కొత్తగా విడుదలైన మహీంద్రా కారులోని ఫీచర్లు టాటా నెక్సాన్‌లోను లేవు.. అందుకే ఎగబడి కొంటున్నారు!!

మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO కొన్ని నెలల క్రితం భారత్‌లో విడుదల అయ్యింది. ఈ కారు బుకింగ్స్‌ కూడా స్వీకరిస్తోంది. మే 26 నుంచి ఈ కారులోని కొన్ని వేరియంట్ల డెలివరీలు కూడా జరుగుతున్నాయి. గత రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 2500 యూనిట్లకు పైగా కార్లను మహీంద్రా డెలివరీ చేసింది. తాజాగా ఈ కారు బుక్‌ చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఈ కారులో ఉన్న ఫీచర్లు ఇతర ఇంజిన్‌ ఫర్ఫామెన్స్‌ ఆధారంగా టాటా నెక్సాన్‌తో నేరుగా పోటీ పడుతుంది. టాటా నెక్సాన్‌ ఈ కారుకి మధ్య ముఖ్యమైన తేడాలు మీకోసం..

పనోరమిక్ సన్‌రూఫ్: సన్‌రూఫ్ ఫీచర్ భారతదేశంలో ప్రాచుర్యం పొందుతోంది. మహీంద్రా మహీంద్రా XUV 3XOలో పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌లో తీసుకువచ్చింది. ఈ సెగ్మెంట్‌లో ఈ తరహా ఫీచర్ అందిస్తున్న కారు ఇదే కావడం విశేషం. కారు లోపల మంచి గాలిని, అవుట్ డోర్ వాతావరణాన్ని ఆస్వాదించే అనుభూతిని పొందడానికి ఈ ఫీచర్‌ని రూపొందించారు. కానీ టాటా నెక్సాన్ సింగిల్ ఫ్యాన్ సన్‌రూఫ్‌తో వస్తుంది.

Mahindra-XUV-3XO-Panoramic-Sunroof

లెవల్ 2 ADAS: కస్టమర్లకు మరింత సేఫ్టీ అందించడానికి మహీంద్రా మహీంద్రా XUV 3XOలో ఈ టెక్నాలజీతో అమర్చింది. గతంలో ఈ టెక్నాలజీని ఖరీదైన కార్లకు మాత్రమే అందించేవారు. ఈ టెక్నాలజీతో ఈ కారు కొన్ని విపత్కర పరిస్థితుల్లో ప్రయాణికుల్ని రక్షిస్తుంది. ఈ ఏడీఏఎస్ టెక్నాలజీలో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లున్నాయి. నెక్సాన్‌లో ఇవి లేవు.

డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్ కంట్రోల్: మహీంద్రా మహీంద్రా XUV 3XO డ్యూయల్ జోన్‌ క్లైమేట్ కంట్రోల్‌తో వస్తుంది. ఇది డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్‌కి అవసరమైన ఉష్ణోగ్రతను ఉంచడానికి అనుమతిస్తుంది. ప్రత్యేక కూలింగ్ ఆప్షన్‌ని కలిగి ఉంది. దూర ప్రయాణాలకు ఇది అనువుగా ఉంటుంది. భారతదేశం వంటి వేడి వాతావరణానికి ఇది చాలా ముఖ్యమైన అంశం. టాటా నెక్సాన్‌లో సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ తో వస్తుంది.

Mahindra-XUV-3XO-Duel-Zone-AC

స్టీరింగ్ మోడ్ & బిగ్‌ వీల్స్‌: మహీంద్రా XUV 3XOలో మూడు స్టీరింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీలో 3 స్టీరింగ్ మోడ్‌ ఆప్షన్‌తో వచ్చిన మొదటి కారు ఇదే. ఇది సిటీ రైడ్‌లో తేలికగా ఉంటుంది. హైవేపై ఉన్నప్పుడు బరువుతో కూడిన స్టీరింగ్‌ అనుభూతి పొందవచ్చు. ఈ కారు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పై ప్రయాణిస్తుంది.

ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్: మహీంద్రా XUV 3XOలో ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌ను అమర్చారు. ఒక బటన్ నొక్కితే కారు కదలకుండా ఆగిపోతుంది. ఇది సెంటర్ కన్సోల్ ప్రాంతంలో ఎక్కువ స్థలాన్ని ఆదా చేస్తుంది. మరోవైపు, టాటా నెక్సాన్ ఇప్పటికీ మాన్యువల్ పార్కింగ్ బ్రేక్‌ని ఉపయోగిస్తుంది.

Mahindra-XUV-3XO-Electronic-Parking-Break

మహీంద్రా తన ప్రత్యర్థి కంపెనీల కంటే 3XOలో అనేక కొత్త రకాల ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇది పాపులర్ టాటా నెక్సాన్ కంటే మరింత కొత్తగా ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ కారుపై పడిందని చెప్పవచ్చు. భారీ సేఫ్టీ ఫీచర్లు, అధునాతన టెక్నాలజీ మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఈ కారులో లభించే అవకాశం ఉంది. అందుకే ఈ కారుని జనాలు ఎగబడి బుక్‌ చేసుకుంటున్నారు.

ఈ కారు మొత్తం తొమ్మిది వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన 60 నిమిషాల్లో 50,000 లకు పైగా కస్టమర్లు బుక్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారు ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిని బుక్‌ చేసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. మహీంద్రా కారు టాటా కార్లకు గట్టీ సవాళ్లను విసురుతోంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 30, 2024, 17:48 [IST]
English summary
Mahindra xuv 3xo equipped with newly advanced features vs nexon regular features
Read more on: #mahindra #new car #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+