రూ.7.49 లక్షల మహీంద్రా కొత్త కారు డెలివరీలు షురూ.. ఈ కారులో ప్రతీ పార్టు సూపర్‌ హిట్టు

తాజాగా విడుదలైన మహీంద్రా XUV 3XO డెలివరీలు ప్రారంభం అయ్యాయి. ఈ కారు వివిధ వేరియంట్‌లలో స్మార్ట్‌ అప్‌గ్రేడ్‌లతో సంస్థ తీసుకువచ్చింది. మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్‌ ఆధారంగా ఈ సబ్-ఫోర్ మీటర్ SUVపై అంచనాలు భారీగా పెరిగాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కి అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా వచ్చింది.

కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి బ్రెజ్జాలకు ఈ కార్లు గట్టి పోటీని ఇవ్వనున్నాయి. ఈ కార్లను ఢీకొట్టాలనే లక్ష్యంతో ఈ కార్లను మహీంద్రా తీసుకువచ్చింది. మహీంద్రా XUV 3XO మొత్తం 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి MX1, MX2 , MX2 ప్రో, MX3 , MX3 ప్రో , AX5, AX5L, AX7 మరియు AX7L గా ఉన్నాయి.

Mahindra-XUV-3XO-Deliveries

ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా ఈ కారు ధరతోనే మహీంద్రా ఆశ్చర్యపోయేలా చేసింది. దీని ప్రారంభ ధర 7.49 లక్షలతో (ఎక్స్-షోరూమ్) సంస్థ విడుదల చేసింది. ఇంత తక్కువ ధరలో భారీ భద్రతా ఫీచర్లు మరియు సాంకేతిక సౌకర్యాలను మహీంద్రా అందిస్తోంది. అందువల్ల ఈ కారుని అధిక సంఖ్యలో జనాలు బుక్‌ చేసుకున్నారు. ఇంకా బుకింగ్స్‌లో ఈ కారు తన జోరును కనబరుస్తోంది.

ఈ కారు బుకింగ్స్‌ ఓపెన్‌ చేసినప్పటి నుంచి కేవలం గంటలోనే 50,000లకు పైగా బుకింగ్స్‌ని సాధించింది. మరే కారుకి సాధ్యం కానీ రీతిలో మహీంద్రా XUV 3XO బుకింగ్స్‌లో సత్తా చాటింది. ఎక్కువ వేరియంట్లు ప్రతీ వేరియంట్‌లో భిన్నమైన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేలా మహీంద్రా ఈ కార్లను రూపొందించింది. ప్రస్తుతం ఈ కారు ఆటోమోబైల్‌ విభాగంలో టాప్‌లో కొనసాగుతోంది. మళ్లీ రికార్డులను తిరగ రాసేందుకు సిద్ధం అయ్యింది.

Mahindra-XUV-3XO

ఇక ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే మహీంద్రా 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే సిస్టమ్, అలెక్సా, 7-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం, సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటును అందిస్తుంది. ఇంకా మరెన్నో స్మార్ట్‌అప్‌గ్రేడ్‌లతో ఈ కారులో గమనించవచ్చు.

ఈ కారులో అధునాత సేఫ్టీ ఫీచర్లను సంస్థ జోడించింది. భారీ అప్‌గ్రేడ్‌లతో మహీంద్రా స్టైల్‌ అధునాతన టెక్నాలజీలను ఇందులో ప్రవేశ పెట్టింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 4 చక్రాలలో డిస్క్ బ్రేక్‌లు, 3-పాయింట్ సీట్ బెల్ట్ మరియు ఐసో-ఫిక్స్ చైల్డ్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రీ-ఫిల్ మరియు లెవల్ 2 అడాస్‌ టెక్నాలజీ ఉన్నాయి.

మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో ఈ కారు అందుబాటులో ఉంది. 1.2-లీటర్ పెట్రోల్ మోటారుతో రెండు ఇంజిన్‌లు 109bhp వద్ద 200Nm టార్క్‌ను, అలాగే 129bhp వద్ద 230Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 115bhp మరియు 300Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ఇంజిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్‌ AMT మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి ఉంటాయి.

వీటిలో డీజిల్ AMT అత్యధిక మైలేజీని ఇస్తుంది. ఇది లీటరుకు 21.20 కి.మీ మైలేజీని అందిస్తుందని సంస్థ తెలిపింది. దీని పెట్రోల్ మోటార్ 17.96 kmpl నుంచి 20.10 kmpl మైలేజీని ఇచ్చే అవకాశం ఉంది. అయితే మహీంద్రాకు ఉన్న డిమాండ్‌.. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లను జోడించడంతో మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ని కొనేందుకు ఎక్కువ ఆసక్తి కనబరిచేలా చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, May 27, 2024, 14:05 [IST]
English summary
Mahindra xuv 3xo deliveries begin here the top features specifications about this new car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+