10 నిమిషాల్లో 21000.. 60 నిమిషాల్లో 50000: అదరగొట్టిన Mahindra XUV 3XO బుకింగ్స్
మహీంద్రా కంపెనీ తన XUV 3XO కారును గత నెలలో లాంచ్ చేసింది. అయితే బుకింగ్స్ మాత్రం నిన్నటి(మే 15) నుంచి ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
మహీంద్రా తన XUV 3XO కోసం కేవలం 21000 రూపాయలతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన 10 నిమిషాల్లో 27000 బుకింగ్స్, 60 నిమిషాల్లో (గంట) ఏకంగా 50000 బుకింగ్స్ పొందినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో మహీంద్రా కొత్త కారుకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది. డెలివరీలు మే 26 నుంచి ప్రారంభమవవుతాయి.

ఇప్పటికే కంపెనీ 10000 కంటే ఎక్కువ XUV 3XOలను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 9000 యూనిట్లుగా నిర్ణయించారు. XUV 3XO మొత్తం 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ SUV ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు కాగా.. టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).
అద్భుతమైన డిజైన్ కలిగిన మహీంద్రా XUV 3XO ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సీ-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉన్నాయి. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారులో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఎల్ఈడీ టెయిల్ లైట్ పూర్తి వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది మోనోటోన్ మరియు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

డిజైన్ మాత్రమే కాకుండా ఈ కొత్త XUV 3XO కారులో వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
మహీంద్రా కంపెనీ యొక్క ఇతర మోడల్స్ మాదిరిగానే XUV 3XO కూడా లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇసోఫిక్స్ యాంకర్లు, ఆటో హోల్డ్, హిల్ స్టార్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ డిస్క్ బ్రేక్, లెవెల్ 2 ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

మహీంద్రా XUV 3XO మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.2-లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ త్రీ సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్. ఇవన్నీ వరుసగా 111 హార్స్ పవర్, 131 హార్స్ పవర్, 117 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








