మహీంద్రా నుంచి మరపురాని ఎలక్ట్రిక్ కార్లు విడుదల.. కేవలం 20 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 500 కి.మీ ప్రయాణం!
మహీంద్రా సరికొత్త ఎక్స్‌ఈవీ 9ఇ (Mahindra XEV 9e), బీఈ 6ఇ (BE 6e) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్ చేసింది. వీటి రాక కోసం ఆటోమోబైల్ ఔత్సాహికిలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఎట్టకేలకు నేడు లాంచ్ చేశారు. ఇందులో మహీంద్రా ఎక్స్‌ఈవీ ధర ప్రారంభ ధర రూ .21.90 లక్షలు, (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే BE 6e ప్రారంభ ధర రూ. 18.90 లక్షలుగా మహీంద్రా నిర్ణయించింది. ఈ రెండు కార్లు సరికొత్త టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లో విడుదల చేసింది. అందరూ ఊహించిన విధంగానే వీటి ధరలు రూ. 20 లక్షల ధర వద్ద తీసుకువచ్చారు. ఈ సరికొత్త ఈవీలకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
పవర్‌ట్రైన్: ముందుగా మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఇది 288 bhp వద్ద 380 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీని 175 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి 20 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఫాస్ట్ ఛార్జ్ చేయవచ్చు. సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు 500 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది.

ఇక మహీంద్రా BE 6e 59 కిలోవాట్ లేదా 79 కిలోవాట్ల LFP బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. మహీంద్రా BE 6e కేవలం 6.7 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. XEV 9e 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.8 సెకన్లలో రీచ్ అవుతుంది. ఈ కార్లలో వచ్చే బ్యాటరీ ప్యాక్‌పై లైఫ్‌టైమ్ వారంటీని కంపెనీ అందిస్తోంది.
అయితే ఇది ప్రైవేట్ రిజిస్ట్రేషన్, కారు మొదటి యజమానికి మాత్రమే వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. రెండో వ్యక్తి లేదా పార్టీకి మారినప్పుడు 10 సంవత్సరాలు లేదా 200,000 కిలోమీటర్ల వరకు వారంటీ చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఈ మహీంద్రా కార్లు INGLO ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి పనిచేస్తాయి. దీనిని ఫోక్స్‌వ్యాగన్‌తో కలిసి మహీంద్రా డెవలప్ చేసింది.

డైమెన్షన్స్: కొలతల పరంగా XEV 9e 4,789 మిమీ పొడవు, 207 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 663 లీటర్ల భారీ బూట్ స్పేస్, 150 లీటర్ల ఫ్రంక్ (కారు ముందు) స్పేస్ కలదు. ఇక BE 6e 4,371 మిమీ పొడవు, 207 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 455 లీటర్ల బూట్ స్పేస్, 45 లీటర్లు ఫ్రంక్ స్పేస్‌తో వస్తుంది.
ఫీచర్లు: మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ, బీఈ 6ఇ రెండు కార్లలో అధునాతన ఫీచర్లు కలవు. లేయర్డ్ డ్యాష్ బోర్డ్ పైభాగంలో మూడు స్క్రీన్లు కలవు. ఈ కార్లలో మహీంద్రా కొత్తగా MAIA AIని అందిస్తుంది. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఢిఫరెంట్ మోడ్స్‌తో వైర్‌లెస్ కనెక్టివిటీ, OTA అప్‌డేట్స్‌కి అనుమతిస్తుంది. ఇక ఇందులో రేంజ్, ఎవ్రీడే, రేస్ అనే మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి.

వీటితో పాటు ఆటో పార్కింగ్ అసిస్ట్, 5 కెమెరాలతో కూడిన సెక్యూరిటీ సిస్టమ్, లెవల్ 2 ADAS, 7 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీస్ వంటి మరెన్నో కెమెరా వంటి మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కార్లు కచ్చితంగా 5 స్టార్ రేటింగ్‌ని సాధిస్తాయని మహీంద్రా ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ కార్ల డెలివరీలు 2025 మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








