మహీంద్రా కొత్త కారుని ధైర్యంగా కొనేయండి.. సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ గ్యారంటీ.. ఈ వీడియోలో ఫుల్‌ క్లారిటీ!

మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ (Mahindra XEV 9e) ఎస్‌యూవీ నవంబర్‌ 26న మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ కారుని మహీంద్రా ఇటీవలె చెన్నైలోని తమ ఫెసిలిటీ సెంటర్‌లో క్రాష్‌ టెస్ట్‌ని నిర్వహించింది. ఈ టెస్ట్‌లో మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను మహీంద్రా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్‌ ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మహీంద్రా సొంతంగా కారు క్రాష్‌ టెస్ట్‌ని నిర్వహించడం గమనార్హం. ఈ ఎస్‌యూవీ విడుదల రోజే 5 స్టార్ రేటింగ్‌ని సాధిస్తుందని మహీంద్రా వెల్లడించింది. దీంతో మహీంద్రా మార్క్‌ ధైర్యాన్ని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

దేశంలోనే మరే ఇతర కంపెనీ విడుదలకు ముందే క్రాష్‌ టెస్ట్‌ని చేయలేదు. తాజాగా విడుదలైన విజువల్స్ ప్రకారం 5 స్టార్‌ రేటింగ్‌ సాధ్యం అని భావిస్తున్నారు. ఫ్రంట్‌ కొలిషన్‌, సైడ్‌ ఇంపాక్ట్ టెస్ట్‌, రియర్‌ క్రాష్‌ టెస్ట్‌కి సంబంధించిన విజువల్స్‌ వీడియోలో చూడవచ్చు. 64 కిలోమీటర్ల వేగంతో ఈ XEV 9eని ఫ్రంట్ కొలిషన్‌ చేశారు. కారులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

Mahidnra XEV 9e Crash Test Visuals

గత ఏడాది నుంచి భారత్ NCAP కార్ల సేఫ్టీని రివ్యూ చేస్తోంది. అంతే కాకుండా గ్లోబల్‌ NCAPలో కూడా మంచి సేఫ్టీ స్కోరింగ్‌ని అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే మహీంద్రా స్వచ్ఛందంగా క్రాష్‌ టెస్ట్‌ని నిర్వహించి అబ్బురపరిచింది. GNCAP క్రాష్‌ టెస్ట్‌లో ఉండే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా దీనిని రూపొందించినట్లు క్రాష్‌ టెస్ట్‌ నిర్వహించినట్లు తేలింది. దీనితో పాటు బ్యాటరీ ప్యాక్ హీట్‌ అండ్‌ సేఫ్టీ టెస్ట్‌ని కూడా నిర్వహించారు.

ఈ టెస్టుల్లో ప్రయాణీకులకు మంచి సేఫ్టీ లభించినట్లు స్పష్టం అవుతోంది. కావున ఈ మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ అత్యంత సురక్షితమైన కారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా కారులోని అన్ని ఎయిర్‌బ్యాగ్స్‌ కొలిషన్‌ సమయంలో తెరుచుకున్నట్లు తేలింది. ఇక ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రూ. 21.90 లక్షల ఎక్స్‌ షోరూమ్ ధరతో విడుదల చేసింది.

ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 656 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇది 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అదే సమయంలో ఈ కారు 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ కూడా కలదు. ఈ బ్యాటరీ ప్యాక్స్‌ని 175 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 20 నిమిషాల్లో 20-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అంటే కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌తో 500 కి.మీ ప్రయాణించవచ్చు.

ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగ్స్‌, 360 డిగ్రీస్‌ కెమెరా, పార్కింగ్‌ సెన్సార్స్‌, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌, లెవల్‌ 2 ADAS టెక్‌ వంటివి ఉన్నాయి. ఈ కారుతో పాటు మహీంద్రా BE 6e ఎలక్ట్రిక్‌ కారుని కూడా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 18.90 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. ఈ కారు కూడా సేమ్‌ కాన్ఫిగరేష్స్‌తో వస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ ఒపీనియన్: ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు భారత్‌లో మంచి స్పందన వస్తోంది. ఇటువంటి పరిస్థితిలో తమ కారు మరింత సురక్షితమైనదని చూపించడం కోసం మహీంద్రా ఈ ప్రయత్నం చేసింది. ఇది వినియోగదారులకు నమ్మకాన్ని కల్పించనుంది. ప్రస్తుతం టాటా కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ కార్లు సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ని కలిగి ఉన్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, November 28, 2024, 11:08 [IST]
English summary
Mahindra xev 9e live crash test visuals gone viral
Read more on: #mahindra #crash test #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+