సేఫ్టీలో కొత్త రాక్ స్టార్.. ఏకంగా 5-రేటింగ్ కొట్టేసిన థార్ రాక్స్‌.. భయానికి ఎండ్ కార్డ్..

ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా ప్రయాణికుల భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది చాలా ఘటనల్లో నిరూపితం అయింది. ఈ కంపెనీ వాహనాలు క్రాష్ టెస్టింగ్‌లో కూడా మంచి ఫెర్ఫామెన్స్‌ను చూపించాయి. ఇదిలా ఉంటే తాజాగా మహీంద్రా ఫేమస్ మోడల్ ఎస్‌యూవీ థార్ రాక్స్(thar roxx) భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP) క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ మైలురాయితో ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో ఇన్ని స్టార్లు పొందిన ఫస్ట్ బాడీ-ఆన్-ఫ్రేమ్ SUVగా థార్ రాక్స్ నిలిచింది. భారత్‌లో థార్ మోడల్ అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో మొదటి స్థానంలో ఉంది. దీని ఆకట్టుకునే డిజైన్, ఫెర్ఫామెన్స్‌తో ప్రతి నెలా అమ్మకాలను పెంచుకుంటుంది.

ఇప్పుడు ప్రయాణికుల భద్రతకు సంబంధించి అత్యుత్తమైన రేటింగ్ సాధించడంతో రానున్న రోజుల్లో దీనికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. తన థార్ రాక్స్ సేఫ్టీలో 5 స్టార్ పొందడంపై కంపెనీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమ వాహనాల్లో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, థార్ రాక్స్ సాధించిన సేఫ్టీ రేటింగ్ దీనికి నిదర్శనమని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మహీంద్రా విలువ పరంగా ఎస్‌యూవీ తయారీదారుల్లో అగ్రస్థానంలో ఉంది.

Mahindra Thar Roxx 5 Star Safety Rating In Bharat Ncap Crash Test

ప్రమాద సమయంలో మహీంద్రా థార్ రాక్స్‌లో ప్రయాణిస్తున్న వారికి రక్షణ ఎలా ఉంటుందని భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ క్రింద నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో పెద్దల రక్షణకు(AOP) సంబంధించి థార్ రాక్స్ మొత్తం 32 పాయింట్లకు గానూ 31.09 పాయింట్లు సాధించింది. అలాగే, పిల్లల రక్షణకు సంబంధించి క్రాష్ టెస్ట్‌లో 49 కు 45 పాయింట్లు సాధించింది. భారత్ NCAPలో ఐసీఈ ఇంజిన్‌లో ఇదే అత్యధిక స్కోర్‌గా ఉంది.

ముందు భాగంలో పెద్దల రక్షణ కోసం నిర్వహించిన ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో థార్ రాక్స్‌ 16కి 15.09 స్కోర్‌ను సాధించింది. అదే సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లకు 16 స్కోర్ సాధించినట్లు భారత్ ఎన్‌సీఎపీ పేర్కొంది. ప్రధానంగా క్రాష్ టెస్ట్‌లో డ్రైవర్ ఛాతీకి, కింది కాళ్లకు రక్షణ ఉండటమే కాకుండా, ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న వారికి సేఫ్టీ బాగా ఉందని వెల్లడైంది.

Thar Roxx Gets 5 Star Safety Rating

మహీంద్రా థార్ రాక్స్‌‌లో ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. లోపల కూర్చున్న వారి కోసం 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లను రోక్స్‌లో అందించారు. ఇంకా సీట్‌బెల్ట్ రిమైండర్ (SBR), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ వ్యూ మానిటర్‌, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB),లెవల్ 2 ADAS ఫీచర్లు వంటివి ఉన్నాయి.

అదనంగా బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ (BLD), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఫీచర్లు మరింత భద్రతను అందిస్తాయి. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో థార్ రాక్స్ ప్రధానంగా ఉంది. మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కస్టమర్ల నుంచి భారీ బుకింగ్స్‌ను సాధించింది. ఇది పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం రూ.12.99 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి టాప్ వేరియంట్ రూ. 22.49 లక్షల వరకు ఉంది.

Thar Roxx Gets 5 Star Safety Rating In Bharat Ncap

థార్ రాక్స్‌‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. దీంతో కస్టమర్లకు డెలివరీ కూడా ఆలస్యం అవుతుంది. కంపెనీ తాజాగా వెల్లడించిన దాని ప్రకారం, అక్టోబర్ నాటికి ఈ ఎస్‌యూవీకి దాదాపు 18 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంటే ఈ థార్ రాక్స్‌ను బుక్ చేసుకున్న వాళ్లు తమ చేతుల్లోకి తీసుకోవడానికి 2026 వరకు ఆగాల్సిందే. డిమాండ్ దృష్ట్యా ఉత్పత్తిని పెంచి సరఫరాను మెరుగుపరచడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 14, 2024, 15:16 [IST]
English summary
Mahindra thar roxx gets 5 star safety rating in bharat ncap here the full details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+