మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. సింగిల్ ఛార్జ్‌తో 150 కిమీ రేంజ్ - ధర కూడా తక్కువే!
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా మరో ఎలక్ట్రిక్ ఆటో దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
దేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కంపెనీ MLMML (మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్) ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో ట్రియో ప్లస్ ఈ-ఆటో (Mahindra Treo Plus Electric Rickshaw) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఆటో ధర రూ. 3.58 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేట్ పొంది ఉండటం ఇక్కడ గమనించవచ్చు.

కస్టమర్ల నుంచి పొందిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా.. మహీంద్రా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఆటో లాంచ్ చేసింది. ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఎలక్ట్రిక్ ఆటో ఇప్పుడు మెటల్ బాడీ కలిగి ఉంది. వాహన వినియోగదారులు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మహీంద్రా కంపెనీ ఈ ఆటో లాంచ్ చేసింది. ఈ ఆటోను కొనుగోలుదారులకు మరింత చేరువ చేయడానికి లోన్ మరియు మంచి ఫైనాన్సింగ్ ఎంపికలను కంపెనీ అందిస్తోంది.
నిజానికి 2018లో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ చేసినప్పటి నుంచి సుమారు 50000 యూనిట్ల ట్రియోస్ అమ్ముడయ్యాయి. ఈ వాహనాలు ఏకంగా 1.10 బిలియన్ కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుని వాతావరణంలో 18500 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ (CO2) ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడ్డాయి. ఎలక్ట్రిక్ ఆటో విభాగంలో మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ భారతదేశంలో 52 శాతం మార్కెట్ వాటితో అగ్రస్థానంలో నిలిచింది.

మహీంద్రా కంపెనీ తన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించడం మాత్రమే కాకుండా.. అత్యుత్తమ ఆఫ్టర్ సేల్స్ మద్దతును కూడా అందిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో అతిపెద్ద సర్వీస్ నెట్‌వర్క్‌ను అందించడానికి సన్నద్ధమవుతోంది. మెటల్ బాడీ ట్రియో ప్లస్ 5 సంవత్సరాలు / 120000 కిమీ వారంటీని పొందుతుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
కొత్త మహీంద్రా ట్రియో ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో 10.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 42 టార్క్‌తో పాటు 8kW పవర్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 167 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI చేత ధృవీకరించబడింది. కానీ వాస్తవ ప్రపంచంలో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రిక్ ఆటో రేంజ్ 150 కిమీ కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

మహీంద్రా ట్రియో ప్లస్ ఎలక్ట్రిక్ ఆటో 1073 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ యొక్క UDAY ప్రోగ్రామ్ కింద ఈ ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసే కస్టమర్లు మొదటి సంవత్సరానికి రూ.10 లక్షల ప్రమాద భీమా కవరేజ్ పొందుతారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








