కొత్త కారు కొంటున్నారా..? అయితే ఒకసారి ఈ కారును చూడండి.. ఇది వేరే లెవల్.. మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది!

ఇండియాలో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇతర కంపెనీల కంటే ఈవీ విభాగంలో ముందు స్థానాన్ని పొందడానికి కొద్ది నెలల క్రితం ఈవీ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించగా తాజాగా ఇప్పుడు రెండు కొత్త ఈవీలను విడుదల చేసి సంచలనానికి తెర లేపింది. మహీంద్రా నుంచి తాజాగా వచ్చిన ఎక్స్‌ఈవీ 9ఇ (XEV 9e), బీఈ 6ఇ (BE 6e) మోడళ్లతో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఎదురుకానుంది. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే కూడా ఈవీలకు డిమాండ్ ఉన్న కాలంలో మహీంద్రా కొత్త మోడళ్లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రధానంగా ఎక్స్‌ఈవీ 9ఇ (XEV 9e)మోడల్ గురించి మాట్లాడుకుంటే దీన్ని XUV700 ఆధారంగా రూపొందించారు. చూడటానికి చాలా స్టైలీష్‌గా కనిపిస్తుంది. లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఉండే అన్ని రకాల ఫీచర్లను ఈ కారులో అందించారు.

మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ రెండు వేరు వేరు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. మొదటిది 59 కిలోవాట్ అవర్, రెండోది 79 కిలోవాట్ అవర్. రెండో బ్యాటరీని పూర్తి ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు 656 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇది ఎలక్ట్రిక్ కారు కావడంతో రేంజ్ కారులో ఉన్న ప్రయాణికుల ఆధారంగా వస్తుంది. ఎక్కువ మంది కూర్చున్నప్పుడు రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది.

Mahindra xev 9e Battery Range Price and All Top Things Check Here

ఇద్దరు ప్రయాణికులకు మాత్రం ఎక్కువ రేంజ్ వస్తుంది. కారు నుంచి ప్రధానంగా 285 PS శక్తి ఉత్పత్తి అవుతుంది. స్టార్ట్ చేసిన 6.8 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. కారు బ్యాటరీలో మంటలు రాకుండా ఉండటానికి ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీని ప్రత్యేకంగా అమర్చారు. ప్రస్తుతం లిథియం-అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగిన ఘటనలు చాలా జరిగాయి. దీంతో మహీంద్రా తన బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోడానికి ఈ బ్యాటరీని అమర్చింది.

ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్రధానంగా ఎక్కువ కాలం లైఫ్ వస్తుంది. ప్రమాదాల బారీన పడటం అతి తక్కువగా ఉంటుంది, దీంతో కంపెనీ దీన్ని ఎంచుకుంది. ఈ బ్యాటరీని 175 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి 20 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ చేయవచ్చు. ఛార్జింగ్ సమస్య కూడా చాలా వరకు తీరినట్లయింది. ఛార్జింగ్ టైం తగ్గడంతో వెయిటింగ్ టైం మిగిలింది.

Mahindra xev 9e Battery Range Price and All Top Things Check Here

ఎక్స్‌ఈవీ 9ఇ ఎక్స్‌టీరియర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారుతో రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు కూడా దీనిపైనే ఉంటుంది. కారు ముందు భాగంలో అమర్చిన గ్రిల్‌ పూర్తి మూసినట్లుగా ఉంటుంది. ఫ్రంట్ మొత్తం కూడా LED స్ట్రిప్‌తో తయారు చేశారు. హెడ్‌లైట్ సెటప్‌లు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీని డిజైన్ స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది. అల్లాయ్ వీల్స్ కార్ అందాన్ని మరింత పెంచాయి.

ఈ కారు క్యాబిన్ చాలా అందంగా ఉంటుంది. సీట్లు కూడా ప్రయాణికులకు కంఫర్ట్‌గా ఉంటాయి. లోపల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ కనెక్టివిటీ, లేయర్డ్ డ్యాష్ బోర్డ్ పైభాగంలో మూడు డిస్‌ప్లేలు, ఆటో పార్కింగ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఈ కారు లోపల మాయ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రత్యేకంగా అందించారు. బ్లూటూత్, వై-ఫై, 60కు పైగా ఇతర యాప్‌లు , ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి.

Mahindra xev 9e Battery Range Price and All Top Things Check Here

ప్రధానంగా మహీంద్రా తన కారులో ప్రయాణికుల భద్రతకు సంబంధించి డ్రైవర్ నిద్రపోతున్నప్పుడు లేదా అలసటగా ఉన్న సమయంలో అతని కదలికలను గుర్తించి హెచ్చరిస్తుంది. ప్యాసింజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. చుట్టు ప్రక్కల చూడటానికి 360 డిగ్రీల కెమెరాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కారులో ఆటో పార్కింగ్ సిస్టమ్‌‌ను కూడా ఇచ్చారు. దీన్ని ఆన్ చేస్తే పార్కింగ్ ఏరియా కరెక్ట్‌గా చూపిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 28, 2024, 9:30 [IST]
English summary
Mahindra xev 9e battery range price and all top things check here
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+