మొదలైన Mahindra XUV 3XO బుకింగ్స్ - డెలివరీలు ఎప్పుడంటే?

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఏప్రిల్ నెలలో తన XUV 3XO లాంచ్ చేసింది. కాగా బుకింగ్స్ స్వీకరించడం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో ఇప్పటికే అందుబాటులోకి ఉన్న టాటా నెక్సాన్, కియా సోనెట్ మరియు హ్యుందాయ్ వెన్యూకు ప్రత్యర్థిగా ఉన్న మహీంద్రా XUV 3XO కోసం కస్టమర్లు రూ. 21000 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లేదా మహీంద్రా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ కొత్త కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందించేలా రూపొందించబడింది.

Mahindra XUV 3XO

మల్టిపుల్ వేరియంట్లలో లభించే కొత్త మహీంద్రా XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికాంఘా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సీ-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉన్నాయి. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారులో కనెక్టెడ్ ఎల్ఈడీ తెలియిల్ లైట్స్ ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త మహీంద్రా XUV 3XOలో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అదే పరిమాణంలో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 7 స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో మరియు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

Mahindra XUV 3XO Rear View

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా మహీంద్రా XUV 3XO ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇసోఫిక్స్ యాంకర్లు, ఆటో హోల్డ్, హిల్ స్టార్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ డిస్క్ బ్రేక్ మతియు లెవెల్ 2 ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

మహీంద్రా XUV 3XO మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.2-లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ త్రీ సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్. ఇవన్నీ వరుసగా 111 హార్స్ పవర్, 131 హార్స్ పవర్, 117 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి.

Mahindra XUV 3XO Side View

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది మల్టిపుల్ కలర్స్ ఎంపికలలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కారు తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే ఈ కొత్త కారు ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది? ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా అనే మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 15, 2024, 13:00 [IST]
English summary
Mahindra xuv 3xo bookings start in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+