హాట్‌ కేకుల్లా బుకింగ్స్‌.. ఆ కారు డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది..!!

దేశంలో కారు ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XUV 3XO డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రారంభ ధర రూ. 7.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) సంస్థ నిర్ణయించింది. ఈ కారు పూర్తిగా ఫీచర్-ప్యాక్డ్ మరియు ప్రీమియం ఇంటీరియర్‌లతో రానుంది. ఈ కారుని విడుదల చేసినప్పటి నుంచి అమాంతం అంచనాలు పెరిగిపోయాయి.

మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్‌ ఆధారంగా ఈ కారు బుకింగ్స్‌ హాట్‌ కేకుల్లా సాగుతున్నాయి. ఈ కారు ఇంటీరీయర్‌ మరియు బయటి డిజైన్‌లో ఆధునిక టెక్నాలజీని మహీంద్రా & మహీంద్రా జోడించింది. ఇందులో ప్రయాణికులకు ఉన్నతమైన అనుభూతిని కల్పించే విధంగా ఇప్పటి వరకు వచ్చిన ఎక్స్‌యూవీలకు భిన్నంగా ఈ కారుని డిజైన్ చేసింది. బుకింగ్‌లు ప్రారంభమైన గంటలోపే 50,000 ఆర్డర్లతో ఈ కారు ఆటో రంగాన్ని కుదిపేసింది.

Mahindra-XUV-3XO-Delevery-Date

ఈ కారు డెలివరీలు వచ్చే వారం నుంచి (మార్చి 26) నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే కొన్ని ఎంపిక చేసిన వేరియంట్‌ల డెలివరీలు మాత్రమే ఆ సంస్థ చేయనుంది. మహీంద్రా XUV 3XO మొత్తం తొమ్మిది వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి MX1, MX2, MX2 Pro, MX3, MX3 Pro, AX5, AX5 లగ్జరీ, AX7 మరియు AX7 లగ్జరీ గా ఉన్నాయి.

పైన తెలిపిన వేరియంట్లలో AX5, AX5 L, MX3 మరియు MX3 ప్రోలు మాత్రమే డెలివరీలు మే 26, 2024న ప్రారంభమవుతాయి. ఇక AX7 మరియు AX7 L ట్రిమ్‌లను బుక్ చేసుకున్న కొనుగోలుదారులకు వచ్చే నెల లేదా జూలై ప్రారంభంలో వారికి కార్లు అందజేయబడతాయి. ఇక బేస్ వేరియంట్‌ MX1, MX2 మరియు MX2 ప్రో వేరియంట్‌ల డెలివరీలు జూన్ మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Mahindra-XUV-3XO

XUV 3XO 1.2L పెట్రోల్, 1.2L DI పెట్రోల్, 1.5L డీజిల్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. 1.2L గ్యాసోలిన్ ఇంజిన్‌ గరిష్టంగా 115 PS శక్తిని మరియు 200 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.2L DI పెట్రోల్ యూనిట్ 130 PS మరియు 250 Nm లను విడుదల చేస్తుంది. ఇక ఏకైక డీజిల్ ఇంజిన్ 117 PS వద్ద 300 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

పై వేరియంట్స్‌ అన్ని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లలో రానున్నాయి. 5-సీటర్‌లో ఫస్ట్‌ ఇన్-సెగ్మెంట్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉండనుంది. XUV 300 కంటే ఈ కారు అతి పెద్ద బూట్‌స్పేస్‌ను కలిగి ఉంది. ఇక ఫీచర్ల పరంగా చూస్తే వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

Mahindra-XUV-3XO

వీటితో పాటు XUV400 మాదిరిగానే 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, 7-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో, మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఫీచర్ల జాబితాలో ఉన్నాయి. (జిప్, జాప్ మరియు జూమ్). XUV700 వలె ESP టెక్నాలజీ, ప్రామాణికంగా 60:40 వెనుక స్ప్లిట్ సీటు, సెగ్మెంట్-మొదటి స్థాయి 2 ADAS సాంకేతికత మొదలైనవి ఉన్నాయి.

మహీంద్రా XUV 3XO టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు పోటీగా ఉంది. ఒక్కసారి మార్కెట్‌లోకి వస్తే అంచనాలకు మించి రాణిస్తుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, May 23, 2024, 19:25 [IST]
English summary
Mahindra xuv 3xo deliveries begin from may 26 here are the list of variants
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+