టెస్టింగ్‌లో కనిపించిన మహీంద్రా బాహుబలి కారు.. విడుదల ఎప్పుడంటే?

మహీంద్రా కార్లకు మార్కెట్‌లో డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. అందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితమే ఈ కంపెనీకి చెందిన కార్లు మార్కెట్‌లో సత్తా చాటుతున్నాయి. దేశంలో ఈ కంపెనీకి చెందిన కార్లు అమ్మకాల్లో 3వ స్థానంలోకి ఎగబాకింది. టాటా మోటార్స్‌ని అధిగమించి ఈ స్థానాన్ని ఆక్రమించింది.

ఇక మహీంద్రా కొత్తగా తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌పోలియోను విస్తరించడంలో బిజీగా ఉంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మాత్రమే విక్రయిస్తోంది. ఇక ఇటీవల రెండు కార్లను కొత్త కార్లను సైతం విడుదల చేసింది. మహీంద్రా 2025 లో టాటా మోటార్స్ ఆధిపత్యాన్ని బ్రేక్‌ వేయనుంది.

mahindra XEV 7e Spotted Testing

ఈ కొత్త తరం INGO ప్లాట్ఫామ్ ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేస్తోంది. వీటి డిజైన్, పనితీరు పరంగా ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. తాజాగా మహీంద్రా తీసుకువచ్చిన BE6E, XEV9Eలు కూడా ఇదే విధంగా తీసుకువచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్‌గా మారాయి. మార్కెట్‌లో ఇప్పటికే ఆదరణ కలిగి ఉన్న కార్లులో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 టాప్‌లో ఉంది.

ఈ ఎక్స్‌యూవీ700 (Mahindra XUV 700) మహీంద్రా ప్రస్తుత ఫ్లాగ్ షిప్ ఎస్‌యూవీగా ఉంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌ఈవీ7E ని విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కొన్ని వారాల క్రితం XEV7E (Mahindra XEV 7E) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ట్రేడ్‌మార్క్‌ ఫొటోలు కూడా లీకయ్యాయి. అయితే తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన టెస్టు డ్రైవ్‌ చేస్తుండగా కెమెరాకు చిక్కింది.

mahindra XEV 7e Spotted Testing

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్పై కెమెరాకు చిక్కింది. డిజైన్ ముందు భాగంలో బంపర్ చివర్లో కోణీయా LED హెడ్‌ల్యాంప్స్ కనిపిస్తాయి. ఈ కారుకు ఇరువైపులా షార్ప్‌ LED DRLs తో ఫ్రంట్ బంపర్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ కారు సైడ్ వ్యూ ఎక్స్‌యూవీ 700ని పోలి ఉంటుంది. వెనుకవైపు LED టెయిల్ ల్యాంప్స్, షార్క్ ఫిన్ యాంటెనా, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, సాలిడ్ బంపర్ కలవు.

ఈ 3 వరుసల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో భారీ ట్రిపుల్ డిస్ ప్లే ఉంటుందని కొన్ని వారాల క్రితం లీకైన చిత్రాల్లో వెల్లడయ్యాయి. ఈ XEV 9E ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇదే యూనిట్‌తో అందిస్తున్నారు. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, ప్యాసింజర్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. ఇందులో అల్ట్రా హైఎండ్ లగ్జరీ ఫీచర్ ఉంటుంది. మొత్తం క్యాబిన్‌లో ప్రీమియం అనుభూతిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

mahindra XEV 7e Spotted Testing

ఇందులో మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు కూడా కలవు. ఇవే కాకుండా అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లెండెడ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్‌, ఆటోహీమ్ బీమ్, కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్ వంటి ఫీచర్లతో లెవల్ 2 ఎడిఎఎస్ సూట్‌ ఉన్నాయి.

ఇది డ్యూయల్-మోటార్ AWD కాన్ఫిగరేషన్లలో రానుంది. ఈ ఈవీలో 59 కిలోవాట్ల, 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్స్ ఉండనున్నాయి. ఇందులోని చిన్న బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్‌పై 542 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్ (MIDC) పై 656 కిలోమీటర్ల రేంజ్‌ని ఇవ్వనుంది. దీని లాంచ్ సమీపిస్తున్న కొద్దీ మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

జనవరిలో జరిగే 2025 ఆటో ఎక్స్ పోలో ఈ ఈవీని ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా సఫారీ ఈవీకి పోటీగా ఉంటుంది. ఈ కారు ధర రూ.21 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే నెలలో ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను మహీంద్రా అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, December 27, 2024, 16:49 [IST]
English summary
Mahindra xev 7e electric suv spotted in testing check details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+