీ-ఆకారంలో ఉన్న హెడ్ లైట్లు LED DRLs, కొత్త బాడీ కలర్ 6-స్లాట్ గ్రిల్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఫ్రంట్ బంపర్‌లో కొన్ని సిల్వర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

ఇంటీరియర్‌లో థార్ బ్లాక్ అండ్ బీజ్ థీమ్‌ని కలిగి ఉంటుంది. ఇందులోని సీట్లు వైట్ లెదర్లెట్ అప్‌హోల్‌స్టరీలో కవర్ చేయబడతాయి. డ్యాష్‌బోర్డ్ బ్లాక్ లెదర్ ప్యాడింగ్‌తో చుట్టి ఉంటుంది. ముందు కూర్చునే ప్యాసింజర్లకు ఇండిపెండెంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లు అందించారు. సీటింగ్ రెండవ వరుసలో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఫోల్డౌట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్, ప్రయాణీకులందరికీ సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి.
పెట్రోల్‌తో నడిచే మహీంద్రా థార్ రాక్స్ MX1 1 160 bhp మరియు 330 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, థార్ రాక్స్ MX1 డీజిల్ వేరియంట్ 150 bhp మరియు అదే 330nm గరిష్ట అవుట్‌పుట్‌ని విడడదల చేయనుంది. వీటి ట్రాన్స్‌మిషన్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ బేస్ మోడల్స్‌లో 4WD సిస్టమ్ లభించకపోచ్చు. టాప్ ఎండ్ వేరియంట్‌లో దీనిని అందించవచ్చు.

ప్రత్యర్థులు: మహీంద్రా థార్ రాక్స్ ప్రారంభ ధర రూ .12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. త్వరలోనే వేరియంట్ల వారీగా వీటి ధరలను వెల్లడించనున్నారు. ఈ రేంజ్ ధరల్లో మారుతి జిమ్నీకి, 5-డోర్ ఫోర్స్ గూర్ఖాకు ఇది నేరుగా పోటీగా ఉంటుంది. అయితే వీటితో పోల్చుకుంటే మహీంద్రా థార్ ది బెస్ట్‌గా ఉంటుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








