గంటలో 50,000లకు పైగా బుకింగ్స్‌.. డెలివరీ సమయంలో కస్టమర్ల సంబరాలు.. ఈ కారులో అంతగా ఏముంది?

మహీంద్రా XUV 3XO ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారీ మార్పులతో అందుబాటులోకి తెచ్చింది. భారతీయ రోడ్లకు తగినట్లుగా తక్కువ ధరలో పూర్తి అప్‌డేటెడ్స్‌తో అత్యంత సేఫ్టీ ఫీచర్లతో కారుని మార్కెట్‌లోకి మహీంద్రా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఎస్‌యూవీ డెలివరీలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ కారు డెలివరీ తీసుకున్న కస్టమర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. సరసమైన ధరలో అద్భుతమైన డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించడంతో పాటు స్మార్ట్‌ ఫీచర్లు అమితంగా ఆకట్టుకుంటున్నాయని మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారుకి సంబంధించిన డెలివరీ అప్‌డేట్స్‌ మరియు కారు ఫీచర్ల వివరాలు మీ కోసం..

Mahindra-XUV-3XO-Delivered

బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన గంటలో 50,000పైగా బుకింగ్స్‌ అందుకుంది. ధర తక్కువ కావడం సేఫ్టీ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ కారుని కొనేందుకు జనాలు ఆసక్తి కనబరిచారు. కేవలం రెండు రోజుల్లోనే 2,500 యూనిట్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు మహీంద్రా ప్రకటించింది. కస్టమర్లు తమ కొత్త కార్లను డెలివరీ చేస్తున్న వీడియోలను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఆయన అధికారిక ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ఆ వీడియోలను షేర్ చేశారు.

ఈ కొత్త మహీంద్రా XUV 3XO కొనుగోలు కోసం సమీప మహీంద్రా-అధీకృత డీలర్‌షిప్‌ లేదా బ్రాండ్ ఆన్‌లైన్‌ బుకింగ్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. మహీంద్రా XUV 3XO కారు ప్రారంభ ధర రూ.7.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. మొత్తం తొమ్మిది వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. వేరియంట్‌ని బట్టి ధరల్లో మార్పులు గమనించవచ్చు. ప్రస్తుతం కొన్ని వేరియంట్లు మాత్రమే డెలివరీకి అందుబాటులో ఉన్నాయి.

Mahindra-XUV-3XO-Deliveries

మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 108bhp పవర్ మరియు 200nm టార్క్‌ని విడుదల చేస్తుంది. 1.2-టర్బో GDi పెట్రోల్ ఇంజిన్ 129bhp పవర్ మరియు 230nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్‌ డీజిల్ ఇంజిన్‌ 115bhp పవర్ మరియు 300nm టార్క్‌ని విడుదల చేస్తుంది.

ఈ కారు ఇంజిన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ AMT గేర్ బాక్స్ ఆప్షన్‌లతో లభిస్తుంది. కొత్త మహీంద్రా ఎస్‌యూవీ లీటర్‌కి 18.89 కిలోమీటర్లు నుంచి 20.1 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది. ఈ ఈ కొత్త ఎస్‌యూవీలో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRL), కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, రివైజ్డ్ బంపర్, పెద్ద సెంట్రల్ ఎయిర్ టెక్, ఎల్‌ఈడీ హెడ్ లైట్లు ఉన్నాయి.

ఈ మహీంద్రా ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్ పెద్దగా మార్పులు లేవు. అయితే కొత్తగా డార్క్ క్రోమ్ ఫినిషింగ్‌ అల్లాయ్ వీల్స్ మునపటి ఎక్స్‌యూవీల కంటే భిన్నంగా ఉండనున్నాయి. వెనుక భాగం పూర్తిగా అప్‌డేటెడ్ టెయిల్ గేట్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో ఫుల్-లెంత్ ఎల్ఈడీ లైట్ బార్, బంపర్-ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ మరియు సీ-ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ 7 స్పీకర్ హర్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. ఇంకా సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ సిస్టమ్‌, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, May 30, 2024, 10:38 [IST]
English summary
Mahindra xuv 3xo deliveries crossed 2500 anand mahindra tweeted customers happiness on this
Read more on: #mahindra #new car #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+