టాటా కార్లను ఇప్పటికే కోలుకోలేని దెబ్బతీసిన మహీంద్రా.. మరో బ్రహ్మాస్త్రంతో వచ్చేస్తుంది!

మహీంద్రా కంపెనీ ఇండియా మార్కెట్లోకి అధునాతన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతుంది. ఈ మోడల్ పేరు 'ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఈవీ (XUV 3XO EV)'. ఇప్పటికే కంపెనీ ఈవీలలో తన వాటాను పెంచుకోవడానికి చాలా మోడళ్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుండగా, ఇప్పుడు తీసుకొస్తున్న XUV 3XO ఏకంగా టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ EVకి ప్రత్యర్థిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కారును టెస్టింగ్ చేస్తున్నారు. టెస్టింగ్ చేస్తున్నటుంటి ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఇది రాబోయే నెలల్లో మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర రూ.15.00 లక్షల నుంచి మొదలుకుని రూ.18 లక్షల వరకు ఉంటుందని అంచనా.

ఈ కారు కొత్త బంపర్‌తో వచ్చింది. ముందు డిజైన్ చాలా అందంగా ఉంది. వెనుక భాగంలో సిగ్నేచర్ L-ఆకారంలో LED లైట్లు ఉన్నాయి. లోపల, క్యాబిన్ డ్యూయల్-టోన్ బ్లాక్, లేత గోధుమరంగు థీమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ICE వేరియంట్‌ మాదిరిగా ఉంది. కారులో కూర్చున్నప్పుడు లగ్జరీ అనుభూతిని కలిగిస్తుంది. వెంటిలేషన్‌తో కూడిన లెథెరెట్ సీట్లతో పాటు అనేక ప్రత్యేకమైన పెయింట్స్‌ను ప్రత్యేకంగా కారు లోపల అందించారు.

Mahindra XUV 3xo Ev Cover

క్యాబిన్‌లో ఫ్రీ-స్టాండింగ్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS,చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు వంటి ఆప్షన్లు ఉన్నాయి. అల్లాయ్ వీల్స్ ICE వెర్షన్ మాదిరిగానే ఉన్నాయి.

ఇంకా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో కూడిన అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)ను కారులో ఉన్నాయి. బ్యాటరీ ఛార్జింగ్ పోర్ట్ కారుకు ఎడమ వైపున ఉంటుంది. కారు రూఫ్ గోల్డెన్ కలర్‌లో ఉంది. బ్యాటరీ-ఆధారిత కౌంటర్‌పార్ట్ రౌండ్ ఫాగ్ ల్యాంప్‌ను కూడా ప్రత్యేకంగా అందించారు.

Mahindra XUV 3xo Ev Spotted For Test

XUV 3XO EV బ్యాటరీ విషయానికి వస్తే, 34.5 kWh, 39.5 kWh రెండు బ్యాటరీ ప్యాక్‌లను అందించే అవకాశం ఉంది. చిన్న బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్‌తో 375 కి.మీల రేంజ్ వరకు, అదే పెద్ద బ్యాటరీ 456కి.మీల వరకు రేంజ్‌ను అందించవచ్చని తెలుస్తుంది. ప్రధానంగా 150bhp పవర్ వద్ద 310Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను కారులో అందించారు.

ముఖ్యంగా మహీంద్రా కంపెనీ ఛార్జింగ్ సమస్యపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో XUV 3XO EVలో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని ఇచ్చారు. దీంతో బ్యాటరీ ఛార్జింగ్ సమయం చాలా వరకు తగ్గిపోనుంది. ఈ మోడల్ ముఖ్యంగా టాటా నెక్సాన్ EVకి గట్టి పోటీగా నిలవనుంది. అలాగే, టాటా కర్వ్ EV, MG ZS EV లకు కూడా ప్రత్యర్థిగా ఉంటుంది.

Mahindra XUV 3xo Ev Top Features

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, October 26, 2024, 10:30 [IST]
English summary
Mahindra xuv 3xo ev top upgrades and key expectations check here
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+