మహీంద్రా బొలెరో MaXX Pik-up సిరీస్ కొత్త వేరియంట్లు ఆవిష్కరణ.. ఏసీ, అధిక పైలోడ్, హై సేఫ్టీ ఫీచర్లు
భారత మార్కెట్లో చిన్న వాణిజ్య వాహనాల (SCVలు) సెగ్మెంట్‌లో మహీంద్రా(Mahindra Bolero) తన బొలెరో MaXX పిక్-అప్ శ్రేణి యొక్క కొత్త వేరియంట్‌లను తాజాగా ఆవిష్కరించింది. బొలెరో మునుపటి మోడల్‌తో పోలిస్తే.. దాని పేలోడ్ సామర్థ్యం, మైలేజ్ ఇంకా సీఫ్టీ ఫీచర్ల పరంగా గణనీయంగా మెరుగుపడ్డాయని మహీంద్రా వెల్లడించింది.
మహీంద్రా ఆవిష్కరించిన బొలెరో MaXX పిక్-అప్ సిరీస్ డీజిల్ మరియు CNG ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. ఇది మహీంద్రా యొక్క అధునాతన m2Di ఇంజిన్‌తో పనిచేస్తుంది. Bolero MaXX Pik-up శ్రేణి 52.2kW మోటార్‌తో 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

59.7kW మోటార్‌తో 220 Nm గరిష్ఠ టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. దీని పేలోడ్ సామర్థ్యం 1.3 టన్నుల నుంచి 2 టన్నుల వరకు ఉంది. కొత్త మహీంద్రా బొలెరో MaXX పికప్ సిరీస్‌లో కార్గో పొడవు.. 3050 mm వరకు ఉండటంతో ఎక్కువ సరుకును మోసుకెళ్లగలదు.
Bolero MaXX Pik-up సిరీస్‌లో CMVR-సర్టిఫైడ్ D+2 సీట్లు, ఎత్తు అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, ఇండికేటర్-సేఫ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన ఇంటీరియర్‌ను కలిగి ఉండటంతో సౌకర్యంగా ఉంటుంది. హీటర్ మరియు డెమిస్టర్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కండిషనింగ్ డ్రైవర్లకు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని సంస్థ వెల్లడించింది.
కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ సిరీస్‌లో ఏసీని అందించడం వల్ల.. సిటీ ట్రాఫిక్ లేదా హైవేల్లో హాయిగా ప్రయాణించవచ్చని మహీంద్రా పేర్కొంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా iMAXX ఫీచర్ ద్వారా 14 అధునాతన ఫీచర్లను తీసుకువచ్చింది. టార్గెటెడ్ అవుట్‌రీచ్ కోసం జియోఫెన్స్ బేస్‌డ్ ప్రచారాలు మరియు స్ట్రీమ్‌లైన్డ్ ఆపరేషన్‌ల కోసం డ్రైవర్ కమ్ ఓనర్ ఫీచర్‌ను ఇది కలిగి ఉంది.
Bolero MaXX Pik-up లో ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లు, వార్నింగ్ సిస్టమ్ ద్వారా వాహన భద్రత మరియు సామర్థ్యం రెండింటినీ నిర్వహిస్తాయి, ఇందులో దూకుడు యాక్సిలరేషన్, సడెన్ బ్రేకింగ్ మరియు ఫ్యూయెల్ అయిపోవడం లాంటి వాటిని గుర్తించేలా వార్నింగ్ సెన్సార్‌లు పనిచేస్తాయి. ఈ ఫీచర్ల ద్వారా వాహన భద్రతను పెంచడమే కాకుండా మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గడం, మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కూడా దోహదపడతాయని మహీంద్రా వివరించింది.
కాగా మార్కెట్లో iMAXX ఫీచర్ గణనీయమైన ప్రభావాన్ని చూపడంతో.. 30,000 పైగా iMAXX వాహనాలు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. ఫాస్టాగ్ ఇంటిగ్రేషన్ మరియు కాస్ట్ మేనేజ్‌మెంట్ వంటి నిరంతర అప్‌డేట్‌ల ద్వారా ఈ యాప్‌ను దీర్ఘ-కాలం ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా వినియోగించవచ్చు, ఫ్లీట్ మేనేజ్‌మెంట్‌కు అవసరమైన సాధనంగా ఇది మరింతగా పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది.
మహీంద్రా బొలెరో అసాధారణమైన పనితీరు మరియు బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందిందని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ నళినీకాంత్ గొల్లగుంట వెల్లడించారు. Bolero MaXX పిక్-అప్ శ్రేణికి మార్కెట్లో మంచి ఆదరణ ఉందని.. తాజాగా ఆవిష్కరించిన వేరియంట్లలో ACని జోడించడం ద్వారా కస్టమర్ల సౌకర్యం మరియు సౌలభ్యం మరింత మెరుగుపడతాయని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా మార్కెట్లో ఇప్పటివరకు 1.4 లక్షల బొలెరో మ్యాక్స్‌ఎక్స్ పికప్ ట్రక్కులను సంస్థ విక్రయించింది. అదనంగా, మహీంద్రా ఒక రోజులో అత్యధిక యూనిట్లను డెలివరీ చేయడం ద్వారా కమర్షియల్ లోడ్ విభాగంలో కొత్త ప్రమాణాన్ని సెట్ చేసిందని వివరించారు. తద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గణనీయమైన గుర్తింపును సంపాదించిందని నళినీకాంత్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications








