మహీంద్రా థార్ రాక్స్ 5 డోర్ లాంచ్.. వేరియంట్ల వారీగా ధరలు, ఫీచర్ల వివరాలు చెక్ చేశారా?
మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ఎస్‌యూవీని (Mahindra Thar ROXX 5-Door SUV) అధికారికంగా విడుదల అయ్యింది. విడుదలకు ఒక రోజు ముందే బేస్ వేరియంట్‌ని విడుదల చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీలలో ఇది ఒకటిగా ఉంది. నేడు ఆగస్టు 15న 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మిగతా వేరియంట్లు, వాటి పూర్తి ఫీచర్లను వెల్లడించింది.
బేస్ వేరియంట్‌ని కేవలం రూ .12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకువచ్చి ఆశ్చర్యపరిచింది. మహీంద్రా థార్ రాక్స్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ .12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ .13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇక మహీంద్రా థార్ రాక్స్ బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఎస్‌యూవీ డెలివరీలు పండుగ సీజన్‌లో ప్రారంభమవుతాయి. థార్ రాక్స్ కోసం టెస్ట్ డ్రైవ్స్ సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. థార్ రాక్స్ వేరియంట్ల వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు, ఫీచర్ల వివరాలు మీకోసం ఇక్కడ అందిస్తుంది.
మహీంద్రా థార్ రాక్స్ MX1: ఇది థార్ 5 డోర్‌లో బేస్ వేరియంట్‌గా ఉంది. బేస్ వేరియంట్ అయినప్పటికీ ఇందులోనూ మంచి ఫీచర్లను అందించారు. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. 18 ఇంచెస్ స్టీల్ వీల్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ స్టీరింగ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ చేయడానికి పుష్ బటన్, రియర్ ఏసీ వెంట్స్, USB-సీ పోర్ట్ ఉన్నాయి.

టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 60:40 స్ప్లిట్ సీట్లను కూడా అందిస్తోంది. సేఫ్టీ కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ప్రయాణీకులందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. దీని పెట్రోల్ వేరియంట్ ధర రూ. 12.99 లక్షలు, డీజీల్ వేరియంట్ ధర రూ. 13.99 లక్షలుగా ఉంది. ఈ రెండు మ్యాన్‌వల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తాయి.
మహీంద్రా థార్ రాక్స్ MX3: ఈ వేరియంట్‌లో ఆర్మ్‌రెట్ విత్ కప్ హోల్డర్స్, డ్రైవింగ్ మోడ్స్, టెరైన్ మోడ్స్, అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. అంతే కాకుండా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ IRVM, వైర్లెస్ ఛార్జర్ మరియు వన్-టచ్ పవర్ విండో కూడా ఉన్నాయి.

సేఫ్టీ కోసం ఈ వేరియంట్లో ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు పెట్రోల్ AT వేరియంట్లో 4 డిస్క్ బ్రేకులు ఉన్నాయి. దీని పెట్రోల్ వేరియంట్ ధర రూ.14.99 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలుగా ఉంది. ఇది కూడా కేవలం మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తోనే వస్తుంది.
మహీంద్రా థార్ రాక్స్ MX5: ఈ వేరియంట్లో సింగిల్ పేన్ సన్‌రూఫ్, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, LED ఫాగ్ ల్యాంప్స్, DRLs, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అకౌస్టిక్ విండ్ షీల్డ్, లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్ మరియు సీట్లు కూడా మీకు లభిస్తాయి.

ఇందులో సేఫ్టీ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు వైపర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ వేరియంట్ నుంచి 5 మహీంద్రా థార్ రాక్స్ 4×4 వేరియంట్లను కూడా అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.16.99 లక్షలుగా ఉంది.
మహీంద్రా థార్ రాక్స్ AX3L: ఇందులోని ఫీచర్లు MX3 వేరియంట్ మాదిరిగానే ఉంటుంది. ADAS, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డీటీఎస్ సౌండ్ స్టేజింగ్, 26.03 సెంటీమీటర్ల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం డీజిల్ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. దీన ధర రూ.16.99 లక్షలుగా ఉంది.

మహీంద్రా థార్ రాక్స్ AX5L: ఇందులో 26.03 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బిల్ట్ ఇన్ అలెక్సా, అడ్రినోఎక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో కూడిన డిజిటల్ క్లస్టర్‌తో AX5L రానుంది. పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డీటీఎస్ సౌండ్ స్టేజింగ్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వైర్‌లెస్ కనెక్టివిటీ, సేఫ్టీ కోసం ADAS ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 18.99 లక్షలుగా ఉంది.
మహీంద్రా థార్ రాక్స్ AX7L: ఈ టాప్ ఎండ్ వేరియంట్ పనోరమిక్ సన్‌రూఫ్, 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, లెథరెట్ చుట్టిన స్టీరింగ్ వీల్, సీట్లు ఇందులో ఉండనున్నాయి. అలాగే సర్దుబాటు చేయగల ఎలక్ట్రిక్ ఫ్రంట్-వెంటిలేటెడ్ సీట్లు, ఫ్రంట్ కెమెరా మరియు కూల్డ్ గ్లోవ్ బాక్స్ కూడా ఉంటాయి. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్‌తో కూడిన 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా ఉన్నాయి.

అంతే కాకుండా సబ్ వూఫర్‌తో కూడిన హార్మోన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, పవర్ ఫోల్డింగ్ ORVM, 65వాట్ USB ఛార్జర్ కూడా ఇందులో ఉండనున్నాయి. దీని ధర రూ. 18.99 లక్షలుగా ఉంది. థార్ రాక్స్ బేసిక్ వేరియంట్ 3 డోర్స్ థార్ వెర్షన్ కంటే రూ .1.64 లక్షలు ఎక్కువగా ఉంటుంది. ఈ సరికొత్త ఆన్‌రోడ్, ఆఫ్‌రోడర్ కొత్త రూపంలో మార్కెట్‌లో విడుదల కావడంతో థార్ అభిమానులు మురిసిపోతున్నారు.


Click it and Unblock the Notifications








